తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment