
ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు
తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
చెన్నై: తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు.