TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు | Bomb Threatening Calls To Tamilnadu Schools | Sakshi
Sakshi News home page

తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Published Mon, Mar 4 2024 11:25 AM | Last Updated on Mon, Mar 4 2024 11:27 AM

Bomb Threatening Calls To Tamilnadu Schools - Sakshi

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్‌, కాంచీపురంలలో సోమవారం( మార్చ్‌ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్‌ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది.  

బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబు స్క్వాడ్‌ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్‌ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. 

ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్‌.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement