తూత్తుకుడి ప్లాంట్‌ విక్రయించం | Vedanta says not selling Thoothukudi copper plant | Sakshi
Sakshi News home page

తూత్తుకుడి ప్లాంట్‌ విక్రయించం

Published Sat, Jun 24 2023 4:30 AM | Last Updated on Sat, Jun 24 2023 4:30 AM

Vedanta says not selling Thoothukudi copper plant - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్‌ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది.

స్టెరిలైట్‌ కాపర్‌ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్‌ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్‌కు డిమాండ్‌ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement