Sterlite
-
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
ఐపీవోలకు మరో మూడు కంపెనీలు రెడీ...!
న్యూఢిల్లీ: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతూ బుల్ జోరు చూపుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్ సైతం పలు ఇష్యూలతో సందడి చేస్తోంది. గత వారం రోజుల్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా.. ప్రస్తుతం మరో మూడు కంపెనీలు ఇదే బాట పట్టాయి. ఇక ఇటీవలే ఐపీవోలు ముగించుకున్న నాలుగు కంపెనీలు సోమవారం(16న) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా సెబీ తలుపు తడుతున్న కంపెనీల జాబితాలో మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ చేరాయి. వివరాలు చూద్దాం.. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!) మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఫార్మసీ రిటైల్ చైన్.. మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,639 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో రూ. 1,039 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ఫ్యురో ఇన్వెస్ట్మెంట్స్ రూ. 450 కోట్లు, పీఐ అపార్చునిటీస్ ఫండ్–1 రూ. 500 కోట్లు చొప్పున వాటాలను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీతో లభించే నిధులను అనుబంధ సంస్థ ఆప్టవల్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్ కంపెనీ స్టెరిలైట్ పవర్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. రూ. 1,250 కోట్ల సమీకరణకు అనుమతించవలసిందిగా సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా ఉద్యోగులకు సైతం షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను ప్రత్యేకించిన కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఐపీవోకు ముందు షేర్ల జారీ ద్వారా రూ. 220 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో విద్యుత్ పంపిణీ మౌలికసదుపాయాల కంపెనీ పేర్కొంది. రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ ప్రయాణాలు, ఆతిథ్య రంగ టెక్సాలసీ సర్వీసులందించే రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు మరో 2.26 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా వ్యాగ్నర్ లిమిటెడ్ 1.71 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీతో లభించే నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లకు వెచ్చించనుంది. (చదవండి: ఆపిల్ కంపెనీకి భారీ షాక్..!) -
లక్ష్మీ విలాస్ బ్యాంక్- స్టెర్టెక్.. జూమ్
ఊగిసలాట మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 96 పాయింట్లు పుంజుకుని 39,140ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,547 వద్ద ట్రేడవుతోంది. కాగా.. సానుకూల వార్తల నేపథ్యంలో ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఆప్టికల్ ఫైబర్ సేవల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో ఈ రెండు కౌంటర్లూ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్లిక్స్ గ్రూప్‌తో విలీనానికి వీలుగా సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకున్నట్లు లక్ష్మీ విలాస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. రెండు సంస్థల మధ్యా ఇందుకు అవసరమైన పరిశీలన పూర్తయినట్లు తెలియజేసింది. ఈ ఏడాది జూన్‌లో క్లిక్స్ గ్రూప్‌ను బ్యాంకులో విలీనం చేసుకునేందుకు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. తద్వారా క్లిక్స్ క్యాపిటల్కున్న రూ. 1900 కోట్ల ఫండ్‌తోపాటు.. రూ. 4,600 కోట్ల ఆస్తులు బ్యాంకుకు బదిలీకానున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేరు జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 22.40 వద్ద ఫ్రీజయ్యింది. స్టెరిలైట్ టెక్నాలజీస్ ఆధునిక ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్టెరిలైట్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. తద్వారా కస్టమర్లకు ప్రపంచస్థాయి సర్వీసులను ఎయిర్టెల్ అందించే వీలుంటుందని తెలియజేసింది. ఎయిర్‌టెల్‌కు చెందిన 10 సర్కిళ్లలో ఆప్టికల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తాజా నెట్వర్క్ ద్వారా 5జీ, ఫైబర్ టు హోమ్, ఐవోటీ తదితర సర్వీసులను ఎయిర్టెల్ సమర్ధవంతంగా అందజేయవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో స్టెరిలైట్ టెక్నాలజీస్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 165 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 167 వరకూ ఎగసింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
స్టెరిలైట్ పరిశ్రమపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించడాన్ని అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించడంతో పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. (స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!) -
స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని వివాదాస్పద స్టెరిలైట్ కర్మాగారాన్ని మళ్లీ తెరవాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబునల్ శనివారం ఆదేశాలు ఇచ్చింది. తుత్తుకుడిలోని వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్ ప్యాక్టరీని మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబునల్ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
గురి పెట్టి కాల్చి చంపారు!
ప్రజల్ని గురిపెట్టి తూపాకులతో కాల్చి మరీ చంపేశారని పోలీసులపై మక్కల్ విచారణ ఇయక్కం ఆరోపించింది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాలతో కూడిననివేదికను సోమవారం ఆ ఇయక్కం విడుదల చేసింది. కాగా, స్టెరిలైట్ పరిశ్రమకు పడ్డ తాళాన్ని తొలగించేందుకు తగ్గ ప్రయత్నాల్ని ఆ యాజమాన్యం వేగవంతం చేసింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. సాక్షి, చెన్నై : తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. మే 22వ తేదీ సాగిన ర్యాలీ అల్లర్లకు దారితీసింది. దీంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ సాగుతూ వస్తోంది. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర కమిషన్ వేర్వేరుగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్, సీబీసీఐడీ నేతృత్వంలో... ఇలా అన్ని వైపులా విచారణసాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటనపై మక్కల్ విచారణ ఇయక్కం సైతం విచారణజరిపింది. కొన్ని రోజుల పాటు తూత్తుకుడిలో తిష్టవేసి పలు వర్గాల నుంచి సేకరించిన సమాచారాలు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, వివరాల మేరకు ఈ ఇయక్కం నివేదికను సిద్ధం చేసింది. నివేదికలో తేటతెల్లం కాల్పుల ఘటనపై ఇప్పటికే పోలీసులు, తూత్తుకుడి జిల్లా యంత్రాంగం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూర్చే రీతిలో తాజా నివేదికలోని అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నివేదికను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ విడుదల చేయగా, వర్తక సంఘం నేత వెల్లయ్యన్ అందుకున్నారు. అందులోని వివరాల మేరకు.. ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చడీచప్పుడు కాకుండా పోలీసులు రాత్రికి రాత్రే 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదని స్పష్టంచేశారు. ర్యాలీలో తమ కుటుంబాలతో కలిసి ప్రజలు పాల్గొన్నాయని, శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా పోలీసుల లాఠీ చార్జ్, తూటాలు ప్రజల్లో భయాందోళన సృష్టించాయని వివరించారు. లాఠీచార్జ్ తదుపరి యూనిఫాంలో లేని (మఫ్టీలో ఉన్న) వాళ్లు వాహనాల మీద ఎక్కి నేరుగా ప్రజల్ని గురిపెట్టి మరి తుపాకులతో కాల్చి పడేశారని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాకీ కాల్పుల సమయంలో పాటించా ల్సిన ఏ ఒక్క నిబంధనల్ని పోలీసులు అనుసరించలేదని, నేరుగా ప్రజల మీద గురిపెట్టి మట్టు బెట్టే రీతిలో కాల్పులు సాగించారని స్పష్టంచేశారు. ఇందులో విద్యార్ధిని నాన్సీ మరణం కూడా ఉందని పేర్కొన్నారు. ఇలా మరెన్నో వివరాలను అందులో పొందుపరిచారు. ఉన్నతాధికారుల్ని విచారించాలి తూత్తుకూడి కాల్పుల ఘటనపై పూర్తిగా విఫలమైన ఆ జిల్లా యంత్రాంగం, విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసులు, దీని వెనుక ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్ని విచారించాల్సిన అవసరం ఉందని మక్కల్ విచారణ ఇయక్కం సూచించింది. తూత్తుకుడిలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా, పోలీసులు మాత్రం హడావుడి సృష్టిస్తూనే ఉన్నారని, అరెస్టులు, బలవంతపు నిర్భందాలు సాగుతూనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఇయక్కం ప్రతినిధులు హరి భరదన్, తిలక్ సెల్వరాజ్, షా విశ్వనాథన్, కృష్ణ దాసు గాంధీ, కవిత, గీత, రోశయ్య, రాందాసు తదితరులు పాల్గొన్నారు. తాళం తెరిచేనా? మూతపడ్డ పరిశ్రమను తెరిచేందుకు స్టెరిలైట్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిశ్రమలోని రసాయనాలను ప్రస్తుతం ఆ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధులకు హాజరవ్వాలని యాజమాన్యం ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది. ఈ పరిశ్రమలో రెండు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న సిబ్బంది తూత్తుకుడిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ విధులకు హాజరు కావాలని ఆ యాజమాన్యం ఆదివారం ఆదేశాలు నుంచి వెళ్లడం, సోమవారం ఉదయాన్నే పరిశ్రమ వద్ద సిబ్బంది గుమిగూడడం చోటు చేసుకున్నాయి. పరిశ్రమకు అనుబంధంగా ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ వద్ద సిబ్బంది అందరూ ఏకం అయ్యారు. అందరూ రిజిస్టర్లో సంతకాలు చేశారు. విధులకు హాజరు అవుతున్నట్టుగా సంతకాల తదుపరి, అక్కడే సిబ్బందితోపాటు ఆ పరిశ్రమ అధికారులు సమావేశం కావడం గమనార్హం. -
రజనీని ప్రశ్నించిన యువకుడు ..వైరల్ వీడియో
-
జనాగ్రహం
-
అసెంబ్లీలో తూత్తుకుడి అలజడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తూత్తుకుడి ఘటనపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కాస్తంత దిగివచ్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా మంగళవారం డీఎంకే సభ్యులు నలుపు రంగు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తూత్తుకుడిలో పోలీసు కాల్పుల అనంతరం తీసుకున్న నష్ట నివారణ చర్యలు, స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార అన్నాడీఎంకే సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం వాటిని కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే కేబినెట్‌ను సమావేశపరిచి స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేస్తూ తీర్మానం చేయాలని పేర్కొంది. ఆ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమంటూ డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వేదాంత గ్రూప్ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ రెండోదశకు ఇచ్చిన 342.22 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 13 మంది మరణానికి కారణమైన పోలీసు కాల్పులపై సీబీ–సీఐడీ విచారణకు ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్ కర్మాగారం కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ప్రజలు ఆందోళన చేయడం తెల్సిందే. -
తలకెక్కని ‘వేదాంత’ సారం
స్టెరిలైట్ కాపర్ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్ కార్బయిడ్ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు పోలీసులు గురి చూసి పెట్టిన అసాల్ట్ రైఫిళ్లతో ఒక పోలీసు వాహనం మీద కనిపించిన దృశ్యమే ట్యుటికోరన్ మరణాల సంగతేమిటో నిర్వచిస్తుంది. ఆ పోలీసుల గురి స్టెరిలైట్ కాపర్ వ్యతిరేక ఆందోళనకారులే. తూటాలు తమను తాకుతాయని వారెవరికీ తెలియదు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆ కర్మాగారానికి వ్యతిరేకంగా వారు జరుపుతున్న నిరసన కార్యక్రమం వందోరోజుకు చేరిన సందర్భంగా ఆ జనం ట్యుటికోరన్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరారు. అప్పుడే కాల్పులు జరిగాయి. అయితే ఒక విషయం వినాలి. మే 22వ తేదీ రాత్రి ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసిన ఆడియోలోని మాటలవి. అందులో ఉన్న మరొక గొంతు, బహుశా మరొక పోలీసు గొంతు కావచ్చు. అదే ఈ మొత్తం ఘట్టాన్ని ఒళ్లు గగుర్పొడిచేటట్టు చేసింది. ఈ హత్యలు ఒక ప్రణాళిక ప్రకారం జరిగినవని కూడా ఆ మాటల వల్ల రూఢి అవుతున్నది. ‘కనీసం ఒకడైనా చావాలి...’ అంటూ ఇచ్చిన సూచన అందులో వినపడుతుంది. ఇలాంటి పైశాచిక వాంఛ తమిళభాషలో ఒక కమాండో నోటి నుంచి వెలువడింది. ఆ ఆయుధం భగ్గుమంది. ఒక్కవారం లోపుననే ట్యుటికోరన్ ఆందోళనలలో 13 మంది చనిపోయారు. మృతుల శరీరాల మీద పొత్తికడుపు పై భాగంలోనే తూటాలు చేసిన గాయాలు కనిపించాయి. ట్యుటికోరన్లోనే మరొకచోట, మరొక వీడియో కూడా వెలుగుచూసింది. ఇందులో దయాదాక్షిణ్యాలు లేని ప్రభుత్వ వైఖరి కళ్లకు కడుతోంది. తుపాకీ తూటా తగిలి ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల ఒక యువకుడు రోడ్డు మీద పడిపోయాడు. ఒక పోలీసు తన లాఠీతో ఆ శవాన్ని కదుపుతూ అన్నాడు, ‘‘నాటకాలు చాలు, ఇక్కడ నుంచి పో!’’ ఇలాంటి పైశాచికత్వాన్ని ‘సామూహిక హత్యాకాండ’, రాజ్యహింస’ వంటి మాటలతో కాకుండా మరే ఇతర మాటలతో వర్ణించగలం? ఈ రెండు పదబంధాలను ఇప్పటికే ప్రతిపక్షాలు ఉపయోగించాయి కూడా. తన ప్రజల మీదే ప్రభుత్వం తుపాకులు ఎక్కుపెట్టిన చోటు అది. స్త్రీలు పురుషులు పక్షుల్లా రాలిపోవడం మొదలైన చోట ప్రభుత్వాలు నిందారోపణల రాజకీయం ఆరంభించిన సందర్భమది. గడచిన వారం ట్వీటర్లు దీనిని ‘టీఎన్ జలియన్ వాలాబాగ్’అని పేర్కొన్నారు. 99 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘోర రక్తకాండ మాటలకందని విషాదం. అది కూడా (ఆనాటి) ప్రభుత్వ వైఖరిని చాటుతుంది. ట్యుటికోరన్ ఆందోళన హింసాత్మకమైన మాట నిజమే. అయితే అది హింసాత్మకమవుతుందన్న సూచనలు ముందే అందాయి. ఇంకా చెప్పాలంటే కాల్పుల ఘటనకు ముందు 99 రోజుల పాటు శాంతియుతంగానే జరిగిన ఆందోళన తమిళనాడు అధికార కేంద్రం సెయింట్ జార్జి కోటలో ఒక్క ఆకును కూడా కదపలేకపోయింది. అందుకే పతాక సన్నివేశంలో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ఉత్పాతం గురించి మొదటే గుర్తించినవారిలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రమేశ్ కూడా ఒకరు. వేదాంత గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ రమేశ్ మే 22వ తేదీన 144వ సెక్షన్ విధించి నిషేధాజ్ఞలు అమలు చేయవలసిందిగా పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆందోళనకారులు ఆరోజే ఊరేగింపు నిర్వహించారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ పంచిన కరపత్రాలను కూడా ఆయన పరిశీలించారు. ‘‘ఆందోళనకారులు శాంతియుతంగా ఉద్యమించే ఆలోచనలో లేరని అందులోని మాట లను బట్టి తెలుస్తున్నది’’ అని కోర్టు తన ఆదేశాలలో పేర్కొన్నది కూడా. ఆందోళన శాంతిభద్రతల సమస్యకు దారి తీయవచ్చునని, అందుకే 144 సెక్షన్ విధించాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సూచించి నట్టు కూడా న్యాయస్థానం పేర్కొన్నది. జిల్లా యంత్రాంగానికి గూఢచారి నివేదికలు కూడా పోలీ సుల ద్వారా అందినట్టు సమాచారం ఉంది. ట్యుటికోరన్ కలెక్టర్ కార్యాలయం మీద విధ్వంసక దాడి జరగవచ్చునని ఆ సమాచారంలో తెలియచేశారు. అతి వాదశక్తులు స్టెరిలైట్ వ్యతిరేకోద్యమంలో చొరబడ్డాయని కూడా నిఘా వ్యవస్థల సమాచారం తెలిపింది. అయినప్పటికీ 20,000 మంది ఆందోళనకారులను అదుపు చేయడానికి కొన్ని వందల మంది పోలీసులను మాత్రమే నియోగించారు. ఆందోళనకారుల ధోరణి కూడా దురదృష్టకరం. అల్లరిమూకలు దాదాపు 30 ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశాయి. కొన్ని కార్లను ధ్వంసం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసి, కిటికీల అద్దాలను పగులకొట్టాయి. అంతిమంగా కలెక్టర్ కార్యాలయంలోని దస్త్రాలకు అల్లరిమూకలు నిప్పు పెట్టడం ఆరంభించగానే పోలీసులు కాల్పులు జరి పారు. బాష్పవాయువు, వాటర్ కేనన్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. అల్లరిమూకలను అదుపు చేయడానికీ, చెదరగొట్టడానికీ రబ్బర్ బులెట్లు ఎందుకు ఉపయోగించలేదో స్పష్టంగా తెలి యడం లేదు. చాలా టీవీ ఫుటేజ్లలో నమోదైనట్టు ట్యుటికోరన్ పోలీసులు తమ వద్ద ఉన్న అసాల్ట్ తుపాకులను కాల్చారు. అయితే ఇదంతా ప్రజలు ఉన్మాద స్థితికి చేరడం వల్లనే జరిగిందా? అన్ని ప్రభుత్వాల మాదిరిగానే తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని సంఘ వ్యతిరేకశక్తులు చేతిలోకి తీసుకున్నాయని చెప్పింది. కానీ చూడబోతే తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితికి వచ్చే వరకు వేచి ఉన్నదనే అనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి వస్తే అదుపు చేయడానికి తమ వద్ద ఆయుధాల ఉన్నాయన్న ధైర్యం సర్కారుకు ఉందని అనిపిస్తుంది. దీనితో పాటు చావులను చూడాలన్న కోరిక కూడా వారి పెదవుల మీద పలికింది– కనీసం ఒకరైనా చావాలి! స్టెరిలైట్ కాపర్ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్ కార్బయిడ్ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు. ఈ కర్మాగారం కారణంగా ఊపిరి తీసుకోవడం సమస్యగా మారిందనీ కళ్లు మండుతున్నాయనీ చర్మరోగాలు సోకుతున్నాయనీ క్యాన్సర్ బారిన పడడం పెరిగిందనీ ఆరోపిస్తూ చుట్టుపక్కల పది గ్రామాల వారు ఆక్రోశిస్తూ ఉంటారు. రాగిని పరిశుభ్రం చేయడం వల్ల వెలువడే పదార్థాలతో అక్కడి నీరు కలుషితమైందనీ రాగి నుంచి వచ్చిన వ్యర్ధాన్ని పడవేయడం వల్ల అక్కడి నదిలో ప్రవాహానికి ఆటంకంగా మారిందనీ వారి ఆరోపణ. ట్యుటికోరన్ కర్మాగారం సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణ అధికారులు కూడా మొదట పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు విషవాయువు విడుదలైందన్న ఆరోపణతో 2013 మార్చిలో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని ఆదేశించింది. కానీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు మాసాల తరువాత తిరిగి తెరవడానికి ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం మార్చిలో కూడా తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు కార్యకలాపాల నిర్వహణ అనుమతి పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో మరోసారి ఈ సంస్థ తాత్కాలికంగా మూతపడింది. కానీ స్థాని కులు ఈ కర్మాగారం శాశ్వతంగా మూత పడాలని కోరారు. ఇంతలోనే జరగవలసిన నష్టం జరిగింది. ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఈ నెల 28న ఆదేశించింది. ఈ కర్మాగారం విస్తరణకు ఉద్దేశించిన భూకేటాయింపును కూడా రద్దు చేసింది. కానీ ఈ మూసివేత ఆదేశాలు ఇప్పుడే ఎందుకు; ఇంత ఆలస్యంగా ఎందుకు? ఇవే అసలు ప్రశ్నలు. సమస్యలకు ప్రజలే పరిష్కారం చూసుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉద్దేశం కాబోలు. కాలుష్య నివారణ బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసి ఉండవలసింది. ఆ కర్మాగారం మూసివేతకు మే 28 కాకుండా, ఒక్క రెండు వారాల ముందు నిర్ణయం తీసుకోవడానికి అడ్డు పెట్టినవారెవరు? అప్పుడు ఆ నిర్ణయం అమలు జరిగి ఉంటే ఆ కర్మాగారం మూసివేత కోసం 13 మంది ప్రాణాలు గాలిలో కలసి ఉండేవి కావు. స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి కావాలంటూ ప్రజలు గాంధీ మార్గంలో ఆందోళన చేసినంత సేపు ప్రభుత్వాలు కదలవు. వారు ఆగ్రహించి ప్రతాపాన్ని చూపిస్తే డెత్ వారెంట్‌తో స్పందిస్తాయి. ఇది భారతదేశంలో పరిపాలన తీరు. కానీ ఇది సరి పోతుందా? కాకపోవచ్చు. ఏకపక్షంగా కర్మాగారాన్ని మూసివేయడం గురించి వేదాంత గ్రూప్ యాజమాన్యం కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వాల నిర్ణయం వాదనకు నిలబడదు. కానీ క్షేత్రస్థాయిలో అదే ప్రాంతంలో మరోసారి కర్మాగారాన్ని ప్రారంభించడం మాత్రం వేదాంత గ్రూపునకు అసాధ్యం. నిజానికి దేశంలో ఉత్పత్తి అయ్యే రాగిలో 40 శాతం ట్యుటికోరన్ కర్మాగారం ద్వారానే జరుగుతుంది. దాదాపు 800 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ట్యుటికోరన్ కర్మాగారం ఏటా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల రాగిని తయారు చేస్తుంది. దేశంలో రాగి అవసరాల కోసం మరో రూ. 2,500 కోట్ల ఖర్చుతో మరో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి కూడా ఆ సంస్థ విస్తరణ పథకాలు సిద్ధం చేసింది. దీనితో 2000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని స్థానికులకు సంస్థ చెప్పింది. కర్మాగారం మూసివేతతో ఈ మేరకు ఆర్థిక పరమైన మూల్యం తప్పదు. కానీ ఈ కర్మాగారం నెమ్మదిగా ప్రజల ప్రాణాలను హరిస్తుంది. అలాగే పర్యావరణానికి కూడా ముప్పు. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై/తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న ‘స్టెరిలైట్’రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్’రాగి కర్మాగారాన్ని మూసేయాలని వంద రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమవడం, పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడం తెల్సిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. కాగా, సోమవారం కేబినెట్ భేటీ అనంతరం ఈ ప్లాంట్‌ను మూసేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ జీవో విడుదలైన వెంటనే ట్యుటికోరిన్ జిల్లా అధికారులు స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు సీల్ వేశారు. 22 ఏళ్లుగా ఆందోళన వేదాంత లిమిటెడ్‌కు చెందిన ‘స్టెరిలైట్’కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో నాలుగు లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో 1996లో ప్లాంటు స్థాపించి రాగిని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ మైనింగ్‌తో భూగర్భ జలాలు తగ్గుతాయని, ఉద్గారాలు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, కేన్సర్ వంటి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ మూసివేతకు అప్పటి సీఎం జయలలిత ఆదేశించారు. ప్లాంటు కాలుష్యంపై తీసుకున్న చర్యలు తెలపాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను వెంటనే విచారించలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. -
స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణకు హైకోర్టు బ్రేక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా జరుగుతున్న నిరసన, ఆందోళన హింసాత్మకంగా మారడంపై కోర్టు గురువారం స్పందించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. వివాదాస్పద పారిశ్రామిక యూనిట్ ప్రతిపాదిత విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లోని మదురై బెంచ్ ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణానికి ప్రజల అనుమతి పొందాలని తెలిపింది. ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు తాజా పిటిషన్ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. కాగా వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర నాయకులు పోలీసుల దమనకాండపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
తూత్తుకుడిలో పోలీసులు కాల్పులు 11 మంది మృతి
-
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్) మళ్లీ రణరంగంగా మారింది. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ చెలరేగిపోయారు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఆందోళనలో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ఉదయం నుంచి మొదలై... స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 20 వేల మంది మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే వారిని మరోచోట ఆందోళన నిర్వహించుకోవాలంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. తొలుత పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ ఆందోళనకారులు విజృంభించటంతో కాల్పులు జరపగా 9 మంది మృతి చెందారు. -
తూత్తుకుడిలో హింసాత్మక ఘటన
-
అట్టుడుకుతున్న తూత్తుకుడి!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో తూత్తుకుడిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... స్టెరిలైన్ కంపెనీని మూసివేయాలంటూ మంగళవారం ఆందోళనకారులు వేలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తూత్తుకుడిలో పోలీసుల లాఠీచార్జ్ ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
8న కోలీవుడ్ ఆందోళన
కావేరి బోర్డుకు మద్దతుగా, స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా పోరుబాటకు కోలీవుడ్ కదిలింది. ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టం వేదికగా దక్షిణ భారత నటీనటుల సంఘంతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 9గంటల నుంచి, మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సాగుతుంది. దీని గురించి దక్షిణ భారత నటీనటుల సంఘం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ తూత్తుక్కుడిలోని స్టెర్లైట్ కర్మాగారాన్ని మూసివేయాలని, అదే విధంగా కావేరి నది జలాల వ్యవహారంలో బోర్డును నియమించాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ నెల 8న స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్ కోట్టం వద్ద ఆందోళన జరపనుందని పేర్కొన్నారు. ఈ ఆందో ళనలో చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు ఈ నెల 4న స్టెర్లైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా, కావేరి బోర్డు ఏర్పాటుకు మద్దతుగా, అదే విధంగా చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నడిగర్‌సంఘం ప్రకటించింది. అయితే అందుకు ప్రభుత్వంనుంచి అనుమతి లభించలేదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కావేరి బోర్డు నియామకం కోసం ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండటంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రభుత్వం కోలీవుడ్ దీక్షకు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని ఈనెల 8న చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
విద్యుత్‌కు బొగ్గు భరోసా!
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి రంగానికి ప్రభుత్వం కాస్త చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతుల్లో అడ్డుంకుల కారణంగా బొగ్గు గనుల అభివృద్ధి చేపట్టని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఇక్కడ జరిపిన భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యావరణ, అటవీశాఖ అనుసరిస్తున్న అనుకూల(గో), నిషేధిత(నో-గో) విధానం కారణంగా మొత్తం 24 విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో 9 ప్రాజెక్టులకు మరింత బొగ్గును సరఫరా చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎంఆర్ రెండు ప్రాజెక్టులు కూడా... కేబినెట్ ఆమోదించిన జాబితాలో స్టెరిలైట్, జీఎంఆర్, కేఎస్కే మహానది పవర్లకు చెందిన రెండేసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిప్రకారం పర్యావరణ అనుమతుల జాప్యంతో మైనింగ్ అభివృద్ధి నిలిచిపోయిన పవర్ ప్లాంట్లకు మరో మూడేళ్లపాటు క్రమానుగత(ట్యాపరింగ్) బొగ్గు లింకేజీ విధానం కింద సరఫరా చేయనున్నారు. అయితే ఈ విధానం ప్రకారం ఎంత పరిమాణంలో బొగ్గు సరఫరా చేయాలనేది ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) ద్వారా నిర్ణయించనుండగా.. అదనపు సరఫరా పరిమాణాన్ని లభ్యతకు లోబడి అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) ప్రాతిపదికన ఇవ్వనున్నారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సరఫరా ప్రక్రియను ప్రతి ఏడాది చివర్లో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రణాళిక సంఘం కలిసి సమీక్షించనున్నాయి. రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు... ప్రభుత్వం అదనపు బొగ్గు సరఫరాలకు ఓకే చెప్పిన 9 పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెగావాట్లుగా అంచనా. వీటికి పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ ప్లాంట్లకు ఇప్పటికే సొంత బొగ్గు సరఫరా బ్లాక్‌లు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో అడ్డంకులతో ఈ గనుల్లో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ట్యాపరింగ్ బొగ్గు లింకేజీ కింద మూడేళ్ల సరఫరాలకు బదులు మరో మూడేళ్లు అదనంగా సరఫరా చేయాలని ప్లాంట్లు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ శాఖ కూడా దీనికి సిఫార్సు చేయడంతో కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఎయిరిండియా బోయింగ్‌ల అమ్మకానికి ఓకే.. ఎతిహాద్ ఎయిర్వేస్కు అయిదు బోయింగ్ 777 విమానాలను విక్రయించాలన్న ఎయిరిండియా ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. గత నెలలోనే ఎతిహాద్‌తో డీల్‌ను ఎయిరిండియా ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందంతో ఎయిరిండియాకు 30-35 కోట్ల డాలర్ల వరకూ(గరిష్టంగా రూ.2,200 కోట్లు) లభించవచ్చని అంచనా. టర్న్‌ఎరౌండ్ ప్రణాళికలో భాగంగా కంపెనీకి ఉన్న రూ.20,000 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని తీర్చేందుకు వినియోగించనుంది. 11 ఖాయిలా పరిశ్రమలకు రూ.117 కోట్లు ఖాయిలా పడిన 11 ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లకు రూ.116.86 కోట్లను కేటాయించేందుకు సీఈఈఏ ఆమోదం తెలిపింది. వేతనాలు, ఇతర బకాయిల కింద ఈ నిధులను ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈ నిధులు అందనున్న పరిశ్రమల్లో హిందుస్తాన్ కేబుల్స్, హెచ్ఎంటీ మిషన్ టూల్స్, హెచ్ఎంటీ(వాచెస్), హెచ్ఎంటీ(చినార్ వాచెస్), నాగాలాండ్ పల్ప్ అండ్ పేపర్, త్రివేణి స్ట్రక్చర్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్, నాపా లిమిటెడ్, హెచ్ఎంటీ బేరింగ్స్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బోనస్ వంటి చట్టబద్ధ బకాయిలు, వేతన బకాయిల కింద ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.