
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వీడియోలు చూస్తోందని మలైరాజా అనే వ్యక్తి తన చెల్లిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మలైరాజా అనే వ్యక్తి తన చెల్లి కవితకు అన్‌లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూస్తోంది. ఈ విషయం మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు.
దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని.. కవితను అన్న మలైరాజా వెనుక నుంచి కత్తితో పొడిచి చంపాడు. దీంతో తీవ్రగాయాపాలైన కవిత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ