మహిళా టీచర్‌పై ఇంటి ఓనర్‌ కొడుకు.. | Teenager Molested Woman Teacher In Pakistan | Sakshi
Sakshi News home page

మత్తు మందు ఇచ్చి మహిళా టీచర్‌పై...

Published Sat, Oct 19 2019 3:09 PM | Last Updated on Sat, Oct 19 2019 3:31 PM

Teenager Molested Woman Teacher In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఇంట్లో కిరాయికి ఉంటున్న 50 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు  యజమాని కొడుకు. కాఫీలో మత్తుమందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని జిన్నాపార్క్‌ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయ జంట అదే ప్రాంతంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని నివాసం ఉంటుంది. వృత్తి రిత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తునందున.. సెలవు దినాల్లో మాత్రమే వచ్చి అక్కడ గడిపేవారు. 

కాగా, అక్టోబర్‌ 1న ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఇంటి యజమాని కుమారుడే దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో దొంగతనం విషయాన్ని ఆ యువకుడు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇంటి యజమాని ఆ వస్తువులు తిరిగి కొనిస్తాని చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు.  వారం రోజుల అయినప్పటికీ వస్తువులు కొనివ్వకపోవడంతో మహిళా టీచర్‌ భర్త ఇంటి యజనమానిని నిలదీశాడు.

దీంతో కోపోద్రిక్తుడైన యజమాని.. వారి కూతురిని కిడ్నాప్‌ చేసి హత్య చేస్తానని బెదిరించాడు.  దీంతో వస్తువులను అడగడం మానేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 15న ఇంటి యజమాని పెద్ద కుమారడు, యువకుడు మహిళా టీచర్‌ ఇంటికి వెళ్లాడు. తన తమ్ముడు దొంగిలించిన వస్తువులను తిరిగి ఇస్తానని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా టీచర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని యుకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement