విద్యార్థితో మహిళా టీచర్‌ వాంఛ.. | Woman Teacher Molested To Students In USA | Sakshi
Sakshi News home page

విద్యార్థితో మహిళా టీచర్‌ పిచ్చి చేష్టలు

Published Sun, Feb 9 2020 1:02 PM | Last Updated on Sun, Feb 9 2020 1:02 PM

Woman Teacher Molested To Students In USA - Sakshi

విద్యాబుద్ధులు నేర్పి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్‌ ఆ వృత్తికే కళంకం తెచ్చారు. తన స్కూల్లో చదువుతున్న విద్యార్థితో లైంగిక వాంఛ తీర్చుకున్నారు. వ్యవహారం బయటపడడంతో కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో  ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. తన స్కూల్‌ విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛను తీర్చుకునేది. ఇలా కనీసం 9 సార్లు ఆ మహళా టీచర్ ఇద్దరు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. టీచర్ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను  సస్పెండ్ చేసింది. 

ఈ మెయిల్‌లో నగ్న ఫోటోలు
శారీరక సంబంధం కోసం ముందుగా స్కూల్‌కు సంబంధించిన అధికారిక ఈ-మెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్‌కి ఈ-మెయిల్ పంపేది. ఆ తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. తన నగ్న ఫోటోలు, వీడియోలను స్టూడెంట్‌కి పంపి అనంతరం తన మనసులోని మాట చెప్పేది. దానికి అంగీకరించిన విద్యార్థిని ఇంటికి రప్పించుకొని అఘాయిత్యానికి పాల్పడేవారు. 

గంజాయి ఇచ్చి..
ఈ మెయిల్‌ ద్వారా నగ్న ఫోటోలు పెట్టి విద్యార్థిని వలలో వేసుకున్న టీచర్‌.. అనంతరం తన కారులో అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది. అక్కడ ఆ విద్యార్థితో లైంగిక  కోరిక తీర్చుకొని ఇంటికి పంపించేది.  స్టూడెంట్‌లో కామవాంఛ పెంచేందుకు గంజాయిలాంటి మాధక ద్రవ్యాన్ని కూడా అతనికి ఇచ్చేదని పోలీసులు పేర్కొన్నారు.  ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టగా ఈ ‘నగ్న’సత్యాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోఉండి విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement