Louisiana
-
అమెరికాలో కాల్పుల కలకలం.. వీడియో వైరల్
లూసియానా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. లూసియానా(Louisiana)లోని ఫ్రాంక్లిన్టన్లో జరిగిన మార్డి గ్రాస్ పరేడ్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత పరేడ్‌లో చోటుచేసుకున్న గందరగోళం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ బ్రేకింగ్ న్యూస్(Breaking News) ప్రత్యక్షమయ్యింది. BREAKING🚨: Several individuals were injured in a shooting that took place during a parade in Franklinton, Louisiana, a small town located in Washington Parish. The incident disrupted what was intended to be a festive community event.— Officer Lew (@officer_Lew) March 3, 2025 ఇది కూడా చదవండి: 9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే.. -
న్యూఓర్లీన్స్ ట్రక్కు దాడి.. ఎవరీ జబ్బర్?
కొత్త సంవత్సరం వేళ.. కేవలం గంటల వ్యవధిలో అమెరికాను వరుస దాడులు వణికించాయి. ముఖ్యంగా న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడి కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ పూర్తిగా ఉగ్రకోణంలోనే సాగుతోందని ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అనుమానితుడికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు విడుదల చేసింది.గతంలో అమెరికా సైన్యం పని చేసిన షంసుద్ దిన్ జబ్బార్(42)ను ఈ దాడికి ప్రధానసూత్రధారిగా అనుమానిస్తున్నారు. ట్రక్కుతో దాడికి పాల్పడిన అనంతరం.. అతడ్ని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపాయి. అయితే అతనొక మానసిక రోగినా? లేకుంటే ఉగ్రవాదినా? అనేదానిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. కానీ.. 👉జబ్బార్ గతంలో టెక్సాస్‌లో రియల్ ఎస్టేట్(Real Estate) ఎజెంట్‌గా పని చేశాడు. అంతకు ముందు చాలాఏళ్లు అమెరికా సైన్యంలో పని చేశాడు. అయితే.. ఆర్థిక సమస్యలతో పాటు విడాకులు అతని వ్యక్తిగత జీవితాన్ని కుంగదీసినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట.. యూట్యూబ్ ఛానెల్లో తనను తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న ఓ వీడియో సైతం ఇప్పుడు బయటకు వచ్చింది.👉ఇదిలా ఉంటే.. జబ్బార్ 2005 నుంచి 2015 మధ్య అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసోర్స్ స్పెషలిస్ట్‌గా, ఐటీ స్పెషలిస్ట్‌గా పని చేశాడని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. అంతేకాదు.. 2009-10 మధ్య అఫ్గనిస్థాన్‌లో అతను విధులు నిర్వహించాడు. తాజా దాడి ఘటన తర్వాత.. అమెరికా సైన్యంలో అతను పని చేసిన టైంలో ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. అయితే కాసేపటికే ఆ వీడియోను ఎవరో యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు.👉వీటితో పాటు 2021 నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాడు.👉దాడి ఘటనపై అతని కుటుంబం స్పందించింది. తన సోదరుడు జబ్బార్ ఎంతో మంచివాడని అబ్దుర్ జబ్బార్ చెప్తున్నాడు. చిన్నతనంలో మా కుటుంబం మతం మారింది. కానీ, ప్రస్తుత దాడిని మతానికి ముడిపెట్టడం సరికాదు. రాడికలైజేషన్ ప్రభావంతోనే నా సోదరుడు ఉన్మాదిగా మారిపోయి ఉంటాడు అని అబ్దుర్ చెప్తున్నాడు.👉జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జబ్బార్ విద్యాభ్యాసం కొనసాగింది. 2015-17 మధ్య కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. జబ్బార్ డైవోర్సీ. రెండుసార్లు వివాహం జరగ్గా.. ఇద్దరితోనూ విడాకులు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలతోనే రెండో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు 2022లో అతను పంపిన మెయిల్‌ను అధికారులు పరిశీలించారు.👉రియల్ ఎస్టేట్ నష్టాలతో జబ్బార్ ఆర్థికంగానూ జబ్బార్ చితికిపోయి ఉన్నాడు. ఒకానొక టైంలో అద్దె కూడా చెల్లించని లేని స్థితికి చేరుకున్నాడు. ఆఖరికి లాయర్‌కు ఫీజులను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించి.. వాటిని ఎగ్గొట్టాడు.👉నేర చరిత్రను పరిశీలిస్తే.. 2002లో దొంగతనం, 2005లో కాలం చెల్లిన డ్రైవింగ్ లైసెన్స్‌తో బండి నడిపి శిక్ష అనుభవించాడు.👉షంషుద్దీన్ జబ్బార్ దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే ఎఫ్‌బీఐ తనకు సమాచారం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెల్లడించారని ఏబీసీ న్యూస్ ఓ కథనం ప్రచురించింది. ఐసిస్ స్ఫూర్తితోనే తాను ఈ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఆర్మ్డ్ గ్రూప్(ఐసిస్‌కు మరో పేరు) జెండా కూడా దాడికి పాల్పడిన ట్రక్కులో ఉన్నట్లు ఎఫ్‌బీఐ తనకు నివేదించిందని బైడెన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. 👉షంషుద్దీన్ జబ్బార్‌ను ఐసిస్ ఒంటరి తోడేలు (Lone Wolf)గా ఎఫ్‌బీఐ భావిస్తోంది. అంటే.. ఒంటరిగాగానీ లేదంటే చిన్నగ్రూపులుగా ఏర్పడి దాడులు చేయడం. అమెరికాలో జరిగే అత్యధిక ఉగ్రదాడులు ఈ రూపంలోనే ఉంటున్నాయి. 2014లో బెల్జియంలో యూదుల మ్యూజియంపై, 2012లో బ్రస్సెల్స్‌లో మసీదుపై, 2016లో ఫ్రాన్స్‌లో బాస్టిల్‌డే నాడు ట్రక్కుతో దాడి ఇలా చేసినవే. ‘‘అతడికి సైనిక నేపథ్యం ఉంది. కానీ, ఏనాడూ యుద్ధంలో పాల్గొనలేదు. నౌకాదళంలో చేరేందుకు ప్రయత్నించినా.. అది వీలుకాలేదు. దాడికి ముందు సెయింట్ రోచ్ సమీపంలో ఓ ఇంటి సమీపంలో అతడు ట్రక్కును ఆపి కొన్ని పెట్టెలను కిందకి దించుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే అక్కడున్న ఆ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిందితుడు జబ్బార్ ఎయిర్ బీఎన్‌బీలో ఒక గది తీసుకొని.. అక్కడ న్యూఆర్లీన్ దాడికి పేలుడు పదార్థాలు తయారుచేశాడు. టూరో అనే యాప్ సాయంతో అతడు ఫోర్డ్ ఎఫ్-150 లైటినింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును బుక్ చేశాడు. దానిని వాడే నూతన సంవత్సర వేడుకల వేళ బర్బన్ వీధిలో విచక్షణా రహితంగా దాడి చేసి 15 మందిని బలిగొన్నాడు’’ అని లూసియానా అటార్నీ జనరల్ లిజ్ ముర్రిల్ల్ తెలిపారు.అయితే జబ్బార్ తన కుటుంబాన్ని ఐసిస్‌లో కలవాలని కుటుంబ సభ్యులను ఒత్తిడి చేశాడని.. వినకపోయేసరికి వాళ్లను సైతం కడతేర్చడానికి వెనుకాడలేదని అధికారులు చెప్తుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆ వాదనను కొట్టిపారేస్తున్నారు. -
పైథాగరస్ వర పుత్రికలు!
మేథ్స్ సబ్జెక్ట్ కష్టం. అందులోని ట్రిగొనమెట్రీ మరింత కష్టం. ట్రిగొనమెట్రీ లోని పైథాగరస్ సిద్ధాంతం ఇంకాస్త కష్టం. ప్లస్ లు, మైనస్ లను ఎలాగో లాగించేయొచ్చు. త్రిభుజాలు, త్రికోణాల ట్రిగొనమెట్రీ (త్రికోణమితి) ని, పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి, ఆ లెక్కల్ని పరిష్కరించటానికి ఒక గణిత శాస్త్రవేత్తకు ఉండేంత ఐ.క్యూ.లో పిసరంతైనా లేకుంటే బుర్ర తిరిగి పోతుంది. అలాంటిది ఈ అమ్మాయిలను చూడండి, త్రికోణమితిని ఉపయోగించి పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఐదు కొత్త సూత్రాలను కనుక్కున్నారు! లూసియానా లోని న్యూ ఆర్లీన్స్ కాలేజ్ విద్యార్థినులు... కాల్సియా జాన్సన్, నేకియా జాక్సన్ వీళ్లు. మొదటిసారి 2022లో ఈ అమ్మాయిలు పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని సూత్రాలను ఆవిష్కరించారు. ఆ హద్దులను కూడా దాటి ఇప్పుడు ఐదు అదనపు రుజువులకు దారి తీసే ఐదు ప్రత్యక్ష రుజువులు కనిపెట్టారు. వీటివల్ల ట్రిగ్నామెట్రీని అర్థం చేసుకోవటం మరింత తేలిక అవుతుంది.వీరు సాధించిన ఈ ఘనతను ప్రఖ్యాత ‘అమెరికన్ మేథమేటికల్ మంత్లీ‘ తన తాజా సంచికలో గొప్పగా ప్రచురించింది. అబ్బాయిలూ... మీరింకా ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే ఉన్నారా.. మేథ్స్ పరిశోధనలో అమ్మాయిలు ఇంత పెద్ద గోల్ కొట్టారని తెలిసినా కూడా!! -
దారుణం: పొగమంచుతో వందల కొలది వాహనాలు ఢీ.. ఏడుగురు మృతి
న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్ -
కోటీశ్వరుడయ్యాడు.. ప్రపంచంలోని 25వ ధనవంతుడిగా మారాడు.. కానీ!
ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు డీజీపీలా.. కొన్ని గంటలపాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. లూసియానాకు చెందిన డారెన్ అకౌంట్లో ఏకంగా రూ.4 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టుగా ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్ గురైన డారెన్ ఒకటికి రెండుసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. బ్యాంక్ స్టేట్మెంట్ సైతం తనిఖీ చేశాడు. నిజమే! తన అకౌంటే. కానీ అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థం కాలేదు. లేనిపోని తనిఖీలు అని భయపడ్డాడు. డబ్బు ఎక్కడిదని కనుక్కోవడం కోసం బ్యాంకుకు కాల్చేశాడు. గతంలో లూసియానా పబ్లిక్‌సేఫ్టీ డిపార్ట్మెంట్లో లా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసిన డారెన్ తాను అంత డబ్బు సంపాదించలేదని, ఎవరికీ ఇచ్చింది కూడా లేదని చెప్పాడు. దీంతో మూడు రోజుల పాటు అతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఏం జరిగిందో ఏమో గానీ.. బ్యాంకు వాళ్లు ఆ సొమ్మును వెనక్కి తీసుకున్నారు. కానీ కొన్ని గంటలపాటు మాత్రం.. డారెన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 25వ వ్యక్తిగా నిలిచిపోయాడు. అవునూ.. ఇంతకీ మీ అకౌంట్లో అంత డబ్బు పడితే ఏం చేస్తారు?? చదవండి: రిషి సునాక్ ఓటమి వెనక కారణలివేనా? -
యాక్సిడెంట్ అయింది! వైద్యం చేయండి డాక్టర్: జింక
మన కళ్లముందే రోడ్డుపై ఎన్నో మూగజీవాలు రోడ్డు ప్రమాదాలకు గురవడం చూసి ఉంటాం. ఎవరో కొంతమంది సహృదయులు వాటిని చేరదీసి పశువైద్యశాలకు తరలించడం వంటివి చేస్తారు. లేదంటే అవి అలా గాయాలతోనే బాధపడుతూ ఉండిపోతాయి. కానీ ఇక్కడొక జింక మనిషిమాదిరి ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకుంది. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే... అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టడంతో దానికి గాయాలవుతాయి. అయితే ఆ జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్లోకి ప్రవేశిస్తుంది. పైగా చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్లో అటూ ఇటు పరిగెడతూ చాలా కష్టపడుతుంది. అంతేకాదు ఆవరణలో పడుతూ లేస్తూ ఆయాస పడుతుంది. అక్కడ ఉన్న ఎస్కలేటర్‌ను సైతం ఏదోరకంగా ఎక్కి రెండో అంతస్తుకి చేరుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న వైద్యులు, సందర్శకులు ఆశ్చర్యపోతారు. అయితే అక్కడ ఉన్న పశువైద్యుడు జింకను పరిశీలించి వైద్యం చేస్తాడు. మా వైద్యులు ఎప్పడూ సదా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు కూడా ఓసారి వీక్షించండి. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
వయసు 105.. 102 సెకన్లలో 100 మీటర్లు
వాషింగ్టన్: 105 ఏళ్లు... జీవితమే ఊహకందదు. కానీ ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించింది లూసియానాకు జూలియా హరికేన్స్ హాకిన్స్. 102 సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తింది. ఆమె పేరులోకి ‘హరికేన్’అట్లా రికార్డుతో వచ్చిందే. మీ వయసుకంటే తక్కువ సెకన్లలోపే పూర్తిచేశారు కదా ... ‘‘నో’నిమిషంలో పూర్తి చేయాలనుకున్నా. కుదరలేదు. ఇంకా ఎక్కువ పరుగెత్తాలి’ అని చెబుతోంది. రన్నింగ్‌ను 101వ ఏట మొదలుపెట్టిన హాకిన్స్‌కు అథ్లెటిక్స్ కొత్తేం కాదు. 80 ఏళ్ల వయసులో ‘నేషనల్ సీనియర్ గేమ్స్’సైక్లింగ్‌లో పోటీ పడింది. 2017లో సైక్లింగ్ వదిలేశాక... రన్నింగ్ ట్రాక్‌ను ఎంచుకుంది. సో... సంకల్పం ఉండాలేగానీ.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్! -
Hurricane Ida: అంతరిక్షం నుంచి భీకర ప్రళయ దృశ్యాలు
-
ట్రాఫిక్‌లో బోర్ కొట్టి మొసళ్ల నదిలో దూకాడు.. ఆ తర్వాత
వాషింగ్టన్ : ట్రాఫిక్‌లో బోర్ కొట్టిందని ఓ వ్యక్తి పిచ్చి పని చేశాడు. రోడ్డు ప్రక్కనే ఉన్న మొసళ్ల నదిలోకి దూకాడు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లు.. అదృష్టం బాగుండి బయటపడ్డాడు. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో చోటుచేసుకుంది. వివరాలు.. లూసియానాకు చెందిన జిమ్మి ఇవాన్ జెన్నింగ్స్ కొద్ది రోజుల క్రితం నదిపై ఉన్న వంతెనపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడు. 2 గంటలు గడిచినా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దీంతో బోర్ కొట్టిన జిమ్మి పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు. అయితే ఆ నదిలో ముసళ్లు ఉన్నట్లు అతడికి తెలియదు. నీళ్లలో పడ్డ తర్వాత అతడి నోటికి, ఎడమ చేతికి గాయమైంది. ఈత కొట్టడానికి ఇబ్బంది పడసాగాడు. అలా దాదాపు గంటన్నర పాటు ఈదుతూనే ఉన్నాడు. ఈత కొట్టే ఓపిక నశించినా ప్రాణం మీద ఆశతో అంటూ ముందుకు వెళ్లాడు. చివరకు ఓ ఇసుక తిన్నెమీదకు చేరుకున్నాడు. ఆ తర్వాత నడుచుకుంటూ ఊర్లోకి అడుగుపెట్టాడు. అక్కడ పోలీసులు జిమ్మిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు జిమ్మి చేసిన పిచ్చిపనిని తప్పుబడుతున్నారు. -
జూ నుంచి తప్పించుకుంది; కట్‌చేస్తే షాపింగ్‌మాల్‌లో
లూసియానా: కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. పాపం రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారాను వెతికే ప్రయత్నం చేశారు. అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది. ''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ జూ ప్రధాన అధికారి రోండా స్వాన్సన్ చెప్పుకచ్చాడు. కాగా కారాను (కొండచిలువ) సీలింగ్ నుంచి బయటికి తీసిన వీడియోనూ బ్లూ జూ అక్వేరియం తమ ఫేస్బుక్లో షేర్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. SEE THE MOMENT: Here’s video of Cara the Python was pulled out from the wall somewhere within the Mall of Louisiana. Video is from Blue Zoo Baton Rouge. @WAFB https://t.co/ziVjx9EWIW pic.twitter.com/DFdQBJAeoD — lizkohTV (@lizkohTV) July 8, 2021 -
బ్యాంకు తప్పిదం.. వ్యక్తి ఖాతాలో అక్షరాల రూ. 3 .7 లక్షల కోట్లు
వాషింగ్టన్: బ్యాంకు తప్పిదాల కారణంగా వేలు, లక్షల రూపాయలు ఒకరి ఖాతా డెబిట్ కావడం, మరికొన్ని సందర్భాల్లో అదృష్టం వరించి కొందరి ఖాతాల్లో క్రెడిట్ కావడం చూసే ఉంటాం. అయితే, అమెరికాలోని ఓ కుటుంబం మాత్రం సాక్షాత్తూ కుబేరుడే తమ ఇంటికి వచ్చినంత సంబరపడ్డారు. ఎందుకంటే వారి ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే, అప్పనంగా వచ్చిన తమ ఖాతాలో పడ్డ సొమ్మును తీసుకోకుండా ఆ కుటుంబం స్ఫూర్తిని చాటింది. వివరాల్లోకి వెళ్తే .. బ్యాంకు తప్పిదంతో లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్ ఖాతాలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు ప్రత్యక్షమయ్యాయి. అంటే భారత కరెన్సీలో రూ.3.7 లక్షల కోట్లతో సమానం. లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్.. తన బ్యాంకు ఖాతాలో 50 బిలియన్ డాలర్లు జమం కావడంతో ఆశ్యర్యపోయాడు. విషయం తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. తప్పిదాన్ని తెలుసుకున్న బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఈ తప్పిదంపై దర్యాప్తు చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది. చదవండి:Serena Williams: చిన్న కారణం చేత ఒలింపిక్స్‌కు దూరం -
రాకాసి దోమల గుంపు: జంతువులు మటాష్!
లూసియానా : రాకాసి దోమల గుంపు వందల సంఖ్యలో పాడి జంతువుల్ని, అడవి వన్య ప్రాణుల్ని బలితీసుకుంది. ఈ సంఘటన అమెరికాలోని లూసియానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గత నెల ఆగస్టు 27న హరికేన్ లారా కారణంగా పెద్ద సంఖ్యలో రాకాసి దోమలు లూసియానాలోకి వచ్చిపడ్డాయి. అక్కడి గేదెలు, ఆవులు, గుర్రాలు, జింకలపై దాడి చేశాయి. వాటి రక్తం పీల్చి చంపేశాయి. దాదాపు లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కొంతమంది హెలికాఫ్టర్ల సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దీంతో దోమల ఉధృతి కొద్దిగా తగ్గింది. ఈ దోమల దాడిలో దాదాపు 400 పాడి జంతువులు, 30 వరకు జింకలు మృత్యువాత పడ్డాయి. సెప్టెంబర్ 2న ఓ వ్యక్తి తీసిన ఫొటో ఒకటి రాకాసి దోమల రక్త పిపాసకు అద్దం పడుతోంది. చనిపోయిన ఎద్దు పొట్ట చుట్టూ చేరిన భారీ దోమల గుంపు దాని రక్తం పీలుస్తున్న ఫొటో అది. -
కోడిపై కేసు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వాషింగ్టన్: అమెరికాలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్న ఓ కోడిపై స్థానికులు వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడి కోసం పోలీసులు శోధింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కోడి ఆచూకి తెలపాలంటూ వాల్కర్ పోలీసులు శుక్రవారం ఫేస్బుక్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మాస్క్‌తో ఉన్న కోడి ఫొటోను పోస్టు చేస్తూ... ‘‘గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్ ఏటీవం వద్దకు వచ్చిపోయే వారిపై దాడి చేస్తూ కలకలం సృష్టిస్తోంది. అంతేగాక రోడ్డుపై సంచరిస్తూ వచ్చిపోయే కార్ల మీదకు ఎగురుతూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కోడిపై దర్యాప్తు చర్యలు చేపట్టాము. ఇక సదరు కోడి జాడ తెలిసిన వారు వెంటనే మాకు సమాచారం అందించండి’’ అంటూ పోస్టులో రాసుకుచ్చారు. కాగా ఈ పోస్టుకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇక ‘కోడిపై వింతగా పోలీసు కేసు ఏంటి నమ్మశక్యంగా లేదు ఇది నీజమేనా మీరే క్రియేట్ చేశారా? అంటూ కొంతమంది పోలీసులను ఎదురు ప్రశ్నిస్తుంటే.. ‘ఆశ్చర్యంగా ఉంది.. లవ్ దిస్!!!’ అంటూ ‘ఆ కోడి రోడ్డుపైకి ఎలా వచ్చింది.. అది రోడ్డు ఎలా దాటింది’ ‘వాల్కర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ఆ కోడి రోడ్డు దాటిందేమో’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దీనిపై బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. కోడిపై సమాచారం అందించిన క్షణాల్లోనే పోలీసులు స్పందించారని చెప్పారు. అయితే పోలీసులు వచ్చేసరికి ఆ కోడి తప్పించుకుంది. ఇక ఆ కోడి నుంచి సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మళ్లీ అది కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచించినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. -
విద్యార్థితో మహిళా టీచర్ వాంఛ..
విద్యాబుద్ధులు నేర్పి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్ ఆ వృత్తికే కళంకం తెచ్చారు. తన స్కూల్లో చదువుతున్న విద్యార్థితో లైంగిక వాంఛ తీర్చుకున్నారు. వ్యవహారం బయటపడడంతో కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. తన స్కూల్ విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛను తీర్చుకునేది. ఇలా కనీసం 9 సార్లు ఆ మహళా టీచర్ ఇద్దరు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. టీచర్ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. ఈ మెయిల్లో నగ్న ఫోటోలు శారీరక సంబంధం కోసం ముందుగా స్కూల్‌కు సంబంధించిన అధికారిక ఈ-మెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్‌కి ఈ-మెయిల్ పంపేది. ఆ తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. తన నగ్న ఫోటోలు, వీడియోలను స్టూడెంట్‌కి పంపి అనంతరం తన మనసులోని మాట చెప్పేది. దానికి అంగీకరించిన విద్యార్థిని ఇంటికి రప్పించుకొని అఘాయిత్యానికి పాల్పడేవారు. గంజాయి ఇచ్చి.. ఈ మెయిల్ ద్వారా నగ్న ఫోటోలు పెట్టి విద్యార్థిని వలలో వేసుకున్న టీచర్.. అనంతరం తన కారులో అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది. అక్కడ ఆ విద్యార్థితో లైంగిక కోరిక తీర్చుకొని ఇంటికి పంపించేది. స్టూడెంట్లో కామవాంఛ పెంచేందుకు గంజాయిలాంటి మాధక ద్రవ్యాన్ని కూడా అతనికి ఇచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టగా ఈ ‘నగ్న’సత్యాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోఉండి విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వైరల్ : అమ్మో! పెద్ద ప్రమాదం తప్పింది
లూసీయానాలోని ఒక పెట్రోల్ బంకులోకి యస్‌యూవీ కారు ఒకటి వచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టిద్దామని తన పెంపుడు కుక్క చువావాను కారులోనే ఉంచి యజమాని బయటకు దిగి సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఈలోగా కారు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి బ్యాక్వర్డ్ డైరక్షన్లో పక్కనే ఉన్న 4- లేన్ల మెయిన్ రోడ్డుమీదకు వెళ్లింది. దీంతో అవాక్కయిన కారు యజమాని కారు వెనకాలే పరిగెత్తారు. కారు డోరు తెరిచే ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. దేవుడి దయ వల్ల ఆ సమయంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు ఎదురుగా ఉన్న మరో గ్యాస్ స్టేషన్ బారీకేడ్లను ఆనుకొని కారు నిలిచిపోయింది. కాగా కారులో ఉన్న చుహాహా క్షేమంగానే ఉంది. ఈ ఘటన లూసీయానాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ లూసియానా పోలీసులు ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీకామెంట్లు పెట్టారు. ' ఈ కుక్క మహా తెలివైనదని, కారును స్టార్ట్ చేసి నడిపిందని' పేర్కొన్నారు. మరికొందరు మాత్రం చువావా క్షేమంగా బయటపడినందుకు సంతోషిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు. నెటిజన్ల కామెంట్లపై స్పందించిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా బ్రేక్ వేయకుండానే ఆటోమెటిక్ గేర్లను మార్చుకోగలదని, అందుకే కారు ఒక్కసారిగా బ్యాక్వర్డ్ డైరక్షన్లో మూవ్ అయిందని తెలిపారు. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడం, అలాగే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడం నిజంగా అద్బుతమని పేర్కొన్నారు. ' కార్లలో తమ పెంపుడు జంతువులను వదిలి వెళ్లేవారికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ అని' పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే గత గురువారం ఫ్లోరిడాలో జరిగింది. తన పెంపుడు కుక్క బ్లాక్ లాబ్రాడర్‌ను కారులోనే ఉంచి పార్క్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత ఆటోమెటిక్ మోడ్ ఆన్ అయి కారు ఒక గంట పాటు వృత్తాకారంలో తిరగడం వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనల్లో పెంపుడు కుక్కలు ఉండడం గమనార్హం. -
అంగారక యాత్రకు 17 ఏళ్ల అమ్మాయి!
-
అంగారక యాత్రకు టీనేజ్ అమ్మాయి!
సాక్షి, న్యూఢిల్లీ : నక్షత్రాల వెలుగు జిలుగులతో అందంగా కనిపించే ఆకాశానికేసి చూసినప్పుడు పిల్లలందరికి ‘అబ్బా! అలా రోదసిలోకి వెళ్లి తిరిగొస్తే బాగుండు’ అనిపిస్తుంది. పెద్దయ్యాక వారికి అది అందమైన కలగానే మిగిలిపోతుంది. మన అలిస్సా కార్సన్‌కు అది మిగిలిపోయే కల కాదు. నిజంగా నిజమయ్యే అవకాశాలున్న కల. అమెరికాలోని లూజియానాకు చెందిన అలిస్సా కార్సన్ అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు మొదటి మానవ యాత్రకు సిద్ధమవుతుంది. 2033లో అంగారక గ్రహంపైకి మానవ వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఆ యాత్రలో పాల్గొనేందుకు అలిస్సా ఎప్పటి నుంచి నాసాలో శిక్షణ పొందుతోంది. ఆ మాటకొస్తే ఆమె చిన్నప్పటి నుంచి నాసా నుంచి శిక్షణ తీసుకుంటుందని చెప్పవచ్చు. పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాసా అమెరికాలో ఎక్కడా శిక్షణా శిబిరం ఏర్పాటు చేసినా అక్కడికెళ్లి హాజరవుతూ వచ్చింది. ఇంతవరకు ఒక్క శిబిరాన్ని కూడా వదల లేదంటే అంతరిక్ష యాత్రలపై ఆమెకున్న మక్కువ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. అలా శిబిరాల ద్వారా నాసా శాస్త్రవేత్తలతో ఆమె మమేకమైంది. చివరకు వయస్సు రాకముందే నాసా శిక్షణకు హాజరవుతోంది. నాసా నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవడానికి వీల్లేదు. 17 ఏళ్ల అలిస్సా చేర్చుకోవాల్సి వచ్చింది. అందుకనే నాసా ఆమె పేరును, వయస్సును పేర్కొనకుండా ‘బ్లూబెర్రీ’ అనే కోడ్ నెంబర్‌తో వ్యవహరిస్తున్నారు. అంతరిక్ష యాత్ర, ముఖ్యంగా అంగారక యాత్రపై అలిస్సాకు ఇష్టం ఏర్పడడానికి కూడా కారణం ఉంది. ‘బ్యాకీయార్డిగాన్స్’ శీర్షికతో నికలడియాన్ నడిపిన కార్టూన్ సిరీస్‌ను చిన్నప్పుడే చదవడం కారణం. ఆ సిరీస్‌లో ఓ ఎపిసోడ్ ‘మిషన్ టు మార్స్’ ఉంటుంది. అందులో మిత్రులంతా కలిసి ఊహాత్మకమైన అంగారక గ్రహంపైకి వెళతారు. అప్పుడే తాను నిజంగా అంతరిక్ష యాత్రకు వెళ్లాలని అనుకుంది. అందుకు కాస్త పెద్దయ్యాక ఎలాగైనా వ్యోమగామిని కావాలని కలలుకంది. ఇప్పుడు నిజంగానే ఆమెకు అవకాశం వచ్చింది. తాను జీవితంలో టీచర్‌గానీ లేదా దేశాధ్యక్షుగానీ కావాలని కోరుకుంటున్నానని, అయితే అది అంగారక గ్రహంపైకి వెళ్లి వచ్చాక నెరవేరాలనుకుంటున్న లక్ష్యమని ‘టీన్ యోగ్’కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. వ్యోమగామికి అవసరమైన ప్రాథమిక శిక్షణను అలిస్సా తీసుకుంటున్నారు. భూమి గురుత్వాకర్షణ లేని శూన్యంలో గడపడం, నీటిలో ఎక్కువ సేపు వివరించడం లాంటి శిక్షణలు తీసుకుంటున్నారు. ఆర్యన్ అంతరిక్ష నౌకలో ఆమె అంగారక గ్రహంపైకి వెళ్లనున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు ఆరు నెలల కాల వ్యవధి పడుతుంది. తాను ఏడాదికి పైగా అంగారక గ్రహంపై గడపనున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి. అసలు నీటి ఛాయలు ఉన్నాయా, జీవి ఉనికికి ఆస్కారం ఉందా? అక్కడ మానవుల మనుగడ సాధ్యమేనా? అంశాలపై తాము అధ్యయనం జరుపుతామని చెప్పారు. అంతరిక్ష యాత్రకు సమాయత్తమవుతున్న అలిస్సా ముందుగా రోదసిలోని అంతరిక్ష ప్రయోగశాలకు వెళ్లి రానుంది. అక్కడికి వెళుతున్న తొలి టీనేజర్‌గా రికార్డు సృష్టించనుంది. అంగారక యాత్రకు శిక్షణ పొందుతున్న తొలి టీనేజర్ కూడా అలిస్సానే అయినప్పటికీ ఆమె యాత్రకు బయల్దేరే నాటికి ఆమెకు 32 ఏళ్లు వస్తాయి. -
బెల్టు తెగేలా కూతురుని కొట్టి.. గుండు గీసి..
లూసియానాలో ఓ తండ్రి కూతురుపై శివాలెత్తాడు. బెల్టు తీసుకొని చితక్కొట్టడమే కాకుండా ఆమె జుట్టును కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. వివరాల్లోకి వెళితే.. లూసియానాకు చెందిన అలెక్స్ జే హారిసన్(30) అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె తన ఫోన్లో స్నాప్ చాట్ డౌన్లోడ్ చేయడం చూశాడు. దాంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన అతడు తొలుత చేయి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లోని సోపాలో కూతురుని పడేసి బెల్టు తీసుకొని దాదాపు 50సార్లు పైగా కొట్టాడు. ఆ తర్వాత రెండు నిమిషాలు ఆగి వేరే గదిలోకి తీసుకెళ్లి ట్రిమ్మర్‌తో ఆమె జుట్టుమొత్తం కత్తిరించి గుండులా మార్చాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా అతడు ఏమాత్రం కనికరించలేదు. పైగా మొబైల్ కెమెరాలోకి చూడాలంటూ ఆ తతంగం మొత్తం రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
అమెరికా తీరాన్ని తాకిన హరికేన్ నేట్
-
ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు
లూసియానా : మార్చురీ గది ట్యాంకు లీక్ కావడంతో వేల లీటర్ల రక్తం రోడ్డున పారడం కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోయారు. మరణించిన వారి శరీరాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత శరీర భాగాలను ప్రత్యేకంగా భద్రపరుస్తారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో మృత దేహాల నుంచి వచ్చే రక్తాన్ని ఓ ట్యాంకులో నింపుతారు. అలా నింపిన ట్యాంకులో బ్లాకేజ్ ఏర్పడటంతో రక్తం రోడ్డుపై పారినట్లు అధికారులు తెలిపారు. మార్చురీ గదిని ప్రైవేట్‌గా నడుపుతున్నారని చెప్పారు. అయితే, కొత్త యాజమాన్యం ఇందుకు తగిన అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు. -
25 లక్షల మంది చూసిన కౌగిలింత
లూసియానా: ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఓ బాలుడు. తనకు శునకాల మీద ఉన్న ప్రేమని తల్లిదండ్రులకు కూడా చెప్పలేక పోయాడు. తన మనసులోనే కుక్కలపై అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎవరూలేని ఇంట్లో అతడు కుక్కకు ఇచ్చిన ఓ హగ్ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా కంటికి చిక్కింది. ఇంకేముంది కల్మశంలేని ఆ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు లూసియానాకు చెందిన జోష్ బ్రూక్స్ అనే బాలుడు. వీడియోలో ఏముందంటే.. ఎవరూలేని ఓ ఇంట్లోకి జోష్ వేగంగా వచ్చి సైకిల్‌ను కిందపడేస్తాడు. వెంటనే పరుగున అక్కడే ఉన్న ఓ కుక్క దగ్గరికి వేగంగా వచ్చి ప్రేమతో కౌగిలించుకుంటాడు. ఆ మరుక్షణమే తిరిగి అక్కడి నుంచి వేగంగా వెళ్లి సైకిల్ తీసుకొని వెళ్లిపోతాడు. ఈ తతంగాన్ని కుక్క(డచెస్) యజమాని హోలీ బ్రూక్స్ మాల్లెట్ తన ఇంట్లో అమర్చిన సెక్యురిటీ కెమెరాలో చూసి ఆ బాలున్ని కలవాలనుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ బాలున్ని నిర్భయంగా వచ్చి తన కుక్కతో ఆడుకోవొచ్చని తన పోస్ట్‌లో పేర్కొంది. కుక్కలంటే తన కుమారుడికి అమితమైన ఇష్టమని వీడియోను చూసిన బాలుడి తల్లి జింజర్ క్లెమెంట్ బ్రూక్స్ ఫేస్‌బుక్‌లోనే రిప్లే ఇచ్చింది. అనుమతిలేకుండానే జోష్ మరొకరి ఇంట్లో ఉండలేడని తెలిపింది. ఎప్పుడూ ఆ కుక్క గురించి తన దగ్గర చెబుతాడని పేర్కొంది. జోష్ రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో బెల్లా అనే కుక్క ఉండేది. కానీ, గత ఏడాదే అది మరణించింది. ఆ తర్వాత జోష్ స్కూల్ పనుల్లో బిజీగా ఉండటంతో మరో కుక్క పిల్లను తీసుకోవాలన్న ఆలోచన రాలేదని తెలిపింది. ఇప్పుడు కుక్క పిల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని జోష్ తల్లి తెలిపింది. హోలీ బ్రూక్స్ తమ కుక్కుతో గడిపే అవకాశం ఇవ్వడంతో బాలుడు ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా వెళ్లి ఆ కుక్కతో ఆడుకుంటున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. ఇదొక పాజిటివ్ కథ. ఈ వీడియోను గమనించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కుక్క యజమాని హోలీ బ్రూక్స్ తెలిపింది. స్వచ్ఛమైన మనస్సున్న బాలున్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని మురిసిపోతోంది. చిన్న పిల్లల ఆలోచనలను ప్రతిబింబించే ఈ వీడియో వారి సున్నితమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుందని వీడియో వీక్షించిన వారందరూ అంటున్నారు. -
గ్రాండ్ సినిమా హాల్లో కాల్పులు
-
యూఎస్‌లో భారీ మంచు తుపాన్
-
యూఎస్‌లో భారీ మంచు తుపాన్
వాషింగ్టన్: : యూఎస్‌లో శుక్రవారం సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్‌తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి. యూఎస్‌లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. -
యూఎస్‌లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు
యూఎస్‌లో నిన్న సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్‌తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి. యూఎస్‌లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. దాంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అయా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా పోలీసు వెళ్లేందుకు వచ్చి దాదాపు 12 గంటల పాటు డల్లాస్ ఫోర్త్ వర్త్ విమానాశ్రయంలో చిక్కుకుపోయానని ప్రయాణికులు మడిసన్ వివరించారు. మళ్లీ జన్మలో విమానంలో ప్రయాణం చేయకూడదనిపించిందని తెలిపారు. రైలు, బస్సు రవాణ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే మంచు తుపాన్ దాటికి ముగ్గురు మరణించారని ముస్సోరి మేయర్ వెల్లడించారు. ఒకరు గాయపడ్డారని వివరించారు. రోనాల్డ్ అర్నాల్డ్ అనే వ్యక్తిపై ఎనిమిది అడుగులు మందం గల మంచు చెరియలు విరిగిపడటంతో అతడు అక్కడికక్కేడే మరణించారని తెలిపారు. క్రిస్టమస్ పండగ సందర్భంగా పలు నగరాల్లో నిర్వహించతలపెట్టిన పేరెడ్లను మంచుతుపాన్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.