
ఒక్కరోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు డీజీపీలా.. కొన్ని గంటలపాటు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చేరిపోయాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. రాత్రికి రాత్రే బిలియనీర్ అయిపోయాడు. లూసియానాకు చెందిన డారెన్ అకౌంట్‌లో ఏకంగా రూ.4 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్టుగా ఇటీవల మెసేజ్ వచ్చింది. షాక్ గురైన డారెన్ ఒకటికి రెండుసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. బ్యాంక్ స్టేట్‌మెంట్ సైతం తనిఖీ చేశాడు. నిజమే! తన అకౌంటే. కానీ అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది అర్థం కాలేదు. లేనిపోని తనిఖీలు అని భయపడ్డాడు.
డబ్బు ఎక్కడిదని కనుక్కోవడం కోసం బ్యాంకుకు కాల్‌చేశాడు. గతంలో లూసియానా పబ్లిక్సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసిన డారెన్ తాను అంత డబ్బు సంపాదించలేదని, ఎవరికీ ఇచ్చింది కూడా లేదని చెప్పాడు. దీంతో మూడు రోజుల పాటు అతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఏం జరిగిందో ఏమో గానీ.. బ్యాంకు వాళ్లు ఆ సొమ్మును వెనక్కి తీసుకున్నారు.
కానీ కొన్ని గంటలపాటు మాత్రం.. డారెన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 25వ వ్యక్తిగా నిలిచిపోయాడు. అవునూ.. ఇంతకీ మీ అకౌంట్‌లో అంత డబ్బు పడితే ఏం చేస్తారు??
చదవండి: రిషి సునాక్ ఓటమి వెనక కారణలివేనా?
Comments
Please login to add a commentAdd a comment