బ్యాంకు తప్పిదం.. వ్యక్తి ఖాతాలో అక్షరాల రూ. 3 .7 లక్షల కోట్లు | Bank Accidentally Deposits 50 Billion In Us Familys Account | Sakshi
Sakshi News home page

బ్యాంకు తప్పిదం.. వ్యక్తి ఖాతాలో అక్షరాల రూ. 3 .7 లక్షల కోట్లు

Published Wed, Jun 30 2021 6:21 PM | Last Updated on Wed, Jun 30 2021 6:43 PM

Bank Accidentally Deposits 50 Billion In Us Familys Account - Sakshi

వాషింగ్టన్‌: బ్యాంకు తప్పిదాల కారణంగా వేలు, లక్షల రూపాయలు ఒకరి ఖాతా డెబిట్‌ కావడం, మరికొన్ని సందర్భాల్లో అదృష్టం వరించి కొందరి ఖాతాల్లో క్రెడిట్‌ కావడం చూసే ఉంటాం. అయితే, అమెరికాలోని ఓ కుటుంబం మాత్రం సాక్షాత్తూ కుబేరుడే తమ ఇంటికి వచ్చినంత సంబరపడ్డారు. ఎందుకంటే వారి ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే, అప్పనంగా వచ్చిన తమ ఖాతాలో పడ్డ సొమ్మును తీసుకోకుండా ఆ  కుటుంబం స్ఫూర్తిని చాటింది. 

వివరాల్లోకి వెళ్తే .. బ్యాంకు తప్పిదంతో లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్ ఖాతాలో ఏకంగా  50 బిలియన్ డాలర్లు ప్రత్యక్షమయ్యాయి. అంటే భారత కరెన్సీలో రూ.3.7 లక్షల కోట్లతో సమానం. లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్.. తన బ్యాంకు ఖాతాలో 50 బిలియన్ డాలర్లు జమం కావడంతో ఆశ్యర్యపోయాడు. విషయం తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ  కలిసి వెంటనే  బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. తప్పిదాన్ని తెలుసుకున్న బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఈ తప్పిదంపై దర్యాప్తు చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది. 
చదవండి:Serena Williams: చిన్న కారణం చేత ఒలింపిక్స్‌కు దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement