bank deposit
-
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
దేవాదాయ శాఖ కొత్త ప్లాన్.. గుడుల్లోకి వెండి తీసుకుని, బంగారం!
సాక్షి, హైదరాబాద్: గుడుల్లో నిరుపయోగంగా పడి ఉన్న వెండికి బదులుగా బంగారం సేకరించి డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. ప్రధాన ఆలయాల్లో ఉపయోగించకుండా ఉన్న వెండి 8 వేల కిలోలుగా లెక్క తేలింది. ఆర్జేసీ కేడర్‌లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ దేవాలయాల్లోనే 4 వేల కిలోలున్నట్టు గుర్తించారు. మూల విరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, పూజాధికాలకు వాడే వెండి, ఆలయ తాపడాలకు ఉన్నది కాకుండా.. భక్తులు కానుకలుగా హుండీలో వేసిన వెండిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానుకలుగా వచ్చినవాటిలో ఉపయోగించుకునే వస్తువులుగా ఉన్నది పోను, మిగిలిన ముక్కలకు సంబంధించిన నిల్వలపై లెక్కలు తీశారు. మొత్తం 8 వేల కిలోలుగా ఖరారు చేశారు. ఈ వెండిని స్వచ్ఛమైన (ఫైన్ సిల్వర్) వెండిగా మార్చి, దాని విలువకు సమానమైన బంగారాన్ని పొంది, గోల్డ్ డిపాజిట్ పథకం కింద స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 80 కిలోల వెండికి కిలో బంగారం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు భారీగా ఖర్చు వస్తోంది. ఇందుకు ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండిని ఆదాయంగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయాల్లో వెండిని సేకరించి, ఆయా ఆలయాల వారీగానే దాన్ని కరిగించి బంగారంలోకి మార్పిడి చేయించబోతోంది. కనీసం వంద కిలోల వెండి ఉన్న దేవాలయాలనే ఇందుకు గుర్తించింది. 8 వేల కిలోల వెండిని 995 (అంతకంటే మెరుగైన) ఫైన్ సిల్వర్‌గా మార్చేందుకు చర్లపల్లిలోని మింట్‌తో దేవాదాయశాఖ సంప్రదింపులు జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవాలయంతో మింట్‌కు ఇప్పటికే ఒప్పందం ఉంది. అదే పద్ధతిలో తమ దేవాలయాల్లోని వెండిని కూడా కరిగించి, మేలిమిగా మార్చి, దాని విలువకు తగ్గ బంగారు బిస్కెట్లను అందించాలని కోరుతోంది. ఫైన్ వెండిగా మారిస్తే మొత్తం వెండి నిల్వలో 55 శాతం నుంచి 60 శాతం మాత్రమే మేలిమి వెండి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆ రోజు మార్కెట్లో ఉన్న మేలిమి వెండి ధర ఆధారంగా, దానికి సమానమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో పొందాలన్నది ఆలోచన. ఈ లెక్కన 80 కిలోల వెండికి కిలో బంగారం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ పథకంతో లబ్ధి.. సమకూరిన బంగారాన్ని స్టేట్ బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ పథకంలో ఉంచనున్నారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం వెండికి చేయిస్తున్న బీమా ఖర్చు భారం తొలగిపోతుంది. ఇక స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తారు. -
బ్యాంకు తప్పిదం.. వ్యక్తి ఖాతాలో అక్షరాల రూ. 3 .7 లక్షల కోట్లు
వాషింగ్టన్: బ్యాంకు తప్పిదాల కారణంగా వేలు, లక్షల రూపాయలు ఒకరి ఖాతా డెబిట్ కావడం, మరికొన్ని సందర్భాల్లో అదృష్టం వరించి కొందరి ఖాతాల్లో క్రెడిట్ కావడం చూసే ఉంటాం. అయితే, అమెరికాలోని ఓ కుటుంబం మాత్రం సాక్షాత్తూ కుబేరుడే తమ ఇంటికి వచ్చినంత సంబరపడ్డారు. ఎందుకంటే వారి ఖాతాలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.3.7 లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. అయితే, అప్పనంగా వచ్చిన తమ ఖాతాలో పడ్డ సొమ్మును తీసుకోకుండా ఆ కుటుంబం స్ఫూర్తిని చాటింది. వివరాల్లోకి వెళ్తే .. బ్యాంకు తప్పిదంతో లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్ ఖాతాలో ఏకంగా 50 బిలియన్ డాలర్లు ప్రత్యక్షమయ్యాయి. అంటే భారత కరెన్సీలో రూ.3.7 లక్షల కోట్లతో సమానం. లూసియానాలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ డారెన్ జేమ్స్.. తన బ్యాంకు ఖాతాలో 50 బిలియన్ డాలర్లు జమం కావడంతో ఆశ్యర్యపోయాడు. విషయం తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. తప్పిదాన్ని తెలుసుకున్న బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. ఈ తప్పిదంపై దర్యాప్తు చేపట్టినట్లు బ్యాంకు తెలిపింది. చదవండి:Serena Williams: చిన్న కారణం చేత ఒలింపిక్స్‌కు దూరం -
టీడీఎస్ కోత వద్దా అయితే 'ఫామ్' ఇవ్వండి!
పొదుపు చేసేవారిలో చాలా మంది ఆధారపడేది బ్యాంకు డిపాజిట్లపైనే. రూ.లక్షల కొద్దీ డిపాజిట్ చేసిన వారి వార్షిక వడ్డీ ఆదాయంపై బ్యాంకులు టీడీఎస్ విధిస్తుంటాయి. ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందజేస్తాయి. కొందరికి పన్ను చెల్లించేంత ఆదాయం లేకున్నా వడ్డీ రూ.10వేలు దాటితే పడుతుంటుంది. ఇలాంటి వారు సకాలంలో బ్యాంకులకు ఫామ్ 15జీ, 15 హెచ్ ఇవ్వడం ద్వారా పన్ను కోత (టీడీఎస్) బాధను తప్పించుకోవచ్చు. అప్పుడు బ్యాంకులు వడ్డీలో రూపాయి కూడా కోత పెట్టవు. ఆ వివరాలు చూద్దాం... టీడీఎస్ అన్నది ఎంత మొత్తం డిపాజిట్ చేశారన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటిన వారికి టీడీఎస్ భారం ఉంటుంది. సీనియర్ సిటిజన్లు (60ఏళ్లు దాటిన వారు) అయితే వడ్డీ ఆదాయం రూ.50,000 వరకు టీడీఎస్ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలవుతుంది. చెల్లించాల్సిన వడ్డీలో 10 శాతాన్ని పన్ను కింద బ్యాంకులు మినహాయించి మిగిలిన మొత్తాన్నే ఖాతాదార్లకు చెల్లిస్తాయి. పన్ను కట్టేంత ఆదాయం లేకుంటే... ఒక ఉదాహరణ చూద్దాం. రాజారావుకు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఏడాదికి రూ.2 లక్షల వరకూ వస్తుంది. తనకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు. అలాగే శ్రీకర్‌కు జీతం రూపంలో వార్షికంగా రూ.10 లక్షల వరకూ వస్తుంది. అది కాకుండా బ్యాంకులోని డిపాజిట్లపై ఏడాదికి రూ.9 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం శ్రీకర్ తన జీతానికి ఈ వడ్డీని కలిపి మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే తను ఎక్కువ పన్ను చెల్లించాలి. రాజారావుకు ఇతరత్రా ఆదాయమేదీ లేదు కనుక రూ.2 లక్షలు దాదాపు పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది. కానీ ఇక్కడ బ్యాంకులు ఏం చేస్తాయంటే రాజారావు వడ్డీపై రూ.20వేలు ఆదాయపు పన్ను కింద మినహాయిస్తాయి. శ్రీకర్ విషయంలో మాత్రం రూపాయి కూడా కోత కోయవు. ఎందుకంటే వాటికి వడ్డీ ఆదాయం ఎంతన్నదే ముఖ్యం. డిపాజిట్ చేసిన వారి వ్యక్తిగత ఆదాయంతో సంబంధం ఉండదు. అందుకే రాజారావు వంటి వ్యక్తులు బ్యాంకుకు ఫామ్ 15జీ, 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకులు వారి వడ్డీలో కోత పెట్టవు. వారి ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటుంది కనుక వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.శ్రీకర్లా బయట జీతం, ఇతరత్రా ఆదాయం వస్తూ... అది పన్ను మినహాయింపు పరిధిని దాటిపోయిన పక్షంలో వారు బ్యాంకుల్లో ఫామ్ 15జీ, 15హెచ్ వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వారికి పన్ను రూపేణా 10 శాతం కోత పడి, మిగిలింది మాత్రమే చేతికి వస్తుంది. ఒకవేళ వారు సైతం ఫామ్ 15 సమర్పించి ఉంటే... బ్యాంకులు వారికి మొత్తం వడ్డీని ఇచ్చేస్తాయి. కానీ వారు తమ ఆదాయానికి దీన్ని కూడా కలిపి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎవరు ఏ ఫామ్ ఇవ్వాలంటే... 60 ఏళ్లలోపు వయసున్న వారు టీడీఎస్ వద్దనుకుంటే ఫామ్ 15జీ ఇవ్వాలి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వారు దీన్ని ఇచ్చేందుకు అర్హులు. ఒకవేళ సీనియర్ సిటిజన్లయితే ఫామ్ 15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ రెండూ కూడా మన దేశంలో ఉండేవారికే. ఎన్నారైలు వీటిని సమర్పించేందుకు అవకాశం లేదు. ఫామ్ 15జీ ఇవ్వాలనుకునే వారు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలేమిటంటే... పన్ను మినహాయింపులను తీసివేయగా మిగిలిన ఆదాయం వార్షికంగా రూ.2.5 లక్షలు దాటకూడదు. అలాగే, వడ్డీ ఆదాయం మొత్తం కూడా రూ.2.5 లక్షలు దాటకూడదు. మరో ఉదాహరణ చూద్దాం... శ్రీనాథ్‌కు వార్షికంగా వడ్డీ రూపేణా రూ.2.75 లక్షల ఆదాయం వస్తోంది. ఇది కాక అతని మరో రూ.1.25 లక్షలు ఇతర ఆదాయంగా సమకూరింది. మొత్తంగా ఆ సంవత్సరంలో అతని ఆదాయం రూ.4 లక్షలు. అయితే, శ్రీనాథ్ సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన సాధనాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. దీంతో అతడి పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలయింది. ఇక్కడ శ్రీనాథ్‌కు ఫామ్ 15జీ ఇచ్చేందుకు అర్హత లేదు. పన్ను వర్తించే ఆదాయం రూ.2.5 లక్షలే కానీ... వార్షిక వడ్డీ ఆదాయం రూ.2.5 లక్షలు దాటకూడదన్న నిబంధన అతడి విషయంలో నెరవేరలేదు. వడ్డీ రూపంలో శ్రీనాథ్‌కు రూ.2.75 లక్షలొస్తోంది కనుక ఫామ్ 15జీ ఇవ్వడానికి కుదరదు. అయితే, సీనియర్ సిటిజన్లకు కాస్తంత వెసులుబాటుంది. వారు ఏదో ఒక నిబంధన నెరవేరిస్తే ఫామ్ 15 హెచ్ ఇవ్వొచ్చు. అంటే సీనియర్ సిటిజన్లకు వార్షికాదాయం పన్ను వర్తించేంత ఉండకుండా ఉంటే చాలు. 60–80 ఏళ్ల మధ్య ఉన్న వారికి వార్షికాదాయం రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లపైన ఉన్న వారికి రూ.5 లక్షల వరకు పన్ను లేదు. ఈ లోపు వార్షికాదాయం ఉంటే ఫామ్ 15 హెచ్ ఇచ్చేందుకు అర్హత ఉన్నట్టే. వడ్డీ ఆదాయం ఈ వార్షిక ఆదాయ పరిమితి దాటి ఉన్నా ఫర్వాలేదు. బ్యాంకులకే కాదు... టీడీఎస్ విధించకుండా ఇచ్చే ఈ పత్రాలు బ్యాంకులకే పరిమితం అనుకునేరు. బాండ్లను జారీ చేసే కంపెనీలు, ఈపీఎఫ్‌వో, అద్దె ఇంట్లో ఉండి కిరాయి చెల్లించేవారు, కమీషన్ చెల్లించే బీమా సంస్థలకు కూడా వీటిని సమర్పించొచ్చు. ►ఒకే బ్యాంకు పరిధిలో ఒకటికి మించిన బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేసి ఉంటే అన్నింటి వడ్డీ ఆదాయాన్ని లెక్కించి బ్యాంకులు టీడీఎస్‌ను అమలు చేస్తాయి. కనుక డిపాజిట్ ఉన్న ప్రతీ బ్యాంకు శాఖలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటుతున్నట్టయితే ఫామ్ 15జీ, సీనియర్ సిటిజన్లు రూ.50,000 దాటితే ఫామ్15హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి వార్షిక వడ్డీ ఆదాయం రూ.5,000 దాటితే కంపెనీలు 10 శాతం టీడీఎస్‌ను కోసేస్తాయి. ► ఈపీఎఫ్ సభ్యులు ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకుండానే డబ్బుల్ని వెనక్కి తీసుకున్నా 10 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ►కిరాయిదారులు వార్షికంగా అద్దె రూపంలో ఇచ్చే ఆదాయం రూ.1,80,000 దాటితే వారూ అద్దె మొత్తంలో 10 శాతం టీడీఎస్ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భాల్లో అర్హత కలిగిన వారు ఫామ్ 15జీ లేదా ఫామ్ 15హెచ్ సమర్పించడం ద్వారా పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. ఈ పత్రాల్లో పాన్ నంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి. లేదంటే టీడీఎస్ కింద 20 శాతం మినహాయించడం జరుగుతుంది. ప్రస్తుతం బ్యాంకులు వీటిని ఆన్‌లైన్‌లోనూ సమర్పించే అవకాశం కల్పిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరంలో వీటిని ఎప్పుడైనా సమర్పించే వీలుంది. అయితే, పన్ను విధించకుండా వీలైనంత ముందుగానే ఇవ్వడమే మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి. వీటిని ప్రతీ ఆర్థిక సంవత్సరానికి విడిగా ఇవ్వాల్సి ఉంటుంది. -
ఏమార్చి.. నగదుతో ఉడాయించి
అనంతపురం: బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని దృష్టి మరల్చి అతనివద్ద నుంచి రూ.5.15 లక్షలతో ఉడాయించిన ఘనుడి ఉదంతం సోమవారం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...బాలరాజు అనే వ్యక్తి నగరంలోని డీఎస్పీ రెడ్డి భారత్ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. రోజూ సిలిండర్లను విక్రయించి వచ్చిన సొమ్మును బాలరాజు సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేసి వచ్చేవాడు. ఇదే క్రమంలో సోమవారం రూ. 5.15 లక్షల డబ్బును ఓ సంచిలో పెట్టుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఓచరు రాసుకుని క్యూలైన్లో నిలుచుకున్నాడు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తన ఓచరులో డేట్ రాయడం మరిచానని.. కాస్త రాసివ్వాలంటూ బాలరాజును అడిగాడు. దీంతో తన వద్దనున్న డబ్బు సంచిని పక్కన పెట్టిన బాలరాజు ఓచరులో తేదీ రాసే క్రమంలో రెప్పపాటులో తన డబ్బు సంచి చోరీకి గురైంది. పక్కకు తిరిగి చూసేలోగా బ్యాగు కనిపించలేదు. దీంతో ఆందోళనపడ్డ బాలరాజు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వచ్చి బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సీసీ కెమరా ఫుటేజీలు పరిశీలించారు. అనుమానితులను గుర్తించారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. -
ఇక తాళం ‘వెయ్యి’
నేటి నుంచి రూ.వెయ్యి నోటు మార్పిడి చెల్లదు బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో జమకే పరిమితం ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ.500 నోటు చెలామణీకి అవకాశం దానికి కూడా డిసెంబర్ 15 వరకు గడువు జిల్లాకు అందని కొత్త కరెన్సీ.. కొనసాగుతున్న చిల్లర కష్టాలు నెలాఖరు కారణంగా బ్యాంకుల వద్ద తగ్గిన రద్దీ వెయ్యి నోటుకు కాలం చెల్లిపోరుునట్లే.. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం తప్ప మరెక్కడా అది చెల్లబాటు కాదు. మార్పిడి అసలు కుదరదు. రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కేంద్రం ఇచ్చిన గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. రూ.500 నోటు వినియోగానికి కొన్ని షరతులతో అనుమతినిచ్చినా.. వెరుు్య నోటుకు అదీ ఇవ్వకపోవడంతో ఇక బయట దానికి మనుగడ లేనట్లే.. మరోవైపు నెలాఖరు కావడంతో జనం ఖాతాలు, డబ్బులు.. అన్నీ వట్టిపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కూడా బాగా తగ్గింది. మొబైల్ ఏటీఎంల సంఖ్య పెంచడం కూడా దీనికి దోహదపడింది. - సాక్షి, విశాఖపట్నం జీతాలు, పెన్షన్ల సొమ్ములు ఖర్చరుుపోయారుు. వ్యాపారాలు పడిపోయారుు. ఏటీఎం కార్డులు పెడితే వచ్చే ఆ చిల్లర తప్ప ఖాతాల్లో సొమ్ములు దాదాపు అడుగంటిపోయారుు. దీంతో నగరంలోని బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుముఖం పట్టారుు. ఏటీఎంల వద్ద కూడా క్యూలు పెద్దగా కన్పించడం లేదు. మరో పక్క వ్యాపారాలు ఘోరంగా పడిపోవడంతో వ్యాపారవర్గాలెవరూ బ్యాంకుల వైపు చూసే పరిస్థితి కన్పించడం లేదు.కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. మైక్రో ఏటీఎంలు, మొబైల్ ఏటీఎంల సంఖ్య భారీగా పెంచడం.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు పంపడంతో కొంత ఉపశమనం కలిగింది. చిల్లర సమస్య యథాతథం పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడి పదిహేను రోజులు దాటినా నోట్ల కష్టాలు ఏ మాత్రం తగ్గడం లేదు. జిల్లా జనాభాలో 40 శాతం మంది ఉద్యోగస్తులే ఉన్నారు. ఈ నెల నాలుగో వారం సమీపించడంతో బ్యాంకుల్లో ఉన్న జీతభత్యాలు నిల్వలు అడుగంటడంతో ఉద్యోగవర్గాలు బ్యాంకుల బాట పట్టడం తగ్గించారు. వ్యాపారాల్లేక వర్తక, వాణిజ్య వర్గాలు సైతం బ్యాంకుల వద్ద క్యూలు కట్టడం కన్పించడంలేదు. బ్యాంకుల వద్ద సుమారు రూ.300 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో 80 శాతానికి పైగా కొత్త రూ.2వేల నోట్లే కావడంతో చిల్లర సమస్యలు మరింత తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నారుు. ఇక ఏటీఎంల్లో కూడా వంద నోట్లు పూర్తిగా ఖాళీ కావడంతో రేపటి నుంచి పూర్తిగా రూ.2వేల నోట్లే దర్శనమివ్వనున్నారుు. సుమారు వంద కోట్లకుై పెగా రూ.వంద నోట్లు కావాలని జిల్లా యంత్రాంగం ఆర్బీఐకి లేఖరాయగా..ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు. వెయ్యి.. ఇక డిపాజిట్ చెయ్యి పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన రెండో రోజు నుంచి బ్యాంకుల్లో తొలుత రూ.4,500 వరకు పాతనోట్లు మార్చుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,500కు కుదించారు. రోజుకు ఒకరికి ఒకసారే మార్పిడికి అవకాశం ఇచ్చినప్పటికీ ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల్లో పలుమార్లు నగదు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో చేతివేలిపై ఇంకు ముద్రతో కంట్రోల్ చేశారు. గడిచిన వారం రోజులుగా రోజుకు రూ.2,500 చొప్పున పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కన్పించారుు. మూడురోజుల నుంచి ఏ బ్యాంకు ఖాతాదారులు ఆ బ్యాంకులోనే మార్చుకునేలా షరతులు పెట్టారు. పాతనోట్ల చెలామణి, మార్పిడి గడువు గురు వారం అర్థరాత్రితో ముగిసింది. పాతనోట్లతో బకారుుల చెల్లింపునకు డిసెంబర్ 15 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. కానీ వెయ్యి రూపాయల నోట్లతో ఎలాంటి చెల్లింపులకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేసింది దీంతో గురువారం అర్థరాత్రి నుంచి వెరుు్య నోట్ల చెలామణీ పూర్తిగా నిలిచిపోరుుంది. అరుుతే వీటిని బ్యాంకులు ,పోస్టాఫీసుల్లోని వ్యక్తిగత ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. రూ.500 నోటు వినియోగానికి కూడా కొన్ని పరిమితులు విధించారు. నగదు రహిత చెల్లింపులకు సేవా కేంద్రాలు మరో పక్క ప్రభుత్వ పథకాల అమలులోనే కాదు.. తోపుడుబండ్ల దగ్గర నుంచి వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాల వరకు ప్రతి చోట నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిస్తున్నారు. ఆ దిశగా ఆయా వర్గాలతోపాటు సామాన్యులకు సైతం అవగాహన కల్పించేందుకు సిటీతోపాటు ప్రతి మండల కేంద్రంల్లో నగదు రహిత చెల్లింపుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్స్..స్వైపింగ్ మిషన్ల వినియోగంలో శిక్షణ పొందిన వారితో సామాన్యులకు వీటి వినియోగంపై నేటి నుంచి అవగాహన కల్పించనున్నారు. -
వడ్డీ తగ్గితే దారేది?
♦ మాధవరావుది ప్రయివేటు ఉద్యోగం. రిటైరయ్యాడు. ఈపీఎఫ్ ద్వారా వచ్చే పెన్షను మరీ తక్కువ కావటంతో... తన రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును, అప్పటిదాకా పొదుపు చేసుకున్న డబ్బును పోస్టాఫీసులో వేసుకున్నాడు. నెలవారీ ఆదాయం వచ్చేలా డిపాజిట్ చేసి... దాన్లో కొంత ఆర్డీకి మళ్లించి... ఇలా ప్రధానంగా వడ్డీపైనే ఆధారపడ్డాడు. ఇపుడు ప్రభుత్వం ఉన్నట్టుండి వడ్డీరేట్ల కోత మొదలుపెట్టడంతో ఎటూ పాలుపోవటం లేదు. ♦ కృష్ణకుమార్దీ ఇంచుమించు అలాంటి పరిస్థితే. ప్రయివేటు ఉద్యోగం కావటంతో భవిష్యత్తు కోసం ఈపీఎఫ్, పీపీఎఫ్లనే నమ్మాడు. ఎప్పటికప్పుడు తన దగ్గర మిగిలే డబ్బును వాటికే మళ్లిస్తున్నాడు. వాటిక్కూడా వడ్డీరేట్ల కోత అంటుకోవటంతో ఏం చెయ్యాలన్నది అర్థంకావటం లేదు. ♦ వీళ్లిద్దరే కాదు. దేశంలో కోట్ల మంది పరిస్థితి ఇలాగే ఉంది. పెట్రోలు, డీజిల్ రేట్ల మాదిరిగా మెల్లగా నొప్పి తెలియకుండా మూడు నెలలకోసారి సవరిస్తామని చెప్పిన ప్రభుత్వం... చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీని గడిచిన నాలుగు నెలల్లో 2 సార్లు... కనిష్ఠంగా 0.75 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకూ తగ్గించేసింది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండటం... ఆర్థిక లోటు కూడా అదుపులో ఉండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించడానికి వెసులుబాటు కలిగింది. ఏప్రిల్ 5న జరిగే ఆర్బీఐ సమీక్షలో వడ్డీరేట్లు అర శాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్‌లోగా మొత్తమ్మీద వడ్డీ రేట్లు 0.75 శాతం తగ్గొచ్చన్నది అంచనా. ఇదే జరిగితే బ్యాంకు డిపాజిట్లు, చిన్న మొత్తాల పథకాలపై వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి. వడ్డీపై ఆధారపడి జీవించేవారి బతుకు దారుణంగా తయారవుతుంది. ♦ ప్రభుత్వ చర్యల తీరు పింఛను దారులకు, వడ్డీపై ఆధారపడ్డవారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. సరే!! మరేం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? ఏఏ పథకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి? ఆదాయంతో పాటు భద్రతనూ కల్పించే పథకాలేంటి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... - సాక్షి పర్సనల్ భారీగా తగ్గిన చిన్న మొత్తాల పొదుపు రేట్లు ♦ వీటికి అనుగుణంగా తగ్గనున్న బ్యాంకు డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణం అదుపుతో మరింతగా తగ్గనున్న వడ్డీరేట్లు ♦ వచ్చే ఏడాదిలోగా 0.50 నుంచి 0.75 శాతం తగ్గే అవకాశం తగ్గుతున్న వడ్డీరేట్లతో డిపాజిట్‌దారులు గగ్గోలు ♦ ప్రత్యామ్నాయాలు వెదక్కపోతే పెన్షనర్లకు కష్టకాలమే! ప్రత్యామ్నాయాల్లో బాండ్ ఫండ్లు; కంపెనీ డిపాజిట్లు ♦ అంతిమంగా ఈక్విటీలవైపు మళ్లించటమే సర్కారు లక్ష్యం! ఫైనాన్స్ విభాగం ♦ డబ్బు దాచుకోవడమంటే ప్రతి ఒక్కరికీ మొదట గుర్తొచ్చేది పోస్టాఫీసు లేదా బ్యాంకు డిపాజిట్లే. కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలనుకునే వారు మొదట చూసేది భద్రతే. పోస్టాఫీసుగానీ, బ్యాంకు గానీ అయితే భద్రతకు ఢోకా ఉండదు. అదే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన వాళ్లకయితే పోస్టాఫీసు నెలసరి ఆదాయమో, డిపాజిట్లు అందించే వడ్డీయో జీవనాధారంగా ఉంటుంది. కానీ వడ్డీ రేట్లేమో తగ్గుతున్నాయి. నిజానికి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణానికి కనీసం 3-4 శాతం అధికంగా డిపాజిట్లపై వడ్డీ రేట్లుంటాయి. ఇక్కడేమో పరిస్థితి భిన్నంగా ఉంది. వడ్డీరేట్లు ద్రవ్యోల్బణానికి ఒక శాతం మాత్రమే అధికంగా ఉన్నాయి. గతేడాది వినియోగ ద్రవ్యోల్బణం సుమారుగా 6 శాతం ఉంటే వడ్డీరేట్లు 7 శాతం వద్ద ఉన్నాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తుండగా... వడ్డీరేట్లు 1 శాతం కన్నా ఎక్కువే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలమే ఉత్తమం... బ్యాంకులు ఎప్పటి నుంచో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించాలనుకుంటున్నాయి. కాకపోతే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లు కాస్త ఎక్కువగా ఉండటంతో అవి వేచిచూశాయి. పోస్టాఫీసు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం... అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో బ్యాంకులూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 5న ఆర్బీఐ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయంతో ఈ విషయంలో స్పష్టత రావచ్చు. వడ్డీరేట్లు ఏ మేరకు తగ్గే అవకాశం ఉందనేది తెలిసిపోతుంది. ఇది కాసేపు పక్కనపెడితే... ఏప్రిల్ 1 నుంచి వడ్డీరేట్లు తగ్గుతున్నాయన్న విషయంలో స్పష్టత వచ్చేసింది. అందుకే వడ్డీమీద జీవించేవారు ఈ మార్చిలోనే దీర్ఘకాలానికి డిపాజిట్లు చేసుకుంటే మంచిదనేది నిపుణుల సూచన. దీర్ఘకాలిక డిపాజిట్లను ఎంచుకుంటే ఎక్కువ కాలం అధిక వడ్డీరేటును పొందే వెసులుబాటు ఉంటుందని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ వేణుగోపాల్ జాగర్లమూడి సూచించారు. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్ల కంటే పోస్టాఫీసు పథకాలే అధిక వడ్డీరేట్లు ఇస్తున్నాయని, వీటిలో ఇన్వెస్ట్ చేయటమే ఉత్తమమని ఆయన చెప్పారు. అలాగే వడ్డీరేట్లు కొద్దిగా తక్కువ ఉన్నా ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పన్ను పరిధిలో ఉండే వారు ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధికాదాయం పొందవచ్చు. కాకపోతే ఈ నెలలో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఏడాదికి మాత్రమే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయగలరని గుర్తుంచుకోవాలి. ఇతర ప్రత్యామ్నాయాలివీ.. డిపాజిట్ల కన్నా డెట్ ఫండ్స్ బెటర్... ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకుండా బ్యాంకు డిపాజిట్ల కంటే అధికాదాయం కావాలనుకునే వారికి డెట్ ఫండ్స్ అనుకూలమనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గుతున్న సమయంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేసే గిల్ట్ ఫండ్స్ అధిక రాబడులనిస్తాయి. అయితే ఇదే సమయంలో గిల్ట్ ఫండ్స్‌లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్లోని హెచ్చు తగ్గులకు అనుగుణంగా ఈ ఒడిదుడుకులను అందిపుచ్చుకునే వారికి గిల్ట్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. గిల్ట్ ఫండ్స్ మార్కెట్ కదలికలపై అంతగా అవగాహన లేనివారు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా ఆదాయాన్ని ఇచ్చే మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ లేదా షార్ట్, మీడియం టర్మ్ డెట్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో కనీసం మూడేళ్లు ఉండే విధంగా ఇన్వెస్ట్ చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. వడ్డీరేట్లు తగ్గుతుంటే ఈల్డ్ పెరగడం ద్వారా మీ సంపద విలువ పెరుగుతుంది. అలా కాకుండా నేరుగా బాండ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉండి, అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉన్న బాండ్స్‌ను ఎంచుకుంటే ఇబ్బందులుండవు. రిస్క్‌కు తగ్గ ఈక్విటీ ఫండ్స్.. ఏప్రిల్ నుంచి వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈ లోగా ఇన్వెస్ట్ చేస్తే ఓకే. అయితే చేతిలో డబ్బుల్లేక ఏప్రిల్ తరవాతే ఇన్వెస్ట్ చేయగలిగే పరిస్థితి ఉన్నవారు... వారి రిస్క్‌కు తగ్గట్టుగా ఇతర ప్రత్యామ్నాయ పథకాలవైపు చూడొచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరినవారు, మధ్య వయస్కులైతే వారికి కొద్దిగా నష్టభయాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి సిప్ విధానంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయటం మంచిదన్నది ఫండ్ మేనేజర్ల సూచన. ఇంత వరకు డిపాజిట్లలో తప్ప ఈక్విటీలో పెట్టుబడి పెట్టనివారు సెక్టోరియల్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో కాకుండా... ఇండెక్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్థాయి రిస్క్ కూడా చేయలేని వారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. వడ్డీరేట్లు తగ్గుతున్నప్పుడు బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్డ్ ఫండ్స్ బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందించే అవకాశాలున్నాయి. నిజానికి వడ్డీరేట్లు ఇలా తగ్గుతూ పోతే... రిస్క్ ఉన్నా అధిక రాబడిని ఇవ్వగలిగేవి, ఎంత మొత్తాన్నయినా పెట్టుబడిగా స్వీకరించగలిగే సత్తా ఉన్నవి స్టాక్ మార్కెట్లు మాత్రమే. వీటివైపు ఇన్వెస్ట్మెంట్లను మళ్లించటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమనే వాదన కూడా ఉంది. కంపెనీ డిపాజిట్లతో రిస్కూ... రాబడి కూడా! కంపెనీ డిపాజిట్లు కూడా స్థిరమైన ఆదాయాన్నిస్తాయి. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ హామీ ఉండదు. డిపాజిట్లకు బీమా గ్యారంటీ కూడా ఉండదు. ఈ రిస్క్‌కు సిద్థపడితే బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ వడ్డీనే పొందొచ్చు. కొన్ని కంపెనీలు డిపాజిట్‌దారులను ఆకర్షించడానికి అధిక వడ్డీలను ఆశచూపిస్తాయి. కానీ ఇలాంటి ఆకర్షణలకు లోనుకాకుండా... ముందుగా ఆ కంపెనీ చరిత్రను చూడాలి. ట్రాక్ రికార్డ్ బాగుండి, మంచి పేరు... మంచి యాజమాన్యం ఉన్న కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. సాధారణంగా కంపెనీలు డిపాజిట్లపై ప్రకటించే వడ్డీరేట్లు బ్యాంకు డిపాజిట్లకంటే ఎక్కువ, రుణాల వడ్డీరేట్ల కంటే తక్కువగా ఉంటాయి. కంపెనీలు బ్యాం కుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవటం కన్నా... అంతకన్నా తక్కువ వడ్డీరేటుకు ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్లు సేకరించడం మంచిది కదా... అని ఆలోచిస్తాయి. అలా కాకుండా బ్యాంకులు రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లకన్నా ఎక్కువ వడ్డీనిస్తామని కంపెనీలు గనక చెబితే... ఆ కంపెనీల గురించి ఒకసారి ఆలోచించాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోబట్టే అవి ఇన్వెస్టర్ల దగ్గరకు వచ్చాయని అనుకోవాలి. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు సుమారు 9 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.