దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది.
12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది.
ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment