పోలీసులు అనుమానిస్తున్న నిందితులు
అనంతపురం: బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లిన వ్యక్తిని దృష్టి మరల్చి అతనివద్ద నుంచి రూ.5.15 లక్షలతో ఉడాయించిన ఘనుడి ఉదంతం సోమవారం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...బాలరాజు అనే వ్యక్తి నగరంలోని డీఎస్పీ రెడ్డి భారత్ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. రోజూ సిలిండర్లను విక్రయించి వచ్చిన సొమ్మును బాలరాజు సాయినగర్‌లోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేసి వచ్చేవాడు. ఇదే క్రమంలో సోమవారం రూ. 5.15 లక్షల డబ్బును ఓ సంచిలో పెట్టుకుని బ్యాంకుకు వెళ్లాడు.
ఓచరు రాసుకుని క్యూలైన్‌లో నిలుచుకున్నాడు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తన ఓచరులో డేట్ రాయడం మరిచానని.. కాస్త రాసివ్వాలంటూ బాలరాజును అడిగాడు. దీంతో తన వద్దనున్న డబ్బు సంచిని పక్కన పెట్టిన బాలరాజు ఓచరులో తేదీ రాసే క్రమంలో రెప్పపాటులో తన డబ్బు సంచి చోరీకి గురైంది. పక్కకు తిరిగి చూసేలోగా బ్యాగు కనిపించలేదు. దీంతో ఆందోళనపడ్డ బాలరాజు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు వచ్చి బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సీసీ కెమరా ఫుటేజీలు పరిశీలించారు. అనుమానితులను గుర్తించారు. వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment