ఇక తాళం ‘వెయ్యి’ | Ruveyyi note exchange is valid from today | Sakshi
Sakshi News home page

ఇక తాళం ‘వెయ్యి’

Published Fri, Nov 25 2016 2:19 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

ఇక తాళం ‘వెయ్యి’

ఇక తాళం ‘వెయ్యి’

నేటి నుంచి రూ.వెయ్యి నోటు మార్పిడి చెల్లదు
బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో జమకే పరిమితం
ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ.500 నోటు చెలామణీకి అవకాశం
దానికి కూడా డిసెంబర్ 15 వరకు గడువు
జిల్లాకు అందని కొత్త కరెన్సీ.. కొనసాగుతున్న చిల్లర కష్టాలు
నెలాఖరు కారణంగా బ్యాంకుల వద్ద తగ్గిన రద్దీ

వెయ్యి నోటుకు కాలం చెల్లిపోరుునట్లే.. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం తప్ప మరెక్కడా అది చెల్లబాటు కాదు. మార్పిడి అసలు కుదరదు. రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కేంద్రం ఇచ్చిన గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. రూ.500 నోటు వినియోగానికి కొన్ని షరతులతో అనుమతినిచ్చినా.. వెరుు్య నోటుకు అదీ ఇవ్వకపోవడంతో ఇక బయట దానికి మనుగడ లేనట్లే.. మరోవైపు నెలాఖరు కావడంతో జనం ఖాతాలు, డబ్బులు.. అన్నీ వట్టిపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కూడా బాగా తగ్గింది. మొబైల్ ఏటీఎంల సంఖ్య పెంచడం కూడా దీనికి దోహదపడింది.  - సాక్షి, విశాఖపట్నం

జీతాలు, పెన్షన్ల సొమ్ములు ఖర్చరుుపోయారుు. వ్యాపారాలు పడిపోయారుు. ఏటీఎం కార్డులు పెడితే వచ్చే ఆ చిల్లర తప్ప ఖాతాల్లో సొమ్ములు దాదాపు అడుగంటిపోయారుు. దీంతో నగరంలోని బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుముఖం పట్టారుు. ఏటీఎంల వద్ద కూడా క్యూలు పెద్దగా కన్పించడం లేదు. మరో పక్క వ్యాపారాలు ఘోరంగా పడిపోవడంతో వ్యాపారవర్గాలెవరూ బ్యాంకుల వైపు చూసే పరిస్థితి కన్పించడం లేదు.కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. మైక్రో ఏటీఎంలు, మొబైల్ ఏటీఎంల సంఖ్య భారీగా పెంచడం.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు పంపడంతో కొంత ఉపశమనం కలిగింది.

చిల్లర సమస్య యథాతథం
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడి పదిహేను రోజులు దాటినా నోట్ల కష్టాలు ఏ మాత్రం తగ్గడం లేదు. జిల్లా జనాభాలో 40 శాతం మంది ఉద్యోగస్తులే ఉన్నారు. ఈ నెల నాలుగో వారం సమీపించడంతో బ్యాంకుల్లో ఉన్న జీతభత్యాలు నిల్వలు అడుగంటడంతో ఉద్యోగవర్గాలు  బ్యాంకుల బాట పట్టడం తగ్గించారు. వ్యాపారాల్లేక వర్తక, వాణిజ్య వర్గాలు సైతం బ్యాంకుల వద్ద క్యూలు కట్టడం కన్పించడంలేదు. బ్యాంకుల వద్ద సుమారు రూ.300 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో 80 శాతానికి పైగా కొత్త రూ.2వేల నోట్లే కావడంతో చిల్లర సమస్యలు మరింత తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నారుు. ఇక ఏటీఎంల్లో కూడా వంద నోట్లు పూర్తిగా ఖాళీ కావడంతో రేపటి నుంచి పూర్తిగా రూ.2వేల నోట్లే దర్శనమివ్వనున్నారుు. సుమారు వంద కోట్లకుై పెగా రూ.వంద నోట్లు కావాలని జిల్లా యంత్రాంగం ఆర్బీఐకి లేఖరాయగా..ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు.

వెయ్యి.. ఇక డిపాజిట్ చెయ్యి
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన రెండో రోజు నుంచి బ్యాంకుల్లో తొలుత రూ.4,500 వరకు పాతనోట్లు మార్చుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,500కు కుదించారు. రోజుకు ఒకరికి ఒకసారే మార్పిడికి అవకాశం ఇచ్చినప్పటికీ ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల్లో పలుమార్లు నగదు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో చేతివేలిపై ఇంకు ముద్రతో కంట్రోల్ చేశారు. గడిచిన వారం రోజులుగా రోజుకు రూ.2,500 చొప్పున పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కన్పించారుు. మూడురోజుల నుంచి ఏ బ్యాంకు ఖాతాదారులు ఆ బ్యాంకులోనే మార్చుకునేలా షరతులు పెట్టారు. పాతనోట్ల చెలామణి, మార్పిడి గడువు గురు వారం అర్థరాత్రితో ముగిసింది. పాతనోట్లతో బకారుుల చెల్లింపునకు డిసెంబర్ 15 వరకు కేంద్రం గడువు ఇచ్చింది.

కానీ వెయ్యి రూపాయల నోట్లతో ఎలాంటి చెల్లింపులకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేసింది దీంతో గురువారం అర్థరాత్రి నుంచి  వెరుు్య నోట్ల చెలామణీ పూర్తిగా నిలిచిపోరుుంది. అరుుతే వీటిని బ్యాంకులు ,పోస్టాఫీసుల్లోని వ్యక్తిగత ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. రూ.500 నోటు వినియోగానికి కూడా కొన్ని పరిమితులు విధించారు.

నగదు రహిత చెల్లింపులకు సేవా కేంద్రాలు
మరో పక్క ప్రభుత్వ పథకాల అమలులోనే కాదు.. తోపుడుబండ్ల దగ్గర నుంచి వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాల వరకు ప్రతి చోట  నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిస్తున్నారు.  ఆ దిశగా ఆయా వర్గాలతోపాటు సామాన్యులకు సైతం అవగాహన కల్పించేందుకు సిటీతోపాటు ప్రతి మండల కేంద్రంల్లో నగదు రహిత చెల్లింపుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్స్..స్వైపింగ్ మిషన్ల వినియోగంలో శిక్షణ పొందిన వారితో సామాన్యులకు వీటి వినియోగంపై నేటి నుంచి అవగాహన కల్పించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement