Thousand note
-
రూ.1000 నోటు ఇక డిపాజిట్‌కే పరిమితం
రూ.1000 నోటు ఇక డిపాజిట్‌కే పరిమితం అదికూడా కొన్నాళ్లపాటే బ్యాంకుల్లో నగదు మార్పిడికి నేటి నుంచి మంగళం జిల్లా ప్రజలకు మరిన్ని కష్టాలు తిరుపతి (అలిపిరి): వెయ్యి నోటు చెల్లుబాటు కాదంటూ కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజలపై పిడుగుపాటరుుంది. డిసెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చిన కేంద్రం ఒక్కసారిగా మాట మార్చింది. ఈ నోటు డిపాజిట్‌కు తప్ప మరేదానికీ ఉపయోగపడదని తేల్చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకూ ఆదుకున్న నగదు మార్పిడిని కూడా కేంద్రం రద్దు చేసింది. జిల్లాలో 40 జాతీయ బ్యాంకులకు చెందిన 593 శాఖల్లో గత 15 రోజుల్లో రూ.1500 కోట్ల మేర నగదు మార్పిడి జరిగింది. తాజాగా నగదు మార్పిడిని రద్దు చేయడంతో కొన్ని వర్గాలకు ఇబ్బంది తప్పదు. రూ.500 నోటు కూడా డిసెంబర్ 15 తరువాత చెల్లుబాటు కాదని కేంద్రం ప్రకటించింది. బ్యాంకులు నగదు కొరతతో ప్రజలకు పూర్తి స్థారుులో సేవలు అందించలేకపోతున్నారుు. కేం ద్రం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుం డా రూ.500 నోటును కూడా చెల్లుబాటు కాని జాబితాలో చేర్చితే సామాన్య ప్రజల కు మరిన్ని కష్టాలు తప్పవు. రూ.500 నోట్లను ప్రభుత్వ బకారుుల చెల్లింపులు, స్కూళ్ల ఫీజులు తదితర స్థానిక సంస్థల చెల్లింపులకు వెసులుబాటు కల్పించింది. ఈ ఒక్క నిర్ణయం మాత్రమే జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. డిసెంబరు నెలాఖరు వరకూ కేంద్రం గడువిచ్చిందనే ధీమాతో జిల్లాలో కొందరు వెరుు్యనోట్లను ఇంకా బ్యాంకులకు తీసుకెళ్లలేదు. అంతేకాదు గుడ్డిలోమెల్లలా ఇప్పటివకరూ నగదు లావాదేవీల్లో ఈ నోటు కీలక భూమిక పోషించింది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన సందర్భాల్లో కొందరు వర్తకులు ఈ నోట్లను అనుమతించారు. సమయముంది కదా ఏదోలా డిపాజిట్ చేసుకుందాంలే అని వ్యాపారులు భావించారు. వీరందరికీ తాజా నిర్ణయం నివ్వెరపోయేలా చేసింది. 2000 నోటు తర్వాత వాడకంలో వంద మాత్రమే ఉండటం తలనొప్పిగా తయారైంది. నోట్ల మార్పిడికి గడువిచ్చి ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికమని కొందరు వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటన వచ్చాక ఇలా మాట తప్పడం ఎక్కడా చూడలేదంటున్నారు. 2వ తేదీ వరకు టోల్‌ఫీ రద్దు జాతీయ రహదారులకు సంబంధించి టోల్‌ఫీని డిసెంబర్ 2వ తేది అర్థరాత్రి వరకు కేంద్రం రద్దు చేసింది. అటు తరువాత రూ.500 నోట్లతో టోల్‌ఫీని డిసెంబర్ 15 వరకు చెల్లుబాటు అవుతుంది. తరువాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతాయో అంటూ వాహనదారులు అయోమయంలో పడ్డారు. -
ఇక తాళం ‘వెయ్యి’
నేటి నుంచి రూ.వెయ్యి నోటు మార్పిడి చెల్లదు బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లో జమకే పరిమితం ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ.500 నోటు చెలామణీకి అవకాశం దానికి కూడా డిసెంబర్ 15 వరకు గడువు జిల్లాకు అందని కొత్త కరెన్సీ.. కొనసాగుతున్న చిల్లర కష్టాలు నెలాఖరు కారణంగా బ్యాంకుల వద్ద తగ్గిన రద్దీ వెయ్యి నోటుకు కాలం చెల్లిపోరుునట్లే.. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం తప్ప మరెక్కడా అది చెల్లబాటు కాదు. మార్పిడి అసలు కుదరదు. రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి కేంద్రం ఇచ్చిన గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది. రూ.500 నోటు వినియోగానికి కొన్ని షరతులతో అనుమతినిచ్చినా.. వెరుు్య నోటుకు అదీ ఇవ్వకపోవడంతో ఇక బయట దానికి మనుగడ లేనట్లే.. మరోవైపు నెలాఖరు కావడంతో జనం ఖాతాలు, డబ్బులు.. అన్నీ వట్టిపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కూడా బాగా తగ్గింది. మొబైల్ ఏటీఎంల సంఖ్య పెంచడం కూడా దీనికి దోహదపడింది. - సాక్షి, విశాఖపట్నం జీతాలు, పెన్షన్ల సొమ్ములు ఖర్చరుుపోయారుు. వ్యాపారాలు పడిపోయారుు. ఏటీఎం కార్డులు పెడితే వచ్చే ఆ చిల్లర తప్ప ఖాతాల్లో సొమ్ములు దాదాపు అడుగంటిపోయారుు. దీంతో నగరంలోని బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుముఖం పట్టారుు. ఏటీఎంల వద్ద కూడా క్యూలు పెద్దగా కన్పించడం లేదు. మరో పక్క వ్యాపారాలు ఘోరంగా పడిపోవడంతో వ్యాపారవర్గాలెవరూ బ్యాంకుల వైపు చూసే పరిస్థితి కన్పించడం లేదు.కానీ గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితిలో మాత్రం మార్పు కన్పించడం లేదు. మైక్రో ఏటీఎంలు, మొబైల్ ఏటీఎంల సంఖ్య భారీగా పెంచడం.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు పంపడంతో కొంత ఉపశమనం కలిగింది. చిల్లర సమస్య యథాతథం పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడి పదిహేను రోజులు దాటినా నోట్ల కష్టాలు ఏ మాత్రం తగ్గడం లేదు. జిల్లా జనాభాలో 40 శాతం మంది ఉద్యోగస్తులే ఉన్నారు. ఈ నెల నాలుగో వారం సమీపించడంతో బ్యాంకుల్లో ఉన్న జీతభత్యాలు నిల్వలు అడుగంటడంతో ఉద్యోగవర్గాలు బ్యాంకుల బాట పట్టడం తగ్గించారు. వ్యాపారాల్లేక వర్తక, వాణిజ్య వర్గాలు సైతం బ్యాంకుల వద్ద క్యూలు కట్టడం కన్పించడంలేదు. బ్యాంకుల వద్ద సుమారు రూ.300 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో 80 శాతానికి పైగా కొత్త రూ.2వేల నోట్లే కావడంతో చిల్లర సమస్యలు మరింత తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నారుు. ఇక ఏటీఎంల్లో కూడా వంద నోట్లు పూర్తిగా ఖాళీ కావడంతో రేపటి నుంచి పూర్తిగా రూ.2వేల నోట్లే దర్శనమివ్వనున్నారుు. సుమారు వంద కోట్లకుై పెగా రూ.వంద నోట్లు కావాలని జిల్లా యంత్రాంగం ఆర్బీఐకి లేఖరాయగా..ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రాలేదు. వెయ్యి.. ఇక డిపాజిట్ చెయ్యి పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన రెండో రోజు నుంచి బ్యాంకుల్లో తొలుత రూ.4,500 వరకు పాతనోట్లు మార్చుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.2,500కు కుదించారు. రోజుకు ఒకరికి ఒకసారే మార్పిడికి అవకాశం ఇచ్చినప్పటికీ ఒకే వ్యక్తి వివిధ బ్యాంకుల్లో పలుమార్లు నగదు మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో చేతివేలిపై ఇంకు ముద్రతో కంట్రోల్ చేశారు. గడిచిన వారం రోజులుగా రోజుకు రూ.2,500 చొప్పున పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కన్పించారుు. మూడురోజుల నుంచి ఏ బ్యాంకు ఖాతాదారులు ఆ బ్యాంకులోనే మార్చుకునేలా షరతులు పెట్టారు. పాతనోట్ల చెలామణి, మార్పిడి గడువు గురు వారం అర్థరాత్రితో ముగిసింది. పాతనోట్లతో బకారుుల చెల్లింపునకు డిసెంబర్ 15 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. కానీ వెయ్యి రూపాయల నోట్లతో ఎలాంటి చెల్లింపులకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేసింది దీంతో గురువారం అర్థరాత్రి నుంచి వెరుు్య నోట్ల చెలామణీ పూర్తిగా నిలిచిపోరుుంది. అరుుతే వీటిని బ్యాంకులు ,పోస్టాఫీసుల్లోని వ్యక్తిగత ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. రూ.500 నోటు వినియోగానికి కూడా కొన్ని పరిమితులు విధించారు. నగదు రహిత చెల్లింపులకు సేవా కేంద్రాలు మరో పక్క ప్రభుత్వ పథకాల అమలులోనే కాదు.. తోపుడుబండ్ల దగ్గర నుంచి వర్తక, వ్యాపార, వాణిజ్య రంగాల వరకు ప్రతి చోట నగదు రహిత లావాదేవీలు జరపాలని ఆదేశాలిస్తున్నారు. ఆ దిశగా ఆయా వర్గాలతోపాటు సామాన్యులకు సైతం అవగాహన కల్పించేందుకు సిటీతోపాటు ప్రతి మండల కేంద్రంల్లో నగదు రహిత చెల్లింపుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్స్..స్వైపింగ్ మిషన్ల వినియోగంలో శిక్షణ పొందిన వారితో సామాన్యులకు వీటి వినియోగంపై నేటి నుంచి అవగాహన కల్పించనున్నారు. -
‘జన్‌ధన్’ ఖాతాల్లోకి నల్లధనం
కోల్‌కతా: రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నారుు. ప్రధాని పిలుపు మేరకు పేద ప్రజలు చాలా మంది జీరో బ్యాలెన్‌సతో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలను ‘నల్ల’ బాబులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు వినియో గిస్తున్నారు. ఒక్కో అకౌంట్లోకి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే అందులో 20 నుంచి 30 శాతం సొమ్మును ఖాతాదారులకు అప్పజెబుతున్నారు. ‘నా ఖాతాలో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మంచి మొత్తంలో తిరిగి ఇస్తున్నారు. ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయగానే వారి సొమ్మును అప్పగిచ్చేస్తాను’ అని ఓ బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న చాయ్‌వాలా చెప్పాడు. దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల జన్‌ధన్ ఖాతా లున్నారుు. ఇవిగాక డబ్బు మార్పిడి చేసేవాళ్లు, ఎంట్రీ ఆపరేటర్లు నల్ల డబ్బును తెలు పులోకి మార్చడంలో బిజీగా ఉన్నారు. బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే ఓ వ్యక్తి మా ట్లాడుతూ, ‘మా వ్యాపారమంతా నగదు రూపంలోనే జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణ యంతో ఇబ్బందిగా మారింది. ఎంట్రీ ఆపరేటర్లను సంప్రదించాం. రూ.కోటి నల్ల డ బ్బు ఇస్తే.. 70 లక్షలు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాం’ అని వివరించారు. -
వెయ్యి నోట్లు విసిరేశాడు
- కారులోంచి విసురుకుంటూ వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి - తీసుకొనేందుకు పరుగులు పెట్టిన జనం ద్వారకాతిరుమల: వచ్చీపోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి రూ.వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన రూ.వెరుు్య నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపుకు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు.