కోల్‌కతా: రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నారుు. ప్రధాని పిలుపు మేరకు పేద ప్రజలు చాలా మంది జీరో బ్యాలెన్‌సతో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలను ‘నల్ల’ బాబులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు వినియో గిస్తున్నారు. ఒక్కో అకౌంట్‌లోకి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే అందులో 20 నుంచి 30 శాతం సొమ్మును ఖాతాదారులకు అప్పజెబుతున్నారు. ‘నా ఖాతాలో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మంచి మొత్తంలో తిరిగి ఇస్తున్నారు.
ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయగానే వారి సొమ్మును అప్పగిచ్చేస్తాను’ అని ఓ బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న చాయ్‌వాలా చెప్పాడు. దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల జన్‌ధన్ ఖాతా లున్నారుు. ఇవిగాక డబ్బు మార్పిడి చేసేవాళ్లు, ఎంట్రీ ఆపరేటర్లు నల్ల డబ్బును తెలు పులోకి మార్చడంలో బిజీగా ఉన్నారు. బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే ఓ వ్యక్తి మా ట్లాడుతూ, ‘మా వ్యాపారమంతా నగదు రూపంలోనే జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణ యంతో ఇబ్బందిగా మారింది. ఎంట్రీ ఆపరేటర్లను సంప్రదించాం. రూ.కోటి నల్ల డ బ్బు ఇస్తే.. 70 లక్షలు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాం’ అని వివరించారు.
‘జన్‌ధన్’ ఖాతాల్లోకి నల్లధనం
Published Sun, Nov 13 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
Advertisement
Advertisement