jandhan
-
అలాంటి నకిలీ ఖాతాలు తొలగించండి - కేంద్ర ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద నకిలీ ఖాతాలను (ఒకటికి మించి ఉన్న) తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లను (ఆర్ఆర్బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అన్ని ఆర్ఆర్బీలు డిజిటల్ సామర్థ్యాలను అలవరుచుకోవాలని కోరారు. ఎంఎస్ఎంఈ శాఖ గుర్తించిన క్లస్టర్ల వద్ద ఆర్ఆర్బీలు శాఖలు తెరిచేలా చూడాలని ప్రాయోజిత షెడ్యూల్డ్ బ్యాంకులకు మంత్రి సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆర్ఆర్బీల చీఫ్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపుల ఖాతాల్లో వెంటనే రూ. 7 వేలు వేయాలని నగరంలోని 47వ వార్డు మహిళలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఆవరణలో వారు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సుమలత, జరీనాబీ మాట్లాడుతూ పొదుపు మహిళల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేస్తానని చెప్పి రూ. 3 వేలతోనే సరిపెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ప్రధాని జన్‌ధన్ ఖాతాల్లో రూ. పది వేలు జమ చేయాలని కోరారు. సీఎం పొదుపు మహిళలకు తక్షణమే రూ. 7 వేలు వేయకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆందోళనలో ఫరీదా, జంబావతి, ఈశ్వరమ్మ, సుమతి, శేషమ్మ, లలితమ్మ, రామలక్ష్మి, చిట్టెమ్మ, సుబ్బలక్షమమ్మ, 47వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిద్దాం
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): నగదు రహిత లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ బ్యాంకర్లను ఆదేశించారు. జన్‌ధన్ ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్లర్లకు సూచించారు. శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నగదు కొరతను అధిగమించేందుకు శనివారం నుంచి క్యాష్ ఎట్ మిషన్లతో మొబైల్ ఏటీఏంలను అందుబాటులోకి తెస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కిరాణం షాపులు, మెడికల్ షాపులు, చౌకధరల దుకాణాలు తదితర వాటిల్లో క్యాష్ ఎట్ మిషన్లను ఏర్పాటును ప్రోత్సహించాలని సూచించారు. ఎస్బీఐ ఆర్ఎం రమేష్ కుమార్ మాట్లాడుతూ... తమ బ్యాంకులో రూ.25వేల నుంచి రూ50వేల డిపాజిట్తోమ కర ంట్ఖాతా ప్రారంభిస్తే వారికి క్యాష్ ఎట్ మిషన్లు ఇస్తామని వివరించారు. ఆంధ్రబ్యాంకులో రూ.3000 జమ చేస్తే వీటిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీఎం గోపాలకృష్ణ తెలిపారు. మండలానికి నలుగురు, మేజర్ పంచాయతీకి ఇద్దరు, మైనర్ పంచాయతీకి ఒకరు ప్రకారం బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఏటీఎంలు ప్రారంభం నగదు కొరతను తీర్చేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమొహన్ మొబైల్ ఏటీఎంలను ప్రారంభించారు. వీటి ద్వారా రూ.2000 నగదు తీసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతానికి మూడు మొబైల్ ఎటీఎంలను అందుబాటులోకి తెచ్చామని శనివారం నుంచి నగరంలో అందుబాటులో ఉంటాయని వివరించారు. -
జన్‌ధన్,డ్వాక్రా ఖాతాల్లోకి భారీగా డబ్బు జమ
-
జన్‌ధన్‌పై నల్లకుబేరుల కన్ను!
అమలాపురం : ఎప్పుడూ నయాపైసా లావాదేవీలు జరగని జన్‌ధన్ యోజన ఖాతాల్లో నగదు జమ అవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఏడు లక్షలకు పైగా జన్‌ధన్ యోజన ఖాతాలున్నట్టు అంచనా. మామూలుగా బ్యాంకు ఖాతాలో రూ.2.50 లక్షల వరకూ పాత నోట్లను జమ చేసుకునే వీలు ఉండడంతో.. జన్‌ధన్‌ఖాతాలున్న పేదల ద్వారా నల్లకుబేరులు నల్లధనాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ ఖాతాదార్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ముట్టజెప్పేందుకు సిద్ధపడుతున్నారు. అటువంటి ఖాతాదారుల కోసం తమ బంధుమిత్రుల ద్వారా ఆరాలు తీస్తున్నారు. కొంతమందికి ముందుగానే చెప్పుకుని ఉంచుకున్నారు. ప్రస్తుతం కేవలం రూ.4 వేల వరకూ మాత్రమే పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నగదు మార్చుకునేందుకు అనుమతి వచ్చినప్పుడు ఈ ఖాతాల ద్వారా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జన్‌ధన్‌ఖాతాలతో పాత నోట్ల మార్పిడి చేస్తే ఖాతాదారులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకౌంట్లు తెరచినప్పటినుంచీ ఎటువంటి లావాదేవీలూ నిర్వహించకుండా.. ఇప్పుడు ఒకేసారి రూ.2 లక్షలకు పైగా నగదు మారిస్తే ఆదాయపన్ను విభాగం అధికారులు ఆరా తీసే అవకాశముంటుందని అంటున్నారు. ఇదే జరిగితే అకౌంట్లలో నగదు మార్చుకున్నవారికన్నా అందుకు సహకరించినవారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. -
‘జన్‌ధన్’ ఖాతాల్లోకి నల్లధనం
కోల్‌కతా: రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో.. నల్ల కుబేరులు ధనం దాచుకునేందుకు ప్రధాని ప్రారంభించిన ‘జన్‌ధన్’ ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నారుు. ప్రధాని పిలుపు మేరకు పేద ప్రజలు చాలా మంది జీరో బ్యాలెన్‌సతో జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాతాలను ‘నల్ల’ బాబులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు వినియో గిస్తున్నారు. ఒక్కో అకౌంట్లోకి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే అందులో 20 నుంచి 30 శాతం సొమ్మును ఖాతాదారులకు అప్పజెబుతున్నారు. ‘నా ఖాతాలో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మంచి మొత్తంలో తిరిగి ఇస్తున్నారు. ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయగానే వారి సొమ్మును అప్పగిచ్చేస్తాను’ అని ఓ బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న చాయ్‌వాలా చెప్పాడు. దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల జన్‌ధన్ ఖాతా లున్నారుు. ఇవిగాక డబ్బు మార్పిడి చేసేవాళ్లు, ఎంట్రీ ఆపరేటర్లు నల్ల డబ్బును తెలు పులోకి మార్చడంలో బిజీగా ఉన్నారు. బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే ఓ వ్యక్తి మా ట్లాడుతూ, ‘మా వ్యాపారమంతా నగదు రూపంలోనే జరుగుతుంది. ప్రభుత్వ నిర్ణ యంతో ఇబ్బందిగా మారింది. ఎంట్రీ ఆపరేటర్లను సంప్రదించాం. రూ.కోటి నల్ల డ బ్బు ఇస్తే.. 70 లక్షలు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాం’ అని వివరించారు. -
జన్‌ధన్ 'బ్యాంకు' డిపాజిట్లపై విచారణ: జైట్లీ
న్యూఢిల్లీ: జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో కొన్ని బ్యాంకులే స్వయంగా ఖాతాదారుల తరఫున డిపాజిట్లు చేశాయని వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పందించారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్యను తగ్గించేందుకు జన్‌ధన్ ఖాతాల్లో ఒక రూపాయి చొప్పున బ్యాంకులే డిపాజిట్ చేశాయని వచ్చిన ఆరోపణలపై సంబంధిత బ్యాంకులు విచారణ జరుపుతున్నాయన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన కొన్ని బ్రాంచిలపై ఆరోపణలు వచ్చాయని.. దీనిపై ఆయా బ్యాంకులు విచారణ జరిపి నివేదిక అందిస్తాయని వెల్లడించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మొత్తం 24 కోట్ల జన్‌ధన్ అకౌంట్లు ఉన్నాయని, వీటిల్లో మొత్తం 42,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు. ఈ ఖాతాల్లో ఎక్కువ శాతం బలహీన వర్గాలకు సంబంధించినవే అని వెల్లడించారు. ఒకవేళ ఒక్కో ఖాతాలో ఒక రూపాయి చొప్పున డిపాజిట్ చేసినా ఆ మొత్తం 42,000 కోట్లకు చేరదని జైట్లీ తెలిపారు. -
'జన్‌ధన్ ఆధార్ తో అవినీతి రహిత పాలన'
న్యూఢిల్లీ: జన్‌ధన్-ఆధార్- మొబైల్‌తో అవినీతి రహిత పాలన అందించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో నేషనల్ ఎకనమిక్ ఎన్ క్లేవ్లో పాల్గొన్న ఆయన జన్ ధన్-ఆధార్-మొబైల్ అంశంపై కొద్ది సేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా సబ్సిడీలు, సంక్షేమరంగంలో అనూహ్య మార్పులు రాబోతున్నాయని చెప్పారు. జన్ ధన్-ఆధార్- మొబైల్ ద్వారా పారదర్శకతతో కూడిన పాలన సాధ్యమవుతుందని చెప్పారు.