న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద నకిలీ ఖాతాలను (ఒకటికి మించి ఉన్న) తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లను (ఆర్‌ఆర్‌బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.
ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అన్ని ఆర్‌ఆర్‌బీలు డిజిటల్ సామర్థ్యాలను అలవరుచుకోవాలని కోరారు.
ఎంఎస్‌ఎంఈ శాఖ గుర్తించిన క్లస్టర్ల వద్ద ఆర్‌ఆర్‌బీలు శాఖలు తెరిచేలా చూడాలని ప్రాయోజిత షెడ్యూల్డ్ బ్యాంకులకు మంత్రి సూచించారు. ఢిల్లీలో బుధవారం ఆర్‌ఆర్‌బీల చీఫ్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ఆర్‌బీఐ, నాబార్డ్, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment