కేంద్ర బడ్జెట్ 2024-25 తయారీ ప్రక్రియ చివరి దశకు గుర్తుగా 'హల్వా' వేడుక సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
హాల్వా వేడుక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాత్రమే కాకుండా.. ఎంఓఎస్ పంకజ్ చౌదరి, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, సీఈఏ వి అనంత నాగేశ్వరన్, డీఈఏ కార్యదర్శి అజయ్ సేథ్ తదితరులు పాల్గొన్నారు. హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటగదిలో తయారు చేశారు.
ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హాల్వా వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆర్థిక మంత్రి చివరకు బడ్జెట్ సమర్పించే వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశ్యంతోనే వారందరిని అక్కడే ఉండేలా చూస్తారు. వారందరూ మొబైల్ ఫోన్స్ ఉపయోగించడానికి కూడా అనుమతి ఉండదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి.
The final stage of the Budget preparation process for Union Budget 2024-25 commenced with the customary Halwa ceremony in the presence of Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman, in New Delhi, today. (1/4) pic.twitter.com/X1ywbQx70A
— Ministry of Finance (@FinMinIndia) July 16, 2024
Comments
Please login to add a commentAdd a comment