Halwa Ceremony
-
హల్వా రుచులతో బడ్జెట్ సందడి షురూ..
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘సాంప్రదాయక హల్వా రుచుల’ వడ్డింపుతో 2024–25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరింది. లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. నార్త్‌బ్లాక్ బేస్మెంట్లో బడ్జెట్ పత్రాల రహస్య ముద్రణ ప్రారంభాన్ని పురష్కరించుకుని సాంప్రదాయంగా వస్తు న్న హల్యా రుచుల ఆరగింపు కార్యక్రమంలో ఆర్థికమంత్రి పాల్గొని సీనియర్ అధికారులకు స్వీట్స్‌ను అందజేస్తూ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.బడ్జెట్ ముద్రణా ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ఈ హల్వా రుచుల కార్యక్రమం అనంతరం జూలై 23వ తేదీ పార్లమెంట్లో ఆర్థికమంత్రి ప్రసంగం పూర్తయ్యే వరకూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ సహా ఇతర సీనియర్ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
Union Budget 2024: హల్వా వేడుకలో నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ 2024-25 తయారీ ప్రక్రియ చివరి దశకు గుర్తుగా 'హల్వా' వేడుక సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.హాల్వా వేడుక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాత్రమే కాకుండా.. ఎంఓఎస్ పంకజ్ చౌదరి, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, సీఈఏ వి అనంత నాగేశ్వరన్, డీఈఏ కార్యదర్శి అజయ్ సేథ్ తదితరులు పాల్గొన్నారు. హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ వంటగదిలో తయారు చేశారు.ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హాల్వా వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆర్థిక మంత్రి చివరకు బడ్జెట్ సమర్పించే వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే ఉండాల్సి ఉంటుంది. బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదన్న ఉద్దేశ్యంతోనే వారందరిని అక్కడే ఉండేలా చూస్తారు. వారందరూ మొబైల్ ఫోన్స్ ఉపయోగించడానికి కూడా అనుమతి ఉండదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తాయి. The final stage of the Budget preparation process for Union Budget 2024-25 commenced with the customary Halwa ceremony in the presence of Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman, in New Delhi, today. (1/4) pic.twitter.com/X1ywbQx70A— Ministry of Finance (@FinMinIndia) July 16, 2024 -
ఈసారి బడ్జెట్లో హల్వా మిస్ ? అజ్ఞాతంలోకి ‘బడ్జెట్’ ఉద్యోగులు !
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. బడ్జెట్ తయారీ సందర్భంగా అనాదిగా పాటిస్తున్న కల్చర్‌కి పులిస్టాప్ పెట్టారు. ఎప్పుడూ నిర్వహించే హల్వా సెరిమొని పక్కన పెట్టి రెగ్యులర్ స్వీట్లను పంచడంతో బడ్జెట్ పనులు మొదలు పెట్టారు. 70 ఏళ్లకు పైగా కొనసాగిస్తూ వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి. తీపి తిన్నాకే ఆర్థిక శాఖలో బడ్జెట్ ముద్రణలో పాల్గొనే అధికారులు హల్వా కార్యాక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక శాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో ఓ పెద్ద కడాయిలో హల్వాను తయారు చేస్తారు. బడ్జెట్ తయారీ, ముద్రణ పనుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి కడాయిలోని హల్వాను ఆర్థిక మంత్రి స్వయంగా పంచిపెడతారు. హల్వా రుచుల ఆరగించిన తర్వాత బడ్జెట్ ఉద్యోగులను అజ్ఞాతంలోకి పంపిస్తారు. కరోనా ఉన్నా.. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత జనం గుమిగూడే కార్యక్రమాలు చాలా ఆగిపోయాయి. ఐనప్పటికీ 2021-22 బడ్జెట్ సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్. ఫైనాన్స్ అధికారులు, ఉద్యోగులు ఇతర సిబ్బంది ఈ హల్వా కార్యక్రమంలో హుషారు పాల్గొన్నారు. డెబ్బై ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న అలవాటుకు తాజాగా ఒమిక్రాన్ బ్రేక్ వేసిందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. జస్ట్ ఫర్ చేంజ్ హల్వాయి ప్రోగ్రామ్ ఈసారి లేకపోవడానికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ఒక కారణమైతే బడ్జెట్ తయారీ ఇప్పుడు పేపర్ లెస్‌గా మారడం మరో కారణం. అయితే గతేడాది నుంచి బడ్జెట్ ప్రతుల ముద్రణకి పులిస్టాప్ పెట్టారు. డిజిటల్‌కి షిఫ్ట్ అయ్యారు. ట్యాబ్‌లో చూసి చదువుతూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో అనాదిగా వస్తున్న హల్వా తయారీ సంప్రదాయాన్ని ఈసారి పక్కన పెట్టారు. 2022 జనవరి 27 గురువారం బడ్జెట్ తయారీ పనులు లాంఛనంగా మొదలయ్యాయి. బడ్జెట్ తయారీలో పాల్గోనే అధికారులు సిబ్బందికి హల్వా తినిపించేందుకు ఈసారి ఆర్థిక మంత్రి రాలేదు. బడ్జెట్ సిబ్బందికి కేవలం స్వీట్స్ పంచడంతో సరిపెట్టారు. అజ్ఞాత వాసం బడ్జెట్ తయారీ, ముద్రణ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఒక్క సారి హల్వా/స్వీట్ తిన్నారంటే పది రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. బడ్జెట్ తయారీ విధుల్లో పాల్గోనే వారు హల్వా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్తారు. తిరిగి ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన తర్వాతే బయటకు అనుమతిస్తారు. అప్పటి వరకు కుటుంబాలకు, ఆఫీసులకు దూరంగా ఉంటారు. ఆఖరికి మొబైల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వరు. Watch: 'Halwa Ceremony' at Finance Ministry ahead of Budget https://t.co/4ECocYyHMy #Halwa #Budget2021 #UnionBudget2021 #NirmalaSitharaman — ANI Multimedia (@ANI_multimedia) January 23, 2021 నార్త్‌బ్లాక్‌లోనే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ తయారీ ప్రతుల ముద్రణ రాష్ట్రపతి భవన్లో జరిగేది. అయితే 1950లో పార్లమెంటులో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అందులో కీలక అంశాలు లీక్ అయ్యాయి. దీంతో బడ్జెట్ తయారీ, ముద్రణా వ్యవహారాలను ఆర్థిక శాఖ ఉన్న నార్త్బ్లాక్కి మార్చేశారు. 1950 నుంచి 2022 వరకు ప్రతీ బడ్జెట్ తయారీ పనులు నార్త్‌బ్లాక్‌లోనే జరుగుతున్నాయి. నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ తయారయ్యే విభాగం నుంచి పూచికపుల్లను కూడా బయటకు రానీవ్వరు. చదవండి: బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల -
బడ్జెట్ హల్వా బడ్జెట్ కూర్పు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ కూర్పు కార్యక్రమం సంప్రదాయ హల్వా వేడుకతో శనివారం ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. హల్వా వేడుకలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది బడ్జెట్ పత్రాల కూర్పులో పాల్గొంటారు. గతంలో ఈ వేడుకలో పాల్గొన్న వారంతా ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లోకి వెళ్లి, బడ్జెట్ముద్రణలో పాలుపంచుకునేవారు. ఈసారి కోవిడ్ దృష్ట్యా బడ్జెట్ ప్రతుల ముద్రణను రద్దు చేశారు. పార్లమెంట్ సభ్యులకు ఈ దఫా డిజిటల్ రూపంలో బడ్జెట్ వివరాలను అందజేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక ఇలా చేయడం ఇదే మొదటిసారి. ‘కేంద్ర బడ్జెట్‌ను మొట్టమొదటిసారిగా పేపర్‌లెస్ రూపంలో ఇస్తున్నాం. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెడతాం’అని ఆర్థిక శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారీ కఢాయిలో తయారు చేసిన హల్వాను బడ్జెట్ తయారీలో పాల్గొనే సిబ్బందికి పంచారు. నిర్మల బడ్జెట్ పత్రాలను చూసేందుకు రూపొందించిన మోబైల్ యాప్‌ను ప్రారంభించారు. బడ్జెట్æ పోర్టల్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి వివరాలను చూడవచ్చు. -
కేంద్ర బడ్జెట్ : కీలక ఘట్టం ఆవిష్కృతం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రక్రియకు కీలకమైన హల్వా వేడుకతో ఆర్థికమంత్రిత్వ శాఖ శ్రీకారం చుట్టింది. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నార్త్ బ్లాక్‌లో నిర్వహించిన హల్వా వేడుకకు నిర్మలా సీతారామన్‌తోపాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శులు, ఇతర అధికారులు హాజరైనారు. (బడ్జెట్ 2021 : ఇండియా రేటింగ్స్ , డెలాయిట్ సర్వే) యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రతులను పేపర్‌లెస్‌గా అందిస్తున్న క్రమంలో యూనియన్ బడ్జెట్ సమాచారాన్ని సులభంగా శీఘ్రంగా అందించేందుకు వీలుగా “యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్” ను ఆర్థికమంత్రి లాంచ్ చేశారు. డౌన్లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ అవుట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయాల పట్టిక, ఇతర లింక్స్ యాక్సెస్ మొదలైన వాటితో కూడిన యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో దీన్ని రూపొందించారు. ఇది ఇంగ్లీష్ , హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖలో 'హల్వా వేడుక' నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. హల్వా వేడుక తరువాత, బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగమైన ఉద్యోగులను నార్త్ బ్లాక్ నేలమాళిగలో సుమారు 10 రోజులు లాక్ చేస్తారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో 2021-22 యూనియన్ బడ్జెట్ ప్రతులను ఈ సారి ముద్రించడం లేదు. ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ప్రతులను డిజిటల్ ఫార్మాట్లోనే సభ్యులకు అందించనున్నారు. అలాగే జనవరి 29న పార్లమెంట్‌కు సమర్పించే ఆర్థిక సర్వే ప్రతులను కూడా ప్రింట్ చేయడం లేదు. కాగా ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సమాచారం ప్రకారనం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. జనవరి 29 నుంచి ఫ్రిబవరి 15 వరకు తొలి దశ, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలుంటాయి..పార్లమెంట్ సమావేశాలకు ముందుగా సభ్యులంతా ఆర్టీ-పీసీఆర్ కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బడ్జెట్ సమావేశాలు: 74 ఏళ్లలో ఇదే ప్రథమం..
న్యూఢిల్లీ: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్‌గా ఉండనుండటం మాత్రం ఖాయం. అవును మరి కోవిడ్ దేశ ఆర్థిక వ్యవస్థని దారుణంగా దెబ్బ తీసింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకి బడ్జెట్ కేటాయింపులతో బూస్ట్ ఇస్తారా.. లేక మరింత డీలా పడేలా చేస్తారానే విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఈ ఏడాది బడ్జెట్ రూపం, కేటాయింపులు సరికొత్తగా ఉండనుండటం మాత్రం వాస్తవం. ఈ సారి ప్రారంభం కానున్న బడ్జెట్ ప్రక్రియ దాదాపు 70 ఏళ్ల సంప్రదాయనికి ముగింపు పలకనుంది. అవును బడ్జెట్ సమావేశాలు ప్రారంభైన 74 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదు. నవంబర్ 26, 1947 తరువాత మొదటిసారి ఈ ఏడాది బడ్జెట్ కాపీల ప్రింటింగ్‌ని నిలిపివేయనున్నారు. నార్త్ బ్లాక్‌లోని ఇళ్లని బడ్జెట్ ప్రింటింగ్ కోసం వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. ఇక డాక్యుమెంట్లు ముద్రించి, సీల్ చేసి.. బయటకు పంపే వరకు అధికారులంతా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఇక్కడే ఉంటారు. (చదవండి: ఈ దఫా ‘నెవ్వర్ బిఫోర్’ బడ్జెట్) అయితే ప్రస్తుతం కోవిడ్-19 భయాలు.. కొత్త స్ట్రెయిన్ కలకలంతో బడ్జెట్ కాపీలను ప్రింట్ చేయడం లేదని అధికారులు తెలిపారు. అంతేకాక ప్రతి ఏటా బడ్జెట్ కాపీ ప్రింటింగ్ సమయంలో నిర్వహించే హల్వా వేడుకకు కూడా ఈ ఏడాది బ్రేక్ ఇవ్వనున్నారని తెలిసింది. ఇక ఈ ఏడాది బడ్జెట్ కాపీలను డిజిటల్ రూపంలో అందిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి పార్లమెంట్‌లోని 750 మంది సభ్యులకు బడ్జెట్, ఎకానమిక్ సర్వే డిజిటల్ కాపీలను అందించనున్నారు. కరోనా మూలంగా 2020-2021 ఏడాదిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో పేపర్‌లెస్ బడ్జెట్ సమావేశాలు ఒకటి. రికార్డులను డిజిటలైజ్ చేయాలని పార్లమెంట్ ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇక కరోనా మూలంగా అది ఆచరణ సాధ్యం అయ్యింది. బడ్జెట్‌తో పాటు మిగతా ప్రతులను కూడా డిజిటలైజ్ చేస్తే బాగుంటుందని అధికారలు భావిస్తున్నారు. -
‘బడ్జెట్ హల్వా’ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ప్రక్రియ వేగవంతమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభమైంది. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి సంకేతంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో హల్వా వేడుకలో పాల్గొన్నారు. హల్వా తయారీలో పాలుపంచుకుని బడ్జెట్ కసరత్తులో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి హల్వాను అందించారు. హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. చదవండి : ఆ 63 మంది సంపద మన బడ్జెట్ కంటే అధికం -
హల్వా తయారీతో బడ్జెట్ ముద్రణకు శ్రీకారం
-
‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్!
న్యూఢిల్లీ : సంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తయారీతో 2019 -20 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరంతా ‘బడ్జెట్ హల్వా’ రుచి చూసి బడ్జెట్ పత్రాల ముద్రణ కార్యక్రమాన్ని ఆరంభించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2.0 క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారిగా ఆమె జూలై 5న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ హల్వా తయారీతో ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు. కాగా హల్వా కార్యక్రమం అనంతరం ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ.. బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ-మెయిల్‌తోగానీ మరే ఇతర మాధ్యమాల ద్వారా మాట్లాడే వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అత్యంత గోప్యంగా ముద్రణ ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్ఛ్సేంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
ఆర్ధికశాఖ కార్యలయంలో హల్వ వేడుక
-
'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా...
న్యూఢిల్లీ : కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న 2017-18 ఆర్థికసంవత్సర బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ''హల్వా వేడుక''తో ఈ శుభకార్యానికి అంకురార్పణ చేస్తున్నారు. ఈ హల్వా వేడుకానంతరం అధికారులంతా బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ లో బిజీబిజీగా మారబోతున్నారు. ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టేంతవరకు కనీసం వీరు వారి కుటుంబసభ్యులతో కూడా టచ్‌లో ఉండరు. ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలన్నీ వీరికి కట్ అవుతాయి. అంత పకడ్భందీగా ఈ పత్రాల ప్రింటింగ్ జరుగుతోంది. కేవలం అత్యంత సీనియర్ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థికమంత్రిత్వ శాఖలోని మొత్తం 100 మందికి పైగా అధికారులు ఈ బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పాల్గొననున్నారని ఆ శాఖ తెలిపింది. ఎన్డీయే నేతృత్వంలో మూడో ఫుల్ బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ హల్వా వేడుకలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాలుపంచుకోనున్నారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ హల్వా సెర్మనీకి ఏర్పాట్లు చేశారు. అనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పెద్ద కడాయిలో దీన్ని తయారుచేసి ఆర్థికమంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులందరకూ ఈ హల్వాను పంచిపెడతారు. ఈ హల్వా సెర్మనీ తర్వాత చాలామంది అధికారులు, సంబంధిత స్టాఫ్ బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌లో నిమగ్నమై పోతారని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. After Halwa Ceremony,more than 100 officials of Fin Ministry will stay in Budget Printing Press till FM @arunjaitley Budget Speech is over. — Ministry of Finance (@FinMinIndia) January 19, 2017 FM @arunjaitley to participate in Halwa Ceremony today marking the beginning of printing of documents which are part of Union Budget 2017-18 — Ministry of Finance (@FinMinIndia) January 19, 2017