ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘సాంప్రదాయక హల్వా రుచుల’ వడ్డింపుతో 2024–25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరింది. లోక్‌సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. నార్త్‌బ్లాక్ బేస్‌మెంట్‌లో బడ్జెట్ పత్రాల రహస్య ముద్రణ ప్రారంభాన్ని పురష్కరించుకుని సాంప్రదాయంగా వస్తు న్న హల్యా రుచుల ఆరగింపు కార్యక్రమంలో ఆర్థికమంత్రి పాల్గొని సీనియర్ అధికారులకు స్వీట్స్‌ను అందజేస్తూ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
బడ్జెట్ ముద్రణా ప్రక్రియలో పాల్గొనే అధికారులు అందరూ ఈ హల్వా రుచుల కార్యక్రమం అనంతరం జూలై 23వ తేదీ పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి ప్రసంగం పూర్తయ్యే వరకూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ సహా ఇతర సీనియర్ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment