'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా... | Printing Of Budget 2017 Documents To Start Today With 'Halwa' Ceremony | Sakshi
Sakshi News home page

'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా...

Published Thu, Jan 19 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా...

'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా...

న్యూఢిల్లీ : కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న 2017-18 ఆర్థికసంవత్సర బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ''హల్వా వేడుక''తో ఈ శుభకార్యానికి అంకురార్పణ చేస్తున్నారు. ఈ హల్వా వేడుకానంతరం అధికారులంతా బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ లో బిజీబిజీగా మారబోతున్నారు. ఆర్థికమంత్రి ఈ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టేంతవరకు కనీసం వీరు వారి కుటుంబసభ్యులతో కూడా టచ్లో ఉండరు. ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలన్నీ వీరికి కట్ అవుతాయి.
 
అంత పకడ్భందీగా ఈ పత్రాల ప్రింటింగ్ జరుగుతోంది. కేవలం అత్యంత సీనియర్ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థికమంత్రిత్వ శాఖలోని మొత్తం 100 మందికి పైగా అధికారులు ఈ బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్లో పాల్గొననున్నారని ఆ శాఖ తెలిపింది. ఎన్డీయే నేతృత్వంలో మూడో ఫుల్ బడ్జెట్   ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు రానుంది.
 
ఈ హల్వా వేడుకలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాలుపంచుకోనున్నారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ‌శాఖ కార్యాలయంలో ఈ హ‌ల్వా సెర్మ‌నీకి ఏర్పాట్లు చేశారు. అనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పెద్ద కడాయిలో దీన్ని తయారుచేసి ఆర్థికమంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులందరకూ ఈ హల్వాను పంచిపెడతారు. ఈ హల్వా సెర్మ‌నీ తర్వాత చాలామంది అధికారులు, సంబంధిత స్టాఫ్ బడ్జెట్ పత్రాల ప్రింటింగ్లో నిమగ్నమై పోతారని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement