'హల్వా వేడుక' అనంతరం అధికారులంతా...
న్యూఢిల్లీ : కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న 2017-18 ఆర్థికసంవత్సర బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ''హల్వా వేడుక''తో ఈ శుభకార్యానికి అంకురార్పణ చేస్తున్నారు. ఈ హల్వా వేడుకానంతరం అధికారులంతా బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ లో బిజీబిజీగా మారబోతున్నారు. ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టేంతవరకు కనీసం వీరు వారి కుటుంబసభ్యులతో కూడా టచ్‌లో ఉండరు. ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలన్నీ వీరికి కట్ అవుతాయి.
అంత పకడ్భందీగా ఈ పత్రాల ప్రింటింగ్ జరుగుతోంది. కేవలం అత్యంత సీనియర్ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఆర్థికమంత్రిత్వ శాఖలోని మొత్తం 100 మందికి పైగా అధికారులు ఈ బడ్జెట్ ప్రింటింగ్ ప్రెస్‌లో పాల్గొననున్నారని ఆ శాఖ తెలిపింది. ఎన్డీయే నేతృత్వంలో మూడో ఫుల్ బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ ముందుకు రానుంది.
ఈ హల్వా వేడుకలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాలుపంచుకోనున్నారు. నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఈ హల్వా సెర్మనీకి ఏర్పాట్లు చేశారు. అనవాయితీగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పెద్ద కడాయిలో దీన్ని తయారుచేసి ఆర్థికమంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులందరకూ ఈ హల్వాను పంచిపెడతారు. ఈ హల్వా సెర్మనీ తర్వాత చాలామంది అధికారులు, సంబంధిత స్టాఫ్ బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌లో నిమగ్నమై పోతారని ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.
After Halwa Ceremony,more than 100 officials of Fin Ministry will stay in Budget Printing Press till FM @arunjaitley Budget Speech is over.
— Ministry of Finance (@FinMinIndia) January 19, 2017
FM @arunjaitley to participate in Halwa Ceremony today marking the beginning of printing of documents which are part of Union Budget 2017-18
— Ministry of Finance (@FinMinIndia) January 19, 2017