
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ప్రక్రియ వేగవంతమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాల ముద్రణ ప్రారంభమైంది. బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభానికి సంకేతంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో హల్వా వేడుకలో పాల్గొన్నారు. హల్వా తయారీలో పాలుపంచుకుని బడ్జెట్ కసరత్తులో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి హల్వాను అందించారు. హల్వా సంరంభంలో భాగంగా పెద్ద కడాయిలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు, బడ్జెట్ తయారీకి సంబంధించిన సిబ్బందికి వడ్డించారు. ఈ సిబ్బంది... బడ్జెట్ తయారీ నుంచి లోక్‌సభలో ప్రవేశపెట్టేవరకూ ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బయటి ప్రపంచంతో వారికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఉన్నతాధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment