ఇటీవల కేంద్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వం 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పుడు ప్రజలందరి ద్రుష్టి త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీదనే ఉన్నాయి. గతంలో ఎన్నికల దగ్గరపడుతున్న వేళ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి త్వరలో నిర్మల సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
2024-25 బడ్జెట్ పేద ప్రజలకు, వేతన జీవులకు ఊరట కల్పించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. సంవత్సరానికి రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షల మధ్య సంపాదించే వ్యక్తులకు ఆదాయ పన్ను రేట్లను తగ్గించనున్నట్లు సమాచారం. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కొత్త పన్ను విధానంలో.. రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుందని సమాచారం. అయితే ఈ పన్ను మినహాయింపు రూ. 5 లక్షల వరకు ఉంటే బాగుంటుందని. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చే నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
రాబోయే బడ్జెట్ మోదీ 3.0 ప్రభుత్వ ఆర్థిక ఎజెండాను వివరిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వ కట్టుబాట్లకు తగిన విధంగా వనరులను పొందుతూనే సీతారామన్ ద్రవ్యోల్బణం పెరగకుండా వృద్ధిని ప్రేరేపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎజెండా భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, 2047 నాటికి దేశాన్ని 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యవసాయ సవాళ్లను పరిష్కరించడం, ఉద్యోగాల కల్పన, మూలధన వ్యయాలను నిలబెట్టుకోవడం, ఆర్థిక ఏకీకరణను కొనసాగించడానికి ఆదాయ వృద్ధిని పెంచడం రాబోయే బడ్జెట్‌లో కీలక అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద ఓ వైపు ప్రజలకు అనుకూలమైన విధి విధానాలను రూపొందించడమే కాకుండా.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు వేయనున్నారు.
నిర్మల సీతారామన్ రికార్డ్
జూన్ 20న ఆర్థిక మంత్రి పరిశ్రమ వాటాదారులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు జరుపుతారు. ఇది మోదీ 3.0 కింద మొదటి కేంద్ర బడ్జెట్ అవుతుంది. అయితే నిర్మలా సీతారామన్ ఇందులో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించి ఆరు పూర్తి బడ్జెట్‌లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌తో కూడిన ఏడు.. వరుస బడ్జెట్ ప్రజెంటేషన్లను సీతారామన్ ప్రవేశపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment