పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం
పొదుపు మహిళల పోస్టు కార్డు ఉద్యమం
Published Fri, Nov 25 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు గ్రూపుల ఖాతాల్లో వెంటనే రూ. 7 వేలు వేయాలని నగరంలోని 47వ వార్డు మహిళలు డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక హెడ్ పోస్టాఫీసు ఆవరణలో వారు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మహిళలు సుమలత, జరీనాబీ మాట్లాడుతూ పొదుపు మహిళల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేస్తానని చెప్పి రూ. 3 వేలతోనే సరిపెట్టుకోవడం విచారకరమన్నారు. అలాగే ప్రధాని జన్‌ధన్ ఖాతాల్లో రూ. పది వేలు జమ చేయాలని కోరారు. సీఎం పొదుపు మహిళలకు తక్షణమే రూ. 7 వేలు వేయకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఆందోళనలో ఫరీదా, జంబావతి, ఈశ్వరమ్మ, సుమతి, శేషమ్మ, లలితమ్మ, రామలక్ష్మి, చిట్టెమ్మ, సుబ్బలక్షమమ్మ, 47వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement