న్యూఢిల్లీ: జన్ధన్-ఆధార్- మొబైల్తో అవినీతి రహిత పాలన అందించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఢిల్లీలో నేషనల్ ఎకనమిక్ ఎన్ క్లేవ్లో పాల్గొన్న ఆయన జన్ ధన్-ఆధార్-మొబైల్ అంశంపై కొద్ది సేపు ప్రసంగించారు.
ఈ సందర్భంగా సబ్సిడీలు, సంక్షేమరంగంలో అనూహ్య మార్పులు రాబోతున్నాయని చెప్పారు. జన్ ధన్-ఆధార్- మొబైల్ ద్వారా పారదర్శకతతో కూడిన పాలన సాధ్యమవుతుందని చెప్పారు.