తాడికొండ: దళితులంటే చిన్నచూపుతో మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేశ్‌ను రాష్టం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం 931వ రోజుకు చేరాయి.
పలువురు నాయకులు మాట్లాడుతూ.. పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా దళితులను కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని, దళిత బహుజనులు తమకు ఓట్లేయడం లేదనే అక్కసుతో చంద్రబాబు, లోకేశ్ అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో చంద్రబాబు దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా... అంటే, ఇప్పుడు లోకేశ్ దళితుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పాదయాత్రలో లోకేశ్‌కు ప్రతి గ్రామంలో ముందు ఎదురయ్యేది జగనన్న కాలనీలేనని, వాటిని చూసిన ప్రతిసారి వెన్నులో వణుకు మొదలై దళితులు, బహుజనులు తమను ఎక్కడ విస్మరిస్తారో అనే భయం పట్టుకుని అసహనంతో మాట్లాడుతున్నాడన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, పులి దాసు, న్యాయవాది పెరికే వరప్రసాద్, ఈపూరి ఆదాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment