రూ.1000 నోటు ఇక డిపాజిట్‌కే పరిమితం
రూ.1000 నోటు ఇక డిపాజిట్‌కే పరిమితం అదికూడా కొన్నాళ్లపాటే
బ్యాంకుల్లో నగదు మార్పిడికి నేటి నుంచి మంగళం
జిల్లా ప్రజలకు మరిన్ని కష్టాలు
తిరుపతి (అలిపిరి): వెయ్యి నోటు చెల్లుబాటు కాదంటూ కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజలపై పిడుగుపాటరుుంది. డిసెంబర్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పుకొచ్చిన కేంద్రం ఒక్కసారిగా మాట మార్చింది. ఈ నోటు డిపాజిట్‌కు తప్ప మరేదానికీ ఉపయోగపడదని తేల్చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి వరకూ ఆదుకున్న నగదు మార్పిడిని కూడా కేంద్రం రద్దు చేసింది. జిల్లాలో 40 జాతీయ బ్యాంకులకు చెందిన 593 శాఖల్లో గత 15 రోజుల్లో రూ.1500 కోట్ల మేర నగదు మార్పిడి జరిగింది. తాజాగా నగదు మార్పిడిని రద్దు చేయడంతో కొన్ని వర్గాలకు ఇబ్బంది తప్పదు. రూ.500 నోటు కూడా డిసెంబర్ 15 తరువాత చెల్లుబాటు కాదని కేంద్రం ప్రకటించింది. బ్యాంకులు నగదు కొరతతో ప్రజలకు పూర్తి స్థారుులో సేవలు అందించలేకపోతున్నారుు. కేం ద్రం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయకుం డా రూ.500 నోటును కూడా చెల్లుబాటు కాని జాబితాలో చేర్చితే సామాన్య ప్రజల కు మరిన్ని కష్టాలు తప్పవు. రూ.500 నోట్లను ప్రభుత్వ బకారుుల చెల్లింపులు, స్కూళ్ల ఫీజులు తదితర స్థానిక సంస్థల చెల్లింపులకు వెసులుబాటు కల్పించింది. ఈ ఒక్క నిర్ణయం మాత్రమే జిల్లా ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. డిసెంబరు నెలాఖరు వరకూ కేంద్రం గడువిచ్చిందనే ధీమాతో జిల్లాలో కొందరు వెరుు్యనోట్లను ఇంకా బ్యాంకులకు తీసుకెళ్లలేదు. అంతేకాదు గుడ్డిలోమెల్లలా ఇప్పటివకరూ నగదు లావాదేవీల్లో ఈ నోటు కీలక భూమిక పోషించింది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన సందర్భాల్లో కొందరు వర్తకులు ఈ నోట్లను అనుమతించారు. సమయముంది కదా ఏదోలా డిపాజిట్ చేసుకుందాంలే అని వ్యాపారులు భావించారు. వీరందరికీ తాజా నిర్ణయం నివ్వెరపోయేలా చేసింది. 2000 నోటు తర్వాత వాడకంలో వంద మాత్రమే ఉండటం తలనొప్పిగా తయారైంది. నోట్ల మార్పిడికి గడువిచ్చి ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడం అప్రజాస్వామికమని కొందరు వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటన వచ్చాక ఇలా మాట తప్పడం ఎక్కడా చూడలేదంటున్నారు.
2వ తేదీ వరకు టోల్‌ఫీ రద్దు
జాతీయ రహదారులకు సంబంధించి టోల్‌ఫీని డిసెంబర్ 2వ తేది అర్థరాత్రి వరకు కేంద్రం రద్దు చేసింది. అటు తరువాత రూ.500 నోట్లతో టోల్‌ఫీని డిసెంబర్ 15 వరకు చెల్లుబాటు అవుతుంది. తరువాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడుతాయో అంటూ వాహనదారులు అయోమయంలో పడ్డారు.