వాషింగ్టన్: 105 ఏళ్లు... జీవితమే ఊహకందదు. కానీ ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించింది లూసియానాకు జూలియా హరికేన్స్ హాకిన్స్. 102 సెకన్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తింది. ఆమె పేరులోకి ‘హరికేన్’అట్లా రికార్డుతో వచ్చిందే. మీ వయసుకంటే తక్కువ సెకన్లలోపే పూర్తిచేశారు కదా ... ‘‘నో’నిమిషంలో పూర్తి చేయాలనుకున్నా. కుదరలేదు. ఇంకా ఎక్కువ పరుగెత్తాలి’ అని చెబుతోంది.
రన్నింగ్‌ను 101వ ఏట మొదలుపెట్టిన హాకిన్స్‌కు అథ్లెటిక్స్ కొత్తేం కాదు. 80 ఏళ్ల వయసులో ‘నేషనల్ సీనియర్ గేమ్స్’సైక్లింగ్‌లో పోటీ పడింది. 2017లో సైక్లింగ్ వదిలేశాక... రన్నింగ్ ట్రాక్‌ను ఎంచుకుంది. సో... సంకల్పం ఉండాలేగానీ.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్!
Comments
Please login to add a commentAdd a comment