మన కళ్లముందే రోడ్డుపై ఎన్నో మూగజీవాలు రోడ్డు ప్రమాదాలకు గురవడం చూసి ఉంటాం. ఎవరో కొంతమంది సహృదయులు వాటిని చేరదీసి పశువైద్యశాలకు తరలించడం వంటివి చేస్తారు. లేదంటే అవి అలా గాయాలతోనే బాధపడుతూ ఉండిపోతాయి. కానీ ఇక్కడొక జింక మనిషిమాదిరి ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకుంది.
(చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?)
అసలు విషయంలోకెళ్లితే... అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టడంతో దానికి గాయాలవుతాయి. అయితే ఆ జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్‌లోకి ప్రవేశిస్తుంది. పైగా చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్‌లో అటూ ఇటు పరిగెడతూ చాలా కష్టపడుతుంది. అంతేకాదు ఆవరణలో పడుతూ లేస్తూ ఆయాస పడుతుంది. అక్కడ ఉన్న ఎస్కలేటర్‌ను సైతం ఏదోరకంగా ఎక్కి రెండో అంతస్తుకి చేరుకుంటుంది.
దీంతో అక్కడ ఉన్న వైద్యులు, సందర్శకులు ఆశ్చర్యపోతారు. అయితే అక్కడ ఉన్న పశువైద్యుడు జింకను పరిశీలించి వైద్యం చేస్తాడు. మా వైద్యులు ఎప్పడూ సదా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు కూడా ఓసారి వీక్షించండి.
(చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ)
Comments
Please login to add a commentAdd a comment