veterinarian
-
థాయిలాండ్‌లో అద్భుతం
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్‌వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది. ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్థోంగ్టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
ఆ పోస్టుల భర్తీ కనిపించలేదా రామోజీ?
‘దున్నపోతు ఈనిందంటే దూడని గాటికి కట్టేయమన్నాడట’ వెనుకటికి ఒక ప్రబుద్ధుడు. ఈనాడు రామోజీరావు తీరు అచ్చం అలానే ఉంది. గత ప్రభుత్వ పాలనలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నా... పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది కరువైనా... అవసరమైన మందులు అందించకపోయినా... సరైన వైద్యం అందకపోయినా రామోజీ కళ్లకు కనిపించలేదు. ఈనాడు కలాలకు పదును పెట్టలేదు. ఇప్పుడే ఆ శాఖపై అమాంతంగా అభిమానం పుట్టుకొచ్చేసింది. అవాస్తవాలతో జనాన్ని పక్కదారి పట్టించేందుకు కంకణం కట్టుకుంది. లెక్కకు మిక్కిలిగా పోస్టులు భర్తీ చేసి రైతు ముంగిటకే పశువైద్యం తీసుకెళ్తుంటే తట్టుకోలేకపోతోంది. ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే కుళ్లుకుంటోంది. ఎక్కడ ప్రజల్లో మంచి పేరొస్తుందేమోనని భయపడిపోతోంది. అదే పనిగా విమర్శిస్తూ... అడ్డగోలు రాతలతో అభాసుపాలు చేయాలని చూస్తోంది. వాస్తవాలకు పాతర వేస్తోంది. రోజుకో అంశంతో అబద్ధపు వార్తలు వండి వారుస్తోంది. పశువైద్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కనిపించాలంటే రామోజీ కళ్లద్దాలు మార్పించుకుని చూడాలి. సాక్షి, అమరావతి: గ్రామానికో పశుసంవర్థక సహాయకుడు... రెండు మండలాలకో వెటర్నరీ అంబులెన్స్... గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం, సర్టిఫై చేసిన నాణ్యమైన సంపూర్ణ మిశ్రమ దాణా పంపిణీ... పాడి రైతు ముంగిటకే నాణ్యమైన పశువైద్య సేవలు... నియోజకవర్గ స్థాయిలో పశువ్యాధి నిర్థారణ ప్రయోగశాలలు... నాణ్యమైన పాల ఉత్పత్తి లక్ష్యంగా ఆర్బీకేల ద్వారా పశువిజ్ఞాన బడులు... మూగజీవాలకు బీమా రక్షణ... జనరిక్ పశుఔషధ కేంద్రాల ఏర్పాటు... జగనన్న పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పన.. ఇలా గడచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో వచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తద్వారా కేంద్రంతో సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు.. అవార్డులు.. రివార్డులు అందుకుంది. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి పలు రాష్ట్రాలు ఇక్కడి విధానాలను స్ఫూర్తిగా తీసుకున్నాయి. ఇప్పుడు వాటినే ఆచరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా... దేశంలో పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా మూగజీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గతంలో సకాలంలో నాణ్యమైన, అత్యవసర వైద్య సేవలు అందక ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడేవి. రాష్ట్రంలో 1577 పశువైద్యశాలలు, 323 ప్రాంతీయ పశువైద్యశాలలు, 12 వెటర్నరీ పోలీ క్లీనిక్స్ ద్వారా పశు పోషకులకు చేరువలో అత్యాధునిక పశువైద్యం అందుతోంది. రాష్ట్ర స్థాయిలో 2 సూపర్ స్పెషాలిటీ పశువైద్యశాలల ద్వారా పశువులకూ 24 గంటలు పశువైద్యం అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా, 1527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వíßరి్తస్తున్నారు. ఖాళీగా ఉన్న 264 పశువైద్యుల పోస్టుల నియమకానికి చర్యలు చేపట్టారు. రైతు ముంగిటకే అత్యవసర వైద్యసేవలు ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున రూ.240.69 కోట్ల వ్యయంతో 340 సంచార పశువైద్య అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ అంబులెన్స్‌లో వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 295 స్పెషలిస్ట్ పశువైద్యులతో పాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్యపరికరాలు ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా చిన్నపాటి లేబొరేటరీని సమకూర్చారు. ప్రతీ అంబులెన్స్‌లో రూ.30వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. వీటి సేవల కోసం 1962తో టోల్ ఫ్రీ నెంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కచ్చితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజక వర్గస్థాయిలో రూ.24.14కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌్సను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ లేబొరేటరీలో ఒక టెక్నీషియన్, ఒక అటెండర్ని నియమించింది. వీటి ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీక్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామానికో గ్రాడ్యుయేట్ ఉద్యోగి రైతులకు గ్రామస్థాయిలో నాణ్యమైన సేవలందించే సంకల్పంతో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 1218 గ్రామీణ పశుగణ కేంద్రాలతో పాటు 7396 ఆర్బీకే క్లస్టర్స్ ద్వారా పశువైద్య సేవలందించేందుకు గ్రాడ్యుయేట్ చదివిన పశువైద్య నిపుణులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు విడతల్లో 4652 మంది గ్రాడ్యుయేట్స్‌ను నియమించగా మరో 1896 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్బీకేల్లో ట్రావిస్‌ను ఏర్పాటు చేసి, ప్రథమ చికిత్స అందజేస్తున్నారు. ఆర్బీకేలకు రూ.3వేల విలువైన మందులు, వైద్య పరికరాలు సమకూర్చారు. అత్యధికంగా పశువైద్యులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధికంగా పశువైద్యులు సేవలందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 51,772, గుజరాత్లో 36,540, బీహార్‌లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్‌లో 27,480, రాజస్థాన్‌లో 20,821 జీవాలకు ఒక గ్రాడ్యుయేట్ పశువైద్యుడు సేవలు అందిస్తుంటే, మన రాష్ట్రంలో ప్రతీ 17,808 జీవాలకు ఒక వైద్యుడు సేవలు అందిస్తున్నారు. అయినా ఇంకా ఏమీ చేయలేదన్నట్టు ఈనాడు అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పదిమందిలో ఆ పత్రికే చులకనవుతోంది. -
విశాఖ పశు వైద్యుడికి జాతీయ అవార్డు
ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ జిల్లా పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ప్రభుత్వ పథకాలు, పశు పోషణలో నూతన ఆవిష్కరణలపై ఆయన పాడి రైతులకు అవగాహన కల్పించడంలో చేసిన విశేష కృషికి గాను ‘ఉత్తమ విస్తరణ అధికారిగా’ జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ నెల 27న హైదరాబాద్‌లో భారత ప్రభుత్వ సంస్థ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ సదస్సులో ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం డాక్టర్ ప్రసాదరావు విశాఖ జిల్లా పశు సంవర్థకశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ శిక్షణ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యుడిగా ప్రభుత్వ పథకాలను రైతులు వినియోగించుకునేలా చేయడం, పాడి పశువులు, కోళ్ల పెంపకంపై శిక్షణ ఇవ్వడం, శాస్త్రీయ, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడంలో కృషి చేస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పథకాలపై ఆయన లఘు చిత్రాలు, స్వీయ రచనలు చేయడంతో పాటు వీడియోలు రూపొందించారు. వాటి ద్వారా పాడి రైతులకు సులువైన పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇంతవరకు ఆయన ఆరు పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు రాశారు. ప్రసాదరావు మాట్లాడుతూ యూ ట్యాబ్ చానల్ పెట్టి 140 వీడియోలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
పాపం డాక్టర్ బాబు.. ట్రీట్మెంట్ కోసం ఇంటికి పిలిచి..
అమ్మాయిలను ఎత్తుకెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఘటనలు గురించి వినే ఉంటారు. కానీ అబ్బాయిలను కిడ్నాన్ చేసి పెళ్లిచేకోవడం అరుదనే చెప్పాలి. ఇక్కడా ఓ బ్యాచిలర్‌కి అలాంటి ‘చేదు’ అనుభవమే ఎదురైంది. ట్రీట్మెంట్ పేరిట ఇంటికి పిల్చి మరీ.. ఓ వెటర్నరీ డాక్టర్‌కు బలవంతంగా పెళ్లి చేశారు. బిహార్ బెగుసురాయ్‌లో ఓ కుటుంబం.. పశువుకి వైద్యం చేసే నిమిత్తం ఇంటికి రావాలంటూ ఓ వైద్యుడికి బతిమాలింది. అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి వెళ్లాడు ఆ డాక్టర్. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి.. బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఈ విషయంలో ఆ డాక్టర్ ఇంట్లో తెలిసి.. షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ వెటర్నరీ డాక్టర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించారాయన. ఇదిలా ఉంటే.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని వ్యవహారమని చెప్పారాయన. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని వెల్లడించారు. అయితే ఇలాంటి ఘటనల్లో బాధితులు గనుక పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. (చదవండి: పాపం పెద్దాయన.. అది నేరమా? మండిపడుతున్న నెటిజన్లు) -
యాక్సిడెంట్ అయింది! వైద్యం చేయండి డాక్టర్: జింక
మన కళ్లముందే రోడ్డుపై ఎన్నో మూగజీవాలు రోడ్డు ప్రమాదాలకు గురవడం చూసి ఉంటాం. ఎవరో కొంతమంది సహృదయులు వాటిని చేరదీసి పశువైద్యశాలకు తరలించడం వంటివి చేస్తారు. లేదంటే అవి అలా గాయాలతోనే బాధపడుతూ ఉండిపోతాయి. కానీ ఇక్కడొక జింక మనిషిమాదిరి ఆసుపత్రికి వచ్చి మరీ చికిత్స చేయించుకుంది. (చదవండి: హమ్మయ్య దూకేశా!! ఏనుగునైతే మాత్రం దూకలేననుకున్నారా.. ఏం?) అసలు విషయంలోకెళ్లితే... అమెరికాలో ఒక జింకను కారు ఢీ కొట్టడంతో దానికి గాయాలవుతాయి. అయితే ఆ జింక వెంటనే సమీపంలోని లూసియానాలో ఉన్న బాటన్ రూజ్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది లేక్ రీజనల్ మెడికల్ సెంటర్లోకి ప్రవేశిస్తుంది. పైగా చికిత్స కోసం ఆ మెడికల్ సెంటర్లో అటూ ఇటు పరిగెడతూ చాలా కష్టపడుతుంది. అంతేకాదు ఆవరణలో పడుతూ లేస్తూ ఆయాస పడుతుంది. అక్కడ ఉన్న ఎస్కలేటర్‌ను సైతం ఏదోరకంగా ఎక్కి రెండో అంతస్తుకి చేరుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న వైద్యులు, సందర్శకులు ఆశ్చర్యపోతారు. అయితే అక్కడ ఉన్న పశువైద్యుడు జింకను పరిశీలించి వైద్యం చేస్తాడు. మా వైద్యులు ఎప్పడూ సదా వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంటారంటూ అవర్ లేడీ ఆఫ్ లేక్ రజినల్ మెడికల్ సెంటర్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు కూడా ఓసారి వీక్షించండి. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ) -
అక్రమాల్లో ఇంద్రుడు!
సాక్షి, కర్నూలు : విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎప్పుడూ డబ్బుపైనే ధ్యాస.. పథకాల పేరుతో అందినకాడికి రైతుల నుంచి వసూళ్లు.. ప్రభుత్వం కేటాయించిన దాణా, ఇతర ఇన్పుట్స్ లబ్ధిదారులకు అందజేయకుండా మెక్కేయడం.. ఇదీ ఆత్మకూరు మండలంలోని ఓ పశువైద్యాధికారి వ్యవహార శైలి. సంబంధిత ఏడీ, డీడీలు ఈయన పనితీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ 50 శాతం సబ్సిడీపై పాడిగేదెలు, దాణా, దాణామృతం, సైలేజ్ గడ్డి వంటి వాటిని పంపిణీ చేస్తోంది. ఈ పథకాల అమలులో ఆ వైద్యుడు పాల్పడిన అక్రమాలపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వీరపాండియన్ ఈనెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లారు. జిల్లాకు చెందిన వారితో పాటు ఆత్మకూరు మండల అధికారులందరూ కలెక్టర్ వెం ట ఉన్నా ఈ పశువైద్యాధికారి మాత్రం పత్తా లేరు. రైతులను హర్యానాలో వదిలి... 2018–19కి సంబంధించి పాడి గేదెలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. ఈయన తన పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది రైతుల నుంచి పాడిగేదెల యూనిట్ల పంపిణీకి ఒక్కొక్కరి నుంచి రూ.15వేలు నాన్స్ సబ్సిడీ మొత్తం రూ.3.60 లక్షలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని డీడీ తీసి పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో అప్పగించాలి. పాడి గేదెలను హర్యానా, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లోనే రైతుల సమక్షంలోనే కొనుగోలు చేయాలి. నాన్ సబ్సిడీ మొత్తానికి కార్యాలయంలో అప్పగించకుండా స్వాహా చేసి రైతులను హర్యానా రాష్ట్రానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత జేడీ కార్యాలయం అధికారులు విషయం తెలుసుకొని డీడీ లేకపోవడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. డీడీ బీరువాలో పెట్టి మరిచి వచ్చానని.. వచ్చిన వెంటనే అప్పగిస్తానని నమ్మించే ప్రయత్నం చేశారు. ముందు డీడీ అప్పగించే ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే పాడిగేదెలు బేరం చేయాలని ఆదేశించారు. దీంతో రైతులను హర్యానా రాష్ట్రంలో వదిలి చెప్పాపెట్టకుండా వచ్చేశారు. రైతులు తిప్పలు పడి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. రైతుల నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ మొత్తం ఇప్పటికీ చెల్లించలేదు. ఈ నెల చివరి వరకు ఓపీ రికార్డు పూర్తి... ఈ నెల 8న ఆత్మకూరు ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ వెంట పశుసంవర్ధక శాఖ జేడీ కూడా వెళ్లారు. డాక్టర్ లేకపోవడంతో పశువైద్యశాలకు వెళ్లి ఓపీ రికార్డు పరిశీలించారు. నెలకు సంబంధించిన చికిత్సల వివరాలతో ముందుగానే నింపేసి ఉండటాన్ని చూసి జేడీ అవాక్కయ్యారు. కోళ్ల దానాను వదల్లేదు వివిధ గ్రామాలకు చెందిన వారికి పశుసంవర్ధక శాఖ కోళ్లు పంపిణీ చేస్తుంది. కోళ్లకు దాణా, ఇతర ఇన్పుట్స్ ఇస్తారు. ఇందిరేశ్వరం తదితర గ్రామాల వారికి కోళ్లు పంపిణీ చేశారు తప్ప దాణా, ఇతర ఇన్పుట్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడంపై ఆరా తీస్తే అమ్మేసుకున్నట్లు తేలిందని రైతులు వాపోతున్నారు. -
పశువైద్యాధికారి బలవన్మరణం
అనంతపురం , గుంతకల్లు రూరల్ : మండలంలోని పాతకొత్తచెరువు పశువైద్యాధికారిగా పనిచేస్తున్న కీర్తికెనయన్ (33) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెటర్నరీ డాక్టర్ కీర్తికెనయన్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వైఎస్సార్ కడపలో స్థిరపడ్డారు. తిరుపతిలో యూజీకోర్సు చదువుతుండగా అక్కడే శ్రీకాకుళానికి చెందిన రాధాకుమారితో పరిచయం ఏర్పడి, అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వెటర్నరీ వైద్యులు కాబోయే తరుణంలో వివాహం చేసుకున్నారు. గుంతకల్లు మండలం వెటర్నరీ వైద్యురాలిగా రాధాకుమారి, వజ్రకరూరు వెటర్నరీవైద్యుడిగా కీర్తికెనయన్లు బాధ్యతలు స్వీకరించారు. ఏడాది తరువాత రాధాకుమారి గుంతకల్లు నుంచి వజ్రకరూరుకు బదిలీ కాగా, కీర్తికెనయన్ వజ్రకరూరు నుంచి గుంతకల్లు మండలానికి బదిలీ అయ్యారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. మహాశివరాత్రి సందర్భంగా సెలవు అయినా ఇంటినుంచి ఆస్పత్రికి వెళ్లిన కీర్తికెనయన్ సాయంత్రానికి గానీ ఇంటికి చేరుకోలేదు. ఫోన్లోకూడా అందుబాటులో లేడు. అనుమానం వచ్చిన అతనిభార్య రాధాకుమారి వెంటనే నాగసముద్రం వెటర్నరీ వైద్యుడు దీపక్‌కుమార్, విడపనకల్లు వెటర్నరీ వైద్యుడు నరేష్‌కు సమాచారం అందించారు. వెంటనే పాతకొత్తచెరువులోని ఆస్పత్రి వద్దకు చేరుకున్న డాక్టర్ నరేష్ ఆస్పత్రిలోకి వెళ్లి చూడగా అప్పటికే కీర్తికెనయన్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా వేలాడుతున్నాడు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రూరల్ సీఐ సాయిప్రసాద్‌ను మాట్లాడుతూ కీర్తి కెనయన్ ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా డిప్రెషన్‌కు లోనయ్యేవాడని, మూడేళ్లుగా చికిత్స పొందుతూ అందుకు మెడిసిన్ కూడా వాడుతున్నాడని అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది పూర్తిగా తెలియరాలేదని తెలిపారు. తాళాలు వేసి ఉన్న పశువైద్యశాలలోనే ఘటన రోజూ విధులు ముగియగానే పశువైద్యశాలకు తాళాలు వేసి, సమీపంలోని ఇంట్లో ఇచ్చి వెళ్తారు. కానీ సోమవారం పశువైద్యశాలకు వచ్చిన కీర్తికెనయన్ ఆస్పత్రి తాళాలు వారి దగ్గర నుంచి తీసుకోకుండానే లోపలికి ప్రవేశించాడు. అదికూడా గది వెనుకవైపున గడియపెట్టకుండా ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళ్లడాన్ని బట్టి చూస్తే ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కీర్తి కెనయన్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందే విషద్రావకం కూడా తాగినట్లు తెలుస్తోంది. -
పశువైద్యాధికారికి బదులుగా వోఎస్ భర్త!
ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడనుకుంటే పొరపాటే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్య కేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు. ఇక్కడ ఓ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదంటూ తప్పించుకున్నారు. కాగా, ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు. – బొబ్బిలి రూరల్ -
గోపాల మిత్రల గోడు పట్టదా..?
♦ పట్టించుకోని ప్రభుత్వం ♦ రూ.2 వేల జీతంతో ఆర్థిక ఇబ్బందులు ♦ ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్న గోపాలమిత్రలు నిడదవోలు: గోపాలమిత్రల బతుకులు దుర్భరంగా మారాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్నా అందేది అంతంత మాత్రం వేతనమే.. ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నా వేతనాలు పెంచడం లేదని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్యాధికారికి, రైతుకు అనుసంధానకర్తగా పశుగణాభివృద్ధి సంస్థలో జిల్లా వ్యాప్తంగా 180 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గ్రామగ్రామాన తిరుగుతూ పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అరకొర వేతనాలు రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి పశువులకు వైద్యం అందించడం వీరి ప్రధాన బాధ్యత. అయితే వీరు ఇంత చాకిరీ చేస్తున్నా అరకొర వేతనాలే అందుతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమవుతోందని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుసంపద పెంచడానికి కృషి చేసేందుకు ‘రైతుల ముంగిటకే వైద్యం’ అనే నినాదంతో 2000 సంవత్సరంలో గోపాలమిత్రలను ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ.2000 వేతనం ఇస్తున్నారు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తే అదనంగా మరో రూ.1500 చెల్లిస్తారు. లేదంటే గౌరవ వేతనం మాత్రమే అందుతుంది. విధులు ⇔ రైతులకు పశుగ్రాసం, మేతపై అవగాహన కల్పించడం ⇔ పశువైద్యాధికారి సహకారంతో గ్రామాల్లో గర్భకోçశ వ్యాధులపై చికిత్స శిబిరాలు, పశు విజ్ఞాన సదస్సులు నిర్వహించడం ⇔ రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చేయడం ⇔ కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించి మేలు జాతి పశుసంతతిని అభివృద్ధి పర్చడం ⇔ పశువులకు బీమా చేయించడం ఇవీ డిమాండ్లు.. ⇔ పశుసంవర్ధకశాఖలో గోపాలమిత్రలను వీఏలుగా నియమిస్తామనే ప్రభుత్వ హామీని నెరవేర్చడం ⇔ పశువైద్యశాలలో గోపాలమిత్రలకు 50 శాతం కోటా కల్పించి, కార్యాలయ సబార్డినేట్లుగా నియమించడం ⇔ కనీస వేతనం రూ.13,500 కల్పించడం ⇔ ప్రమాదంలో మరణించిన వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా చెల్లింపు ⇔ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ∙రవాణా చార్జీల చెల్లింపు -
పశువుల డాక్టర్ పశువుగా మారి..
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దైవ సేవలాంటి వైద్య వృత్తి చేసుకుంటూ ఓ వ్యక్తి అనైతికి చర్యకు పాల్పడ్డాడు. గేదేకు వైద్యం చేసేందుకు ఓ ఇంటికి వెళ్లి అక్కడ గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వైద్యుడిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ముజఫర్ నగర్ లోని కాతుబ్పూర్ అనే గ్రామంలో తమ గేదెకు వైద్యం చేసేందుకు రావాల్సిందిగా కోరడంతో రామ్ నివాస్ అనే పశువుల డాక్టర్ ఆ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భర్త లేనిది చూసి 35 ఏళ్ల గృహిణిపై లైంగిక దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడట. ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల లైంగిక దాడుల సంఘటనలు అధికంగా జరుగుతున్న విషయం తెలిసిందే.