పశువైద్యాధికారి కీర్తి కెనయన్ (ఫైల్) ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ కీర్తి కెనయన్, పరిశీలిస్తున్న ఎస్‌ఐ నాగస్వామి
అనంతపురం , గుంతకల్లు రూరల్ : మండలంలోని పాతకొత్తచెరువు పశువైద్యాధికారిగా పనిచేస్తున్న కీర్తికెనయన్ (33) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెటర్నరీ డాక్టర్ కీర్తికెనయన్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వైఎస్సార్ కడపలో స్థిరపడ్డారు. తిరుపతిలో యూజీకోర్సు చదువుతుండగా అక్కడే శ్రీకాకుళానికి చెందిన రాధాకుమారితో పరిచయం ఏర్పడి, అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వెటర్నరీ వైద్యులు కాబోయే తరుణంలో వివాహం చేసుకున్నారు. గుంతకల్లు మండలం వెటర్నరీ వైద్యురాలిగా రాధాకుమారి, వజ్రకరూరు వెటర్నరీవైద్యుడిగా కీర్తికెనయన్‌లు బాధ్యతలు స్వీకరించారు.
ఏడాది తరువాత రాధాకుమారి గుంతకల్లు నుంచి వజ్రకరూరుకు బదిలీ కాగా, కీర్తికెనయన్ వజ్రకరూరు నుంచి గుంతకల్లు మండలానికి బదిలీ అయ్యారు. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. మహాశివరాత్రి సందర్భంగా సెలవు అయినా ఇంటినుంచి ఆస్పత్రికి వెళ్లిన కీర్తికెనయన్ సాయంత్రానికి గానీ ఇంటికి చేరుకోలేదు. ఫోన్‌లోకూడా అందుబాటులో లేడు. అనుమానం వచ్చిన అతనిభార్య రాధాకుమారి వెంటనే నాగసముద్రం వెటర్నరీ వైద్యుడు దీపక్‌కుమార్, విడపనకల్లు వెటర్నరీ వైద్యుడు నరేష్‌కు సమాచారం అందించారు. వెంటనే పాతకొత్తచెరువులోని ఆస్పత్రి వద్దకు చేరుకున్న డాక్టర్ నరేష్ ఆస్పత్రిలోకి వెళ్లి చూడగా అప్పటికే కీర్తికెనయన్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతజీవిగా వేలాడుతున్నాడు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రూరల్ సీఐ సాయిప్రసాద్‌ను మాట్లాడుతూ కీర్తి కెనయన్ ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా డిప్రెషన్‌కు లోనయ్యేవాడని, మూడేళ్లుగా చికిత్స పొందుతూ అందుకు మెడిసిన్ కూడా వాడుతున్నాడని అన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది పూర్తిగా తెలియరాలేదని తెలిపారు.
తాళాలు వేసి ఉన్న పశువైద్యశాలలోనే ఘటన
రోజూ విధులు ముగియగానే పశువైద్యశాలకు తాళాలు వేసి, సమీపంలోని ఇంట్లో ఇచ్చి వెళ్తారు. కానీ సోమవారం పశువైద్యశాలకు వచ్చిన కీర్తికెనయన్ ఆస్పత్రి తాళాలు వారి దగ్గర నుంచి తీసుకోకుండానే లోపలికి ప్రవేశించాడు. అదికూడా గది వెనుకవైపున గడియపెట్టకుండా ఉన్న తలుపు తీసుకొని లోపలికి వెళ్లడాన్ని బట్టి చూస్తే ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కీర్తి కెనయన్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందే విషద్రావకం కూడా తాగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment