పశువుల డాక్టర్ పశువుగా మారి.. | Veterinarian arrested for raping married woman | Sakshi
Sakshi News home page

పశువుల డాక్టర్ పశువుగా మారి..

Published Tue, Jun 21 2016 12:09 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

పశువుల డాక్టర్ పశువుగా మారి.. - Sakshi

పశువుల డాక్టర్ పశువుగా మారి..

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. దైవ సేవలాంటి వైద్య వృత్తి చేసుకుంటూ ఓ వ్యక్తి అనైతికి చర్యకు పాల్పడ్డాడు. గేదేకు వైద్యం చేసేందుకు ఓ ఇంటికి వెళ్లి అక్కడ గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు, ఆమె భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వైద్యుడిని అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం ముజఫర్ నగర్ లోని కాతుబ్పూర్ అనే గ్రామంలో తమ గేదెకు వైద్యం చేసేందుకు రావాల్సిందిగా కోరడంతో రామ్ నివాస్ అనే పశువుల డాక్టర్ ఆ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో భర్త లేనిది చూసి 35 ఏళ్ల గృహిణిపై లైంగిక దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెపై చేయి కూడా చేసుకున్నాడట. ముజఫర్ నగర్ ప్రాంతంలో ఇటీవల లైంగిక దాడుల సంఘటనలు అధికంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement