కిడ్నాప్ తర్వాత జరిగిన బాధితుడి వివాహం
అమ్మాయిలను ఎత్తుకెళ్లి, బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఘటనలు గురించి వినే ఉంటారు. కానీ అబ్బాయిలను కిడ్నాన్ చేసి పెళ్లిచేకోవడం అరుదనే చెప్పాలి. ఇక్కడా ఓ బ్యాచిలర్‌కి అలాంటి ‘చేదు’ అనుభవమే ఎదురైంది. ట్రీట్‌మెంట్ పేరిట ఇంటికి పిల్చి మరీ.. ఓ వెటర్నరీ డాక్టర్‌కు బలవంతంగా పెళ్లి చేశారు.
బిహార్ బెగుసురాయ్‌లో ఓ కుటుంబం.. పశువుకి వైద్యం చేసే నిమిత్తం ఇంటికి రావాలంటూ ఓ వైద్యుడికి బతిమాలింది. అత్యవసరం అనుకుని హుటాహుటినా సదరు గ్రామానికి వెళ్లాడు ఆ డాక్టర్. అయితే.. మార్గంమధ్యలోనే డాక్టర్‌ను ఎత్తుకెళ్లి.. బలవంతంగా వాళ్ల ఇంట్లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఈ విషయంలో ఆ డాక్టర్ ఇంట్లో తెలిసి.. షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ వెటర్నరీ డాక్టర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు తన కొడుకు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించారాయన. ఇదిలా ఉంటే.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. అక్కడ ఇది చాలా సర్వసాధారణమని వ్యవహారమని చెప్పారాయన. దీన్ని అక్కడ వరుడి కిడ్నాప్ లేదా పకడ్వా వివాహం అని పిలుస్తారని వెల్లడించారు.
అయితే ఇలాంటి ఘటనల్లో బాధితులు గనుక పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుత ఘటనపై సత్వరమే విచారణ జరపడమే కాకుండా నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment