మేథ్స్ సబ్జెక్ట్ కష్టం. అందులోని ట్రిగొనమెట్రీ మరింత కష్టం. ట్రిగొనమెట్రీ లోని పైథాగరస్ సిద్ధాంతం ఇంకాస్త కష్టం. ప్లస్ లు, మైనస్ లను ఎలాగో లాగించేయొచ్చు. త్రిభుజాలు, త్రికోణాల ట్రిగొనమెట్రీ (త్రికోణమితి) ని, పైథాగరస్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి, ఆ లెక్కల్ని పరిష్కరించటానికి ఒక గణిత శాస్త్రవేత్తకు ఉండేంత ఐ.క్యూ.లో పిసరంతైనా లేకుంటే బుర్ర తిరిగి పోతుంది. అలాంటిది ఈ అమ్మాయిలను చూడండి, త్రికోణమితిని ఉపయోగించి పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే ఐదు కొత్త సూత్రాలను కనుక్కున్నారు! లూసియానా లోని న్యూ ఆర్లీన్స్ కాలేజ్ విద్యార్థినులు... కాల్సియా జాన్సన్, నేకియా జాక్సన్ వీళ్లు.
మొదటిసారి 2022లో ఈ అమ్మాయిలు పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని సూత్రాలను ఆవిష్కరించారు. ఆ హద్దులను కూడా దాటి ఇప్పుడు ఐదు అదనపు రుజువులకు దారి తీసే ఐదు ప్రత్యక్ష రుజువులు కనిపెట్టారు. వీటివల్ల ట్రిగ్‌నామెట్రీని అర్థం చేసుకోవటం మరింత తేలిక అవుతుంది.
వీరు సాధించిన ఈ ఘనతను ప్రఖ్యాత ‘అమెరికన్ మేథమేటికల్ మంత్లీ‘ తన తాజా సంచికలో గొప్పగా ప్రచురించింది. అబ్బాయిలూ... మీరింకా ఫుట్ బాల్ గ్రౌండ్ లోనే ఉన్నారా.. మేథ్స్ పరిశోధనలో అమ్మాయిలు ఇంత పెద్ద గోల్ కొట్టారని తెలిసినా కూడా!!
Comments
Please login to add a commentAdd a comment