భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.
యమహా ఎంటీ-15
యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.
కేటీఎం 125 డ్యూక్
యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200
రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.
ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్
రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్‌ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్‌గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment