
ట్యాంకు లీకు.. రక్తమోడిన రోడ్డు
లూసియానా : మార్చురీ గది ట్యాంకు లీక్ కావడంతో వేల లీటర్ల రక్తం రోడ్డున పారడం కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోయారు. మరణించిన వారి శరీరాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత శరీర భాగాలను ప్రత్యేకంగా భద్రపరుస్తారు.
పోస్టుమార్టం నిర్వహించే సమయంలో మృత దేహాల నుంచి వచ్చే రక్తాన్ని ఓ ట్యాంకులో నింపుతారు. అలా నింపిన ట్యాంకులో బ్లాకేజ్ ఏర్పడటంతో రక్తం రోడ్డుపై పారినట్లు అధికారులు తెలిపారు. మార్చురీ గదిని ప్రైవేట్‌గా నడుపుతున్నారని చెప్పారు. అయితే, కొత్త యాజమాన్యం ఇందుకు తగిన అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు.