
లూసియానాలో ఓ తండ్రి కూతురుపై శివాలెత్తాడు. బెల్టు తీసుకొని చితక్కొట్టడమే కాకుండా ఆమె జుట్టును కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. వివరాల్లోకి వెళితే.. లూసియానాకు చెందిన అలెక్స్ జే హారిసన్(30) అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె తన ఫోన్‌లో స్నాప్ చాట్ డౌన్‌లోడ్ చేయడం చూశాడు. దాంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన అతడు తొలుత చేయి చేసుకున్నాడు.
అనంతరం ఇంట్లోని సోపాలో కూతురుని పడేసి బెల్టు తీసుకొని దాదాపు 50సార్లు పైగా కొట్టాడు. ఆ తర్వాత రెండు నిమిషాలు ఆగి వేరే గదిలోకి తీసుకెళ్లి ట్రిమ్మర్‌తో ఆమె జుట్టుమొత్తం కత్తిరించి గుండులా మార్చాడు. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తున్నా అతడు ఏమాత్రం కనికరించలేదు. పైగా మొబైల్ కెమెరాలోకి చూడాలంటూ ఆ తతంగం మొత్తం రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment