యూఎస్లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు | Deadly ice storm in US knocks out power, halts flights | Sakshi
Sakshi News home page

యూఎస్లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు

Published Sat, Dec 7 2013 11:52 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

యూఎస్లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు - Sakshi

యూఎస్లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు

యూఎస్లో నిన్న సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి.  యూఎస్లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. దాంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అయా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

 

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా పోలీసు వెళ్లేందుకు వచ్చి దాదాపు 12 గంటల పాటు డల్లాస్ ఫోర్త్ వర్త్ విమానాశ్రయంలో చిక్కుకుపోయానని ప్రయాణికులు మడిసన్ వివరించారు. మళ్లీ జన్మలో విమానంలో ప్రయాణం చేయకూడదనిపించిందని తెలిపారు. రైలు, బస్సు రవాణ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

 

అయితే మంచు తుపాన్ దాటికి ముగ్గురు మరణించారని ముస్సోరి మేయర్ వెల్లడించారు. ఒకరు గాయపడ్డారని వివరించారు. రోనాల్డ్ అర్నాల్డ్ అనే వ్యక్తిపై ఎనిమిది అడుగులు మందం గల మంచు చెరియలు విరిగిపడటంతో అతడు అక్కడికక్కేడే మరణించారని తెలిపారు. క్రిస్టమస్ పండగ సందర్భంగా పలు నగరాల్లో నిర్వహించతలపెట్టిన పేరెడ్లను మంచుతుపాన్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement