Arkansas
-
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
అదృష్టం అంటే అతడిదే..
అర్కాన్సాస్ : సాధారణ బ్యాంకు మేనేజర్ నుంచి కోటీశ్వరుడిలా మారే అరుదైన అవకాశం అతని సొంతమైంది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రితంనాటి అరుదైన వజ్రం సొంతం కావడంతో అతగాడి ఆనందానికి అవధుల్లేవు. వివరాల ప్రకారం వివరాల ప్రకారం నైరుతి అర్కాన్సాస్‌లోని బ్యాంకు మేనేజర్ కెవిన్ కినార్డ్కి చిన్నప్పటి నుంచి స్టేట్ పార్కుకు వెళ్లడం అలవాటు. అలా ఎప్పటిలాగే క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వెళ్లాడు. ఆరోజు కూడా సిఫ్టింగ్ చేస్తుండగా తళుక్కుమంటూ ఓ రాయి కనిపించింది. చూడటానికి క్రిస్టల్‌లా మెరుస్తుండటంతో చేతికున్న సంచిలో వేసుకున్నాడు. అలా దొరికిన రాయిని పరీక్షించి చూస్తే గానీ అసలు విషయం బయటపడలేదు. దాదాపు 48ఏళ్ల చరిత్రలో లభించిన రెండవ అరుదైన వజ్రం తన సొంతమైందని తెలిసి షాక్‌కి గురయ్యాడు. 9.07 క్యారెట్ల వజ్రం లభించడంతో ఒక్కసారిగా కెవిన్ కినార్డ్ పేరు మారుమ్రోగిపోయింది. -
వీడియో చూస్తుండగానే; ఎంత అదృష్టమో!
కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్లిన ఓ మహిళను అదృష్టం వరించింది. వజ్రాల పార్కుకు వెళ్లిన ఆమెకు 3.72 క్యారెట్ల డైమండ్ దొరికింది. ఈ ఘటన అమెరికాలోని ఆర్కన్సాస్లో గల క్రాటర్ ఆఫ్ డైమండ్స్ పార్కులో జరిగింది. ప్రజలను లోనికి అనుమతించే ప్రపంచంలోని ఏకైక డైమండ్ పార్కు ఇదేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌కు చెందిన మిరాండా హోలింగ్షెడ్ గత శుక్రవారం తన కుటుంబంతో కలిసి ఈ పార్కుకు వెళ్లారు. వజ్రాల వేట గురించి యూట్యూబ్‌లో వీడియో చూస్తూ తన కొడుకుతో సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో రెండు రాళ్ల మధ్య వజ్రం ఉండటాన్ని గమనించి వెంటనే దానిని ఒడిసిపట్టుకున్నారు. ఈ విషయం గురించి మిరాండా మాట్లాడుతూ..‘ వజ్రాల వేట కొనసాగించడం ఎలా అనే వీడియో చూస్తున్న సమయంలోనే నాకు ఈ విలువైన పసుపు పచ్చ వజ్రం దొరికింది. ఇది నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. దీనిని ఎవరూ కొనకపోతే ఉంగరం చేయించుకుంటా’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా గత వందేళ్ల కాలంలో ఈ డైమండ్ పార్కులో సందర్శకులకు వేలాది వజ్రాలు దొరికాయని అక్కడి అధికారులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడ్డుకు కొట్టుకువచ్చిన వజ్రం మిరాండాకు దొరికిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో..‘ అబ్బ ఎంత అదృష్టమో మీది. భలేగా వజ్రం సొంతం చేసుకున్నారే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఏటీఎం దొంగలు.. పోలీసులకు సవాల్
వాషింగ్టన్: టెక్నాలజీ నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలాంటి నేరాలు జరిగినా ఇట్టే పట్టేస్తున్నారు పోలీసులు. అయితే అర్కన్సాస్ పట్టణ పోలీసులకు మాత్రం ఓ చోర్ బ్యాచ్ పెద్ద సవాల్నే విసిరింది. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లి అవాక్కయ్యేలా చేసింది. ఆగష్టు 16న జరిగిన ఈ దొంగతనం వీడియోను కాన్వే పోలీసులు రిలీజ్ చేశారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఓ పెద్ద ట్రక్కుతో ఏటీఎం సెంటర్‌ను పగలకొట్టుకుంటూ వెళ్లిన నిందితులు మిషన్‌తో సహా ఊడపీకేశారు. ఆపై దానిని అదే వాహనానికి ఉన్న ఉన్న క్రేన్ సాయంతో ఎత్తుకెళ్లిపోయారు. ఉదయం డ్యూటీకి వచ్చిన ఓ బ్యాంకు సిబ్బంది అక్కడ జరిగిన భీభత్సాన్ని గుర్తించి చోరీ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. చోరికి గురైన మెషీన్ లో ఎంత డబ్బు ఉన్నదన్న విషయంపై బ్యాంకు అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు. ఏదైనా నిర్మాణ రంగానికి చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
- లిటిల్‌రాక్ సిటీలోని నైట్‌క్లబ్‌లో తూటాల వర్షం - 17 మందికి గాయాలు.. హైఅలర్ట్ లిటిల్‌రాక్: న్యూయార్క్‌లో వైద్యుడి కాల్పుల ఉదంతం జరిగిన కొద్ది గంటలకే.. అర్కాన్సస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ సిటీలో భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నైట్‌క్లబ్, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇది ఉగ్రదాడేమోననే భయంతో అక్కడివారు భయాందోళనకు గురయ్యారు. నైట్‌క్లబ్‌లో రెండు వర్గాలకు మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసిందని లిటిల్ రాక్ సిటీ పోలీస్ చీఫ్ కెన్టన్ బక్నర్ మీడియాకు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కాల్పులు జరిపిన దుండగుడిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. (న్యూయార్క్‌లో డాక్టర్ కాల్పులు.. సహవైద్యురాలి మృతి, ఆరుగురికి గాయాలు) -
యూఎస్‌లో భారీ మంచు తుపాన్
-
యూఎస్‌లో భారీ మంచు తుపాన్
వాషింగ్టన్: : యూఎస్‌లో శుక్రవారం సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్‌తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి. యూఎస్‌లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. -
యూఎస్‌లో మంచు తుపాన్: 1900లకు పైగా విమానాలు రద్దు
యూఎస్‌లో నిన్న సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్‌తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి. యూఎస్‌లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. దాంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అయా ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా పోలీసు వెళ్లేందుకు వచ్చి దాదాపు 12 గంటల పాటు డల్లాస్ ఫోర్త్ వర్త్ విమానాశ్రయంలో చిక్కుకుపోయానని ప్రయాణికులు మడిసన్ వివరించారు. మళ్లీ జన్మలో విమానంలో ప్రయాణం చేయకూడదనిపించిందని తెలిపారు. రైలు, బస్సు రవాణ కూడా ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే మంచు తుపాన్ దాటికి ముగ్గురు మరణించారని ముస్సోరి మేయర్ వెల్లడించారు. ఒకరు గాయపడ్డారని వివరించారు. రోనాల్డ్ అర్నాల్డ్ అనే వ్యక్తిపై ఎనిమిది అడుగులు మందం గల మంచు చెరియలు విరిగిపడటంతో అతడు అక్కడికక్కేడే మరణించారని తెలిపారు. క్రిస్టమస్ పండగ సందర్భంగా పలు నగరాల్లో నిర్వహించతలపెట్టిన పేరెడ్లను మంచుతుపాన్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.