అర్కాన్సాస్ : సాధారణ బ్యాంకు మేనేజర్ నుంచి కోటీశ్వరుడిలా మారే అరుదైన అవకాశం అతని సొంతమైంది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రితంనాటి అరుదైన వజ్రం సొంతం కావడంతో అతగాడి ఆనందానికి అవధుల్లేవు. వివరాల ప్రకారం వివరాల ప్రకారం నైరుతి అర్కాన్సాస్‌లోని బ్యాంకు మేనేజర్ కెవిన్ కినార్డ్‌కి చిన్నప్పటి నుంచి స్టేట్ పార్కుకు వెళ్లడం అలవాటు. అలా ఎప్పటిలాగే క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వెళ్లాడు. ఆరోజు కూడా సిఫ్టింగ్ చేస్తుండగా తళుక్కుమంటూ ఓ రాయి కనిపించింది. చూడటానికి క్రిస్టల్‌లా మెరుస్తుండటంతో చేతికున్న సంచిలో వేసుకున్నాడు. అలా దొరికిన రాయిని పరీక్షించి చూస్తే గానీ అసలు విషయం బయటపడలేదు. దాదాపు 48ఏళ్ల చరిత్రలో లభించిన రెండవ అరుదైన వజ్రం తన సొంతమైందని తెలిసి షాక్‌కి గురయ్యాడు. 9.07 క్యారెట్ల వజ్రం లభించడంతో ఒక్కసారిగా కెవిన్ కినార్డ్ పేరు మారుమ్రోగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment