వీడియో చూస్తుండగానే‌; ఎంత అదృష్టమో! | US Woman Found Diamond While Watching Youtube Video | Sakshi
Sakshi News home page

ఎల్లో డైమండ్‌ దొరికింది; నువ్వు అదృష్టవంతురాలివి!

Published Thu, Aug 22 2019 5:07 PM | Last Updated on Thu, Aug 22 2019 5:36 PM

US Woman Found Diamond While Watching Youtube Video - Sakshi

కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్లిన ఓ మహిళను అదృష్టం వరించింది. వజ్రాల పార్కుకు వెళ్లిన ఆమెకు 3.72 క్యారెట్ల డైమండ్‌ దొరికింది. ఈ ఘటన అమెరికాలోని ఆర్కన్‌సాస్‌లో గల క్రాటర్‌ ఆఫ్‌ డైమండ్స్‌ పార్కులో జరిగింది. ప్రజలను లోనికి అనుమతించే ప్రపంచంలోని ఏకైక డైమండ్‌ పార్కు ఇదేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌కు చెందిన మిరాండా హోలింగ్‌షెడ్‌ గత శుక్రవారం తన కుటుంబంతో కలిసి ఈ పార్కుకు వెళ్లారు. వజ్రాల వేట గురించి యూట్యూబ్‌లో వీడియో చూస్తూ తన కొడుకుతో సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో రెండు రాళ్ల మధ్య వజ్రం ఉండటాన్ని గమనించి వెంటనే దానిని ఒడిసిపట్టుకున్నారు.

ఈ విషయం గురించి మిరాండా మాట్లాడుతూ..‘ వజ్రాల వేట కొనసాగించడం ఎలా అనే వీడియో చూస్తున్న సమయంలోనే నాకు ఈ విలువైన పసుపు పచ్చ వజ్రం దొరికింది. ఇది నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. దీనిని ఎవరూ కొనకపోతే ఉంగరం చేయించుకుంటా’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా గత వందేళ్ల కాలంలో ఈ డైమండ్‌ పార్కులో సందర్శకులకు వేలాది వజ్రాలు దొరికాయని అక్కడి అధికారులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడ్డుకు కొట్టుకువచ్చిన వజ్రం మిరాండాకు దొరికిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో..‘ అబ్బ ఎంత అదృష్టమో మీది. భలేగా వజ్రం సొంతం చేసుకున్నారే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement