Diamond park
-
వీడియో చూస్తుండగానే; ఎంత అదృష్టమో!
కుటుంబంతో కలిసి సరదాగా బయటికి వెళ్లిన ఓ మహిళను అదృష్టం వరించింది. వజ్రాల పార్కుకు వెళ్లిన ఆమెకు 3.72 క్యారెట్ల డైమండ్ దొరికింది. ఈ ఘటన అమెరికాలోని ఆర్కన్సాస్లో గల క్రాటర్ ఆఫ్ డైమండ్స్ పార్కులో జరిగింది. ప్రజలను లోనికి అనుమతించే ప్రపంచంలోని ఏకైక డైమండ్ పార్కు ఇదేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌కు చెందిన మిరాండా హోలింగ్షెడ్ గత శుక్రవారం తన కుటుంబంతో కలిసి ఈ పార్కుకు వెళ్లారు. వజ్రాల వేట గురించి యూట్యూబ్‌లో వీడియో చూస్తూ తన కొడుకుతో సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో రెండు రాళ్ల మధ్య వజ్రం ఉండటాన్ని గమనించి వెంటనే దానిని ఒడిసిపట్టుకున్నారు. ఈ విషయం గురించి మిరాండా మాట్లాడుతూ..‘ వజ్రాల వేట కొనసాగించడం ఎలా అనే వీడియో చూస్తున్న సమయంలోనే నాకు ఈ విలువైన పసుపు పచ్చ వజ్రం దొరికింది. ఇది నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. దీనిని ఎవరూ కొనకపోతే ఉంగరం చేయించుకుంటా’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా గత వందేళ్ల కాలంలో ఈ డైమండ్ పార్కులో సందర్శకులకు వేలాది వజ్రాలు దొరికాయని అక్కడి అధికారులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడ్డుకు కొట్టుకువచ్చిన వజ్రం మిరాండాకు దొరికిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో..‘ అబ్బ ఎంత అదృష్టమో మీది. భలేగా వజ్రం సొంతం చేసుకున్నారే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
డాక్టర్ కేర్ హోమియోపతి ఆస్పత్రి ప్రారంభం
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): డైమండ్ పార్కు సమీపంలోని శ్రీకన్య ఫారŠూచ్యన్ హోటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన డాక్టర్ కేర్ హోమియోపతి ఆస్పత్రిని సోమవారం రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మందులకు నయం కాని జబ్బులకు సైతం హోమియోపతి వైద్యం సంపూర్ణంగా పనిచేస్తుందన్నారు. ఎన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రులు వచ్చినా, హోమియో చికిత్స మాత్రం ప్రత్యేకమేనన్నారు. దశాబ్ద కాలం పాటు వైద్య రంగంలో అనుభవం కలిగిన డాక్టర్ ఎ.ఎం.రెడ్డి విశాఖలో ఆస్పత్రి ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆస్పత్రి అధినేత ఎ.ఎం.రెడ్డి మాట్లాడుతూ విశాఖ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిన టీఎస్సార్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా తమ బ్రాంచులను తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రారంభిస్తామన్నారు. సుబ్బిరామిరెడ్డి సేవా పీఠం స్ఫూర్తితో రోగులకు సలహాలు అందిస్తామన్నారు. అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ అధినేత జి.శ్రీధర్‌రెడ్డి, విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు వరదారెడ్డి, పాలూరి శేషమాంబ, టి.ఎస్.ఎన్.మూర్తి, తదితరులు పాల్గొన్నారు.