అమెరికాలో మళ్లీ కాల్పులు | shooting at night club in Little Rock city of Arkansas | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు

Published Sat, Jul 1 2017 6:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

అమెరికాలో మళ్లీ కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పులు

- లిటిల్‌రాక్‌ సిటీలోని నైట్‌క్లబ్‌లో తూటాల వర్షం
- 17 మందికి గాయాలు.. హైఅలర్ట్‌


లిటిల్‌రాక్‌:
న్యూయార్క్‌లో వైద్యుడి కాల్పుల ఉదంతం జరిగిన కొద్ది గంటలకే.. అర్కాన్సస్‌ రాష్ట్ర రాజధాని లిటిల్‌ రాక్‌ సిటీలో భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో సుమారు 17 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నైట్‌క్లబ్‌, పరిసర ప్రాంతాలను చుట్టుముట్టారు. ఇది ఉగ్రదాడేమోననే భయంతో అక్కడివారు భయాందోళనకు గురయ్యారు.

నైట్‌క్లబ్‌లో రెండు వర్గాలకు మధ్య తలెత్తిన వివాదమే కాల్పులకు దారితీసిందని లిటిల్‌ రాక్‌ సిటీ పోలీస్‌ చీఫ్‌ కెన్టన్‌ బక్నర్‌ మీడియాకు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, కాల్పులు జరిపిన దుండగుడిని ఇంకా గుర్తించలేదని పేర్కొన్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement