నారాయణఖేడ్: అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు.
తన భార్యఅనంతసాగర్ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సాయిలు అనుమానం వ్యక్తం చేసేవాడు. జైపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన సాయిలు.. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. మొండెంను ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. తలను వేరు చేసి జైపాల్‌రెడ్డి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.
(చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం)
ఘటనాస్థలంలో రోధిస్తున్న కుటుంబ సభ్యులు, గుమిగూడిన గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment