ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు! | Irked over ignoring his calls, co-worker stabs woman to death | Sakshi
Sakshi News home page

ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు!

Published Mon, May 4 2015 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు!

ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు!

తనను కలవాలని, ఫోన్లో మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా.. వినిపించుకోకుండా, తన ఫోన్లు ఆన్సర్ చేయకుండా వదిలేయడంతో కోపం వచ్చిన ఓ వ్యక్తి.. తనతో పాటు ఆఫీసులో పనిచేసే సహోద్యోగినిని కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు! ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో జరిగింది. రామ్నారాయణ్ రామ్సుమేర్ (40) అనే వ్యక్తి.. తన సహోద్యోగిని పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

అక్కడికక్కడే ఆమెను పదే పదే కత్తితో పొడిచేసి, అక్కడినుంచి పారిపోయాడు. వాళ్లిద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. పని అయిపోయాక తనను కలవాలని అతడు అడిగేవాడు కానీ, ఆమె మాత్రం పట్టించుకునేది కాదు. విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆయన రామ్సుమేర్ను హెచ్చరించారు. దాంతో అతడు మరింత కసి పెంచుకుని, ఆమెను హతమార్చాడు. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ ప్రాంతానికి చెందినవారు. మహారాష్ట్రకు ఉద్యోగాల కోసం వలస వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement