ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తాండూరు మండలంలోని బోయపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలసుకున్న రక్షక్ సిబ్బంది మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.