Girl raped
-
బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. -
దళితుడి లాకప్‌డెత్?
సాక్షి, నంద్యాల : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒక దళిత వ్యక్తి శనివారం లాకప్‌డెత్‌కు గురైనట్లు తెలుస్తోంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంవల్లే అతని ప్రాణాలు పోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందు.. మైనర్ బాలిక హత్యాచారం ఘటనతో సంబంధం ఉన్న అనుమానంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారంతో గురువారం సాయంత్రం మరో ఆరుగురిని నందికొట్కూరు, ముచ్చుమర్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మొదట జూపాడు బంగ్లా పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ రెండు గంటల పాటు విచారించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేక నిందితులు అరిచిన అరుపులు తమకు వినిపించాయని వారంటున్నారు.అయితే, ఈ విచారణలో నలుగురు వ్యక్తులకు ఈ ఘటనతో సంబంధంలేదని తేలడంతో వారిని వదిలేసి అంబటి హుస్సేన్ అలియాస్ యోహాన్ (36), అంబటి ప్రభుదాస్‌ను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. వీరిద్దరినీ మిడుతూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శుక్రవారం అంతా విపరీతంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత నంద్యాల పట్టణంలోని సీసీఎస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, హుస్సేన్ మిడుతూరులో మృతిచెందితే నంద్యాల సీసీఎస్‌కు తరలించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారా? లేక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో మృతిచెందిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారా అన్న దానిపై స్పష్టతలేదు.బంధువులతో రాజీ..ఇక హుస్సేన్ చనిపోయాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు శనివారం ఉదయాన్నే ముచ్చుమర్రి, నందికొట్కూరు నుంచి నంద్యాలకు బయల్దేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు వీరిని అడ్డుకుని రహస్య ప్రాంతానికి తరలించారు. అక్కడ లాకప్‌డెత్ విషయంలో రాజీకి ప్రయత్నించినట్లు సమాచారం. వీరితో సంతకం చేయించుకున్న తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అప్పటివరకు క్యాజువ్యాలిటీలోనే ఉ.6 నుంచి సా.4 వరకు మృతదేహాన్ని ఉంచారు. ఆయాసంతో చనిపోయాడంట..ఇక బాధితులతో రాజీ ప్రయత్నం సఫలం కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని నందికొట్కూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తుండగా నిందితుడు పోలీస్ వాహనం నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుస్సేన్‌ను పట్టుకోవడంతో తనకు ఆయాసంగా ఉందని, గుండెనొప్పిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడని.. దీంతో పోలీసులు అతన్ని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. (నిజానికి.. దగ్గర్లోని నందికొట్కూరు ఆస్పత్రికి తరలించకుండా 60 కి.మీ దూరంలోని నంద్యాలకు తరలించారు.) డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు నిర్ధారించారని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే, మిడుతూరు పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం ఆ ప్రకటనలో తెలిపింది.నోట్లో గుడ్డలు కుక్కి మరీ..నిజానికి.. హుస్సేన్, ప్రభుదాస్ ఇద్దరూ అన్నదమ్ములు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులలో ఒక బాలుడికి వీరు మేనమామ అవుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుల్లో ఒకరైన పదో తరగతి బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని మాయం చేయడంలో హుస్సేన్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో మృతదేహం ఎక్కడ వేశారు.. ఆ సమయంలో ఎవరెవరున్నారు అన్న కోణంలో విచారణ సాగింది. ఈ సందర్భంగా మృతుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ రెండు చేతులు, వేళ్లు, కాళ్లు ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొట్టే సమయంలో బాధితుడు అరవకుండా నోట్లో గుడ్డ పేలికలు పెట్టినట్లు తెలుస్తోంది. చనిపోయిన తర్వాత మృతుడి నోరు తెరుచుకుని ఉండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది.రాజీ కుదిర్చిన టీడీపీ నేత?.. గుట్టుగా అంత్యక్రియలుమరోవైపు.. లాకప్‌డెత్ కేసులో నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజా ప్రతినిధి తండ్రి రాజీ కుదిర్చినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలిస్తామని చెప్పి రాజీచేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆ నేత ఇచ్చిన హామీ మేరకు హుస్సేన్ మృతిపై బంధువులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. హుస్సేన్ మృతదేహాన్ని పోలీస్ ఎస్కార్ట్ సాయంతో అంబులెన్స్ ద్వారా రాత్రి ఎనిమిది గంటల సమయంలో నంద్యాల నుంచి పాత ముచ్చుమర్రికి తరలించి అక్కడి శ్మశాన వాటికలో ఉంచారు. కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిచ్చి అంత్యక్రియలు గుట్టుగా పూర్తిచేయించారు. మృతుడికి తల్లి, ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తాళం వేసి పోస్టుమార్టం?మరోవైపు.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హుస్సేన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రొ. డాక్టర్ రాజశేఖర్ దీనిని పూర్తిచేశారు. ఈ గదికి లోపల వైపు తాళం వేసి మరీ ఈ ప్రక్రియను చేపట్టారు. ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఎవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారు. లాకప్‌డెత్ కానప్పుడు తాళంవేసి రహస్యంగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరమేంటని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికారం అండతో కేసును లాకప్‌డెత్ కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి..ఇక పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున హుస్సేన్ మృతిచెందినట్లు తెలిసింది. కానీ, ప్రభుదాస్ ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడనే సమాచారం తెలీకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అంతకుముందు.. హుస్సేన్‌ను హుటాహుటిన నంద్యాల సర్వజన ఆస్పత్రిలోని క్యాజువల్ వార్డుకు తరలించారు. పోలీసులు రోగుల సహాయకులను అక్కడ నుంచి పంపించేసి వార్డులోకి ఎవరూ వెళ్లకుండా కాపలా ఉన్నారు.హుస్సేన్‌ను మిడుతూరు నుంచి నంద్యాల సీసీఎస్ స్టేషన్‌కు అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి ఉదయం 5–6 గంటల సమయంలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు ఆరుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు దాదాపు 30 మంది కానిస్టేబుళ్లు ఆస్పత్రిని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. మీడియా సిబ్బంది ఎవరూ ఆసుపత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా, మృతుడి ఫొటోలు మీడియాకు లభ్యం కావడంతో వాటిని పోలీసులే దగ్గరుండి మరీ తొలగించారు.విచారణలో సస్పెండ్ అయిన పోలీసులు?మైనర్ బాలిక హత్యాచారం ఘటనలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, మరో సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కేసులో మొదటి నుంచి వీరు ఉండడంతో సస్పెండ్ అయిన తర్వాత కూడా వీరు పోలీసు విచారణలో పాల్గొన్నట్లు అత్యంత శ్వసనీయంగా తెలిసింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసే సమయంలో వీరిద్దరూ సంఘటన స్థలంలోనే ఉన్నట్లు సమాచారం. -
చిన్నారిని చిదిమేసిన మానవ మృగం
సాక్షి, పెద్దపల్లి, సుల్తానాబాద్/సుల్తానాబాద్ రూరల్: గంజాయి మత్తులో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణ హత్యకు ఒడిగట్టింది. జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేసిన ఈ దారుణ ఘటనపై స్థానికులు, పోలీసుల కథనమిలా.. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో నెలరోజులుగా కూలి పనికి కుదిరారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సమీప మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వలసకూలీ వినోద్ మాజ్హి ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు.ఈ క్రమంలో గురువారం రైస్‌మిల్లు ఆవరణలో కూలీల కోసం నిర్మించిన గదుల ఎదుట బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పాపతో కలిసి దంపతులు ఇంట్లోకి వెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేక దంపతులు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు చీకట్లో పాపను అపహరించాడు. అదే రైస్‌మిల్లు వెనకాల ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.తన బండారం బయటపడుతుందని భావించి పాప గొంతు నలిమి చంపి అక్కడే పొదల్లో పడేశాడు. కాగా, కొద్దిసేపటికి ఇంట్లోకి తల్లిదండ్రులు వచ్చి చూడగా.. ఓ పాప కనిపించలేదు. ఆందోళనతో సమీపంలో వెతికినా.. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్ పోలీసులకు చిక్కిన నిందితుడు ఈ క్రమంలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు.. గురువారం రాత్రి (శుక్రవారం వేకువజామున) సుమారు 2గంటల సమయంలో నిందితుడు వినోద్ మాజ్హి మిల్లు వద్ద తన బట్టలకు అంటిన మరకలను శుభ్రం చేస్తూ కనిపించాడు. అనుమానం వచి్చన పోలీసులు.. అతడిని విచారించగా విషయం మొత్తం చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.నిందితుడు పాపను తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డాగ్‌స్కా్వడ్ బృందం తనిఖీల్లో మరో ఇద్దరు నిందితులను అనుమానితులుగా గుర్తించగా పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. మరోవైపు.. రాత్రి ముగ్గురూ కలిసి మద్యం, గంజాయి తాగామని, ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయామని, ఆ ఘటనతో తమకు సంబంధంలేదని ఇద్దరు అనుమానితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. కాగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.దద్దరిల్లిన తెలంగాణ చౌక్ అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ చౌక్‌లోని రాజీవ్ రహదారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం గది ఎదుట బైఠాయించారు. చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించారు. -
కోలుకుంటున్న ‘ఉజ్జయిని’ బాలిక
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్‌లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు. బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్‌ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్పీ వివరించారు.. -
అర్ధనగ్నంగా రక్తమోడుతూ
ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. ఇది కూడా చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం -
ఆరేళ్ళ బాలికపై తండ్రి వరసైన వ్యక్తి అత్యాచారం
-
కూతురిపైనే పలు మార్లు అత్యాచారం.. మాట వినలేదని ఆమె శరీరాన్ని..
భోపాల్: ఎన్ని చట్టలు తెచ్చినా దేశంలో యువతులు, మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులే మృగాలుగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వావి వరసలు మరచిన ఓ తండ్రి క్రూర మృగంలా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లాలోని సాక్తాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి(14) తన తండ్రి త్రిలోక్‌చంద్(55)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తన కూతురిపైనే కన్నేసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురునే బెదిరింపులకు గురిచేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన త్రిలోక్‌చంద్ ఆమెపై దాడి చేశాడు. ఆమెను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టేశాడు. అనంతరం తన బంధువు సాయంతో గోనె సంచిని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న అజ్మన్ నదిలో పారేశాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు వ్యక్తలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేశ్ పెండ్రో తెలిపారు. -
బాలికపై కామాంధుడి పైశాచికం!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): బాలికపై కామాంధుడి పైశాచిక చర్య ఆలస్యంగా వెలుగుచూసింది. గోపాలపట్నంలో సంచలనం రేపిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం రైల్వే స్టేషన్ ప్రాంతం నేతాజీనగర్‌కు చెందిన బాలికపై స్థానికంగా నివాసముంటున్న కామాంధుడి కళ్లు పడ్డాయి. బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అనంతరం విషయం తెలుసుకున్న కామాంధుడు గర్భస్రావం కోసం మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోగా అధికంగా రక్తస్రావం జరిగింది. దీంతో గోపాలపట్నంలోని 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు తరలించాలని రిఫర్ చేశారు. అక్కడి నుంచి 108 వాహనంలో బాలికను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ తన పలుకుబడితో బాలికకు అబార్షన్ చేయించేశాడని, అనంతరం బాలికనూ, ఆమె తల్లినీ దాచేశాడని నేతాజీనగర్ వాసులు ఆరోపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఫిర్యాదు చేయకుండా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కామాంధుడికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలిక అప్పటికే 4 నెలల గర్భిణి అని, ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి తమతో గొడవ పడ్డాడని గోపాలపట్నం వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 108 వాహనంలో తరలించే సమయంలో ఆ సిబ్బంది వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కేజీహెచ్‌లో కూడా బాలిక గర్భం దాల్చిందనే అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. కానీ అలా ఎక్కడా జరగలేదు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గోపాలపట్నం సీఐ రమణయ్య చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం
సాక్షి,మణుగూరుటౌన్: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్‌నగర్‌కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్ చేసి వదిలేశారు. నరేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
దాచేపల్లి బంద్‌కు పిలుపు
గుంటూరు: దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటంతో స్థానికులు నార్కట్‌పల్లి-అద్ధంకి రహదారిపై బైఠాయించి వృద్ధుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గురువారం మధ్యాహ్నాంలోపు అరెస్ట్ చేస్తామని హమీ ఇవ్వడంతో గురువారం ఉదయం ఆందోళన విరమించారు. బాలికపై అత్యాచారానికి నిరసనగా గురువారం దాచేపల్లి బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. -
మానవ మృగాలను శిక్షించాలి
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్టీయూసీ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
బాలికపై ముగ్గురు యువకులు దారుణం
గౌహతి : ఐదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ దుర్ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ అయిపోగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దాంతో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడి చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. అది గమనించిన ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే 90శాతం కాలిన గాయాలు అవడంతో ప్రాణాలు పోయాయి. కాగా, ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జువైనల్స్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మంచినీళ్లడిగి... బాలికపై లైంగిక దాడి
సాక్షి, అశ్వారావుపేట రూరల్ : ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..అశ్వారావుపేట రూరల్ మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన బాలిక(15) తన చెల్లితో కలిసి ఈ నెల 2వ తేదిన ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో దమ్మపేట మండలానికి చెందిన పిక్కిలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చి మంచినీళ్లు అడిగాడు. దాంతో బాధితురాలి చెల్లి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చే సరికి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా అడ్డుకుంది. అడ్డుకుంటున్న చెల్లిపై దాడికి పాల్పడి బయటకు నెట్టివేశాడు. అనంతరం ఇంటి తలుపులు మూసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం సమయంలో ఇంటికి రాగా, బాధితురాలు సంఘటనను చెప్పింది. దాంతో గురువారం ఉదయం లైంగిక దాడి సంఘటనపై తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఏఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేశారు. దీనిపై అశ్వారావుపేట సీఐ అబ్బయ్య దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. -
తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. షామ్లీ జిల్లాలోని తనభవన్లో ముగ్గురు దుండగులు ఇంట్లో నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం బాధితురాలి తండ్రి పనిమీద బయటకువెళ్లిన సమయంలో దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి తల్లిని చితకబాది, బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్, సతీష్, జోనిలుగా గుర్తించారు. కాగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.